e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home బతుకమ్మ రాశి ఫలాలు

రాశి ఫలాలు

రాశి ఫలాలు

9.5.2021 నుంచి 15.5.2021 వరకు

మేషం

ప్రారంభించిన పనులు అనుకూలంగా లాభదాయకంగా పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలు సంతృప్తిగా కొనసాగుతాయి. అందరితోనూ మంచి స్నేహాన్ని పెంపొందించుకుంటారు. వ్యాపారస్తులకు భాగస్వాములతో సత్సంబంధాలు ఉంటాయి. డబ్బు చేతికి రావడంలో కొంత ఆలస్యం ఉండవచ్చు. సోదరులు, బంధువుల సహాయం లభిస్తుంది. సమాజంలో అందరితోనూ ప్రేమపూర్వకంగా పనులు నెరవేర్చుకుంటారు. వాహనాలవల్ల పనులు కలిసివస్తాయి. వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. దగ్గరి ప్రయాణాలు అనుకూలిస్తాయి. దూరపు ప్రయాణాలు వాయిదా పడతాయి. గృహ నిర్మాణ ఆలోచన సఫలీకృతమవుతుంది.

వృషభం

సేవా కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. ఆత్మీయులు, స్నేహితులతో సత్సంబంధాలు ఉంటాయి. వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. పనులలో కొంత ఆలస్యం ఉండవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి తోటి ఉద్యోగులు, పై అధికారులతో స్నేహభావం పెరుగుతుంది. తద్వారా పనులు నెరవేరుతాయి. సంతృప్తిగా ఉంటారు. అనవసరమైన వివాదాల్లోకి వెళ్లకుండా పనులపై మనసు నిలుపడం మంచిది. సమాజంలో అందరి సహకారం పొందుతారు. అనవసరమైన ప్రయాణాలు చేయవలసి రావచ్చు. తద్వారా ఖర్చులు పెరుగుతాయి. నియంత్రణ అవసరం. నిత్యవ్యాపారం అనుకూలంగా కొనసాగుతుంది. చదువులో రాణిస్తారు.

మిథునం

అధికారుల అండదండలు, కార్యసాఫల్యత ఉంటాయి. సహోద్యోగుల సహకారం అన్ని విధాలుగా లభిస్తుంది. ప్రారంభించిన పనులు నిరాటంకంగా పూర్తవుతాయి. పాత ఆర్థిక సమస్యలున్నా పనులు పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. పిల్లల చదువు విషయంలో కలిసివస్తుంది. ప్రయత్నాలు ఫలించి తాత్కాలికంగా ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. వృత్తి సంతృప్తికరంగా కొనసాగుతుంది. నిత్యవ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. సమస్యలను చాలామటుకు అధిగమించే అవకాశం ఉంది. ఆదాయంలో అస్థిరత, ఖర్చులు పెరగడం ఉంటుంది. నియంత్రణ, ఆదాయ అన్వేషణ అవసరం. ఇంట్లో కుటుంబపెద్దల సహకారం లభిస్తుంది. అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. సఫలీకృతులు అవుతారు.

కర్కాటకం

నిత్యవ్యాపారం కలిసివస్తుంది. వృత్తిలో సిబ్బంది సహాయ సహకారాలు బాగా ఉంటాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. రావలసిన సొమ్ము కొంత అందుతుంది. పనులు పూర్తి చేయడానికి సర్దుబాట్లు అవసరం కావచ్చు. ఆఫీసులో సహోద్యోగులతో అనుకూలత ఉంటుంది. అధికారులతో స్నేహభావం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు స్థానచలనం ఉండవచ్చు. కోర్టు పనులలో అనుకూలత ఉంటుంది. ప్రభుత్వ, రాజకీయ పనులు అనుకూలిస్తాయి. బంధువర్గంతో పనులు కలిసివస్తాయి. ఇంటాబయటా వాతావరణం అనుకూలంగా ఉంటుంది. అందరి సహకారం లభిస్తుంది.

సింహం

బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. ఆస్తుల తగాదాలు కొలిక్కి వస్తాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. వ్యవసాయ భూములు, వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. సాహసంతో పనులు చేస్తారు. పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. నిత్యవ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఆర్థిక లావాదేవీలు కలిసివస్తాయి. వ్యవసాయదారులకు అనుకూలమైన వారం. ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. కొత్త పెట్టుబడుల గురించి ఆలోచిస్తారు. ఆదాయం స్థిరపడి, క్రమేపీ పెరుగుతుండటంతో సంతృప్తిగా ఉంటారు. విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి.

కన్య

తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. తద్వారా సంతృప్తికరంగా ఉంటారు. ఉద్యోగ ప్రయత్నాలలో ఖర్చులు ఉండవచ్చు. పిల్లల చదువు విషయంలో అనుకూలిస్తుంది. పనులను పట్టుదలతో చేస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలకు అందరి సహకారం లభిస్తుంది. నలుగురితో చర్చించి పనులు చేపడతారు. తద్వారా ఆలస్యం జరగవచ్చు. అయినా, అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు, వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. పెద్ద మొత్తంలో పెట్టుబడులను కొన్ని రోజులకు వాయిదా వేసుకోవడం మంచిది. ఇంటాబయటా సంతృప్తిగా ఉంటారు. రావలసిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందుతుంది.

