శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Horoscope - Jan 29, 2021 , 06:00:00

29-01-2021 శుక్ర‌వారం.. మీ రాశి ఫ‌లాలు

29-01-2021 శుక్ర‌వారం.. మీ రాశి ఫ‌లాలు

మేషం: వృత్తి ఉద్యోగ రంగాల్లోనివారికి అభివృద్ధి ఉంటుంది. ఆక‌స్మిక ధ‌న‌లాభ‌ముంది. రాజ‌కీయ‌రంగంలో ఉన్న‌వారికి, క్రీడాకారుల‌కు అద్భుత‌మైన అవ‌కాశాలు ల‌భిస్తాయి. అన్నింటా విజ‌యాన్నే సాధిస్తారు. బంధు, మిత్రులు క‌లుస్తారు. శుభ‌వార్త‌లు వింటారు. 

వృష‌భం: ఆక‌స్మిక ధ‌న‌లాభంతో ఆనందిస్తారు. బంధు, మిత్రుల‌తో క‌లిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవ‌ద‌ర్శ‌నం చేసుకుంటారు. భ‌క్తి శ్ర‌ద్ధ‌లు అధికం అ‌వుతాయి. స్థిరాస్తుల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రింప‌బ‌డుతాయి. నూత‌న గృహ‌కార్యాల‌పై శ్ర‌ద్ధ‌వ‌హిస్తారు. 

మిథునం: దూరపు బంధువుల‌తో కలుస్తారు. త‌ద్వారా లాభాలు ఉంటాయి. విదేశ‌యాన ప్ర‌య‌త్నాలు సంపూర్ణంగా నెర‌వేర్చుకుంటారు. ఆక‌స్మిక ధ‌న‌లాభ‌యోగం ఉంటుంది. అన్ని విష‌యాల్లో విజ‌యాన్ని సాధిస్తారు. శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేరుతాయి. ‌‌

క‌ర్కాట‌కం: ‌నూత‌నకార్యాలు ఆల‌స్యంగా ప్రారంభిస్తారు. అల్ప‌భోజ‌నం వ‌ల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విష‌యం మిమ్మ‌ల్ని మ‌న‌స్తాపానికి గురిచేస్తుంది. వీలైనంత‌వ‌ర‌కు అస‌త్యానికి దూరంగా ఉండ‌టం మంచిది. అన‌వ‌స‌ర భ‌యాందోళ‌న‌ల‌కు లోన‌వుతారు. 

సింహం: మానసిక ఆనందం ల‌భిస్తుంది. గ‌తంలో వాయిదా వేయ‌బ‌డిన ప‌నులు పూర్త‌వుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి. కొన్ని స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంది. ‌ 

క‌న్య‌: విదేశయాన ప్ర‌య‌త్నాల‌కు అనుకూలంగా ఉంటుంది. ప్ర‌యాణాలు ఎక్కువగా చేస్తారు. మెల‌కువ‌గా ఉండ‌టం అవ‌స‌రం. స్థాన‌చ‌ల‌నం ఏర్ప‌డే అవ‌కాశాలు ఉంటాయి. రుణ‌లాభం పొందుతారు. ఎల‌ర్జీతో బాధ‌ప‌డేవారు జాగ్ర‌త్త‌గా ఉండాలి. ప్ర‌య‌త్న‌కార్యాల‌కు ఆటంకాలు ఉంటాయి. 

తుల‌: అనారోగ్య బాధ‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతారు. స్థాన‌చ‌ల‌న సూచ‌న‌లు ఉంటాయి. నూత‌న వ్య‌క్తులు క‌లుస్తారు. కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉండ‌క‌పోవ‌డంతో మాన‌సిక ఆందోళ‌న చెందుతారు. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు దూర‌మ‌వుతాయి. 

వృశ్చికం: విదేశ‌యాన ప్ర‌య