తుల

వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చదువుకు అనుకూలం. పనులలో రాణిస్తారు. ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు ఉండవచ్చు. సర్దుబాట్లు అవసరమవుతాయి. వ్యాపారస్తులు వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు చేస్తారు. అందరి సహకారంతో ముందుకు వెళతారు. మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. అనుకూల ఫలితాలు ఉంటాయి. పెద్దల విషయంలో గౌరవం, మర్యాద ప్రదర్శించడం సానుకూల ఫలితాలను ఇస్తుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. పనులలో అనవసరమైన చర్చలవల్ల కొంత అసంతృప్తి ఉండవచ్చు. మనసు నిలిపి పట్టుదలతో పూర్తి చేస్తారు. పారిశ్రామికవేత్తలకు సిబ్బందితో కొంత అనుకూలత ఉంటుంది.

వృశ్చికం

ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారస్తులకు ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారం ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతుంది. వ్యాపారస్తులు వ్యాపార విస్తరణకు ప్రయత్నిస్తారు. కొన్ని విషయాలలో అనుకూలత ఉంటుంది. కొన్నింట ఆలస్యం ఉండవచ్చు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు నలుగురి సహకారంతో ఫలిస్తాయి. చదువు, ఉద్యోగ ప్రయత్నాలు కొనసాగుతాయి. సంతృప్తిగా ఉంటూ, ఉత్సాహంతో పనులు చేస్తారు. నిర్లక్ష్య ధోరణివల్ల ఇబ్బందులు ఏర్పడవచ్చు. పట్టుదల, శ్రద్ధతో పనులు చేయడం అవసరం. కోర్టు పనులు కలిసివస్తాయి. నిత్యవ్యాపారం కొనసాగుతుంది.

ధనుస్సు

గతం కంటే అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు కలిసివస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. సమస్యలను అధిగమిస్తారు. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలుంటాయి. భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. ఇంటి వాతావరణం సంతృప్తినిస్తుంది. వస్తువులను కొనడంపై మనసు నిలుపుతారు. వివిధ కారణాలవల్ల ఆ పనుల్లో ఆలస్యం జరగవచ్చు. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. సర్దుబాట్లు అవసరం కావచ్చు. పనులలో జాప్యం ఉంటుంది కనుక పట్టుదలతో చేయడం అవసరం.సాంస్కృతిక, సేవా కార్యక్రమాలపై మనసు నిలిపినా, పాల్గొనకుండా దూరంగా ఉంటారు.

మకరం

తలపెట్టిన పనులు సంతృప్తిగా పూర్తవుతాయి. లాభదాయకంగా ఉంటాయి. ఆరోగ్యం విషయమై శ్రద్ధ చూపుతారు. ఉత్సాహంగా ఉంటారు. అనుకోని ఖర్చులు ముందుకు రావడంతో చేయవలసిన పనులలో ఆలస్యం ఉండవచ్చు. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పిల్లల చదువు, ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. పై చదువులకు ఆర్థిక సమస్యలు ఉండవచ్చు. వాటిని అధిగమించే అవకాశం ఉన్నది. ఇంట్లో భార్యాపిల్లలతో సంతృప్తిగా గడుపుతారు. బయట వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు కలిసివస్తాయి. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. బంధువర్గం అనుకూలంగా ఉంటుంది. పనులు నెరవేరుతాయి.

కుంభం

వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి ఊరట లభిస్తుంది. తాత్కాలికంగా ఉద్యోగం లభిస్తుంది. ఆఫీసులో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. పెద్దల విషయంలో మర్యాదగా ఉంటారు. అది కార్యసాఫల్యాన్నిస్తుంది. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. కొన్ని పనులలో ఆలస్యం ఉంటుంది. సర్దుబాట్లు అవసరం పడతాయి. వృథా ఖర్చులు ముందుకు రావచ్చు. ముఖ్యంగా ఖర్చుల నియంత్రణ అవసరం. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. విందులు, వినోదాలకు దూరంగా ఉంటారు. గతంలో పెట్టిన పెట్టుబడులు, ఆస్తులవల్ల కొంత ఆదాయం లభించవచ్చు. భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు.

మీనం

ఆస్తులు, వృత్తిపరంగా ఆదాయం పెరుగుతుంది. ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. కొత్త పనుల ప్రారంభంపై మనసు నిలుపుతారు. వ్యాపారంలో భాగస్వాముల అవగాహన పెంపొందుతుంది. వృత్తిలో సంతృప్తిని పొందుతారు. పెండింగ్‌లో ఉన్న కేసులు పరిష్కారమవుతాయి. అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇంటి వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. నలుగురిలో గౌరవ మర్యాదలు ఉంటాయి. సాహిత్య, సంగీత కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. మంచి అవకాశాలు వస్తాయి. ప్రయాణాలవల్ల పనులు నెరవేరుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపడం అవసరం. ఉత్సాహంతో, పట్టుదలతో పనులు చేస్తారు.

గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్‌., సెల్‌: 9885096295
ఈ మెయిల్‌ : [email protected]

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రాశి ఫలాలు

ట్రెండింగ్‌

Advertisement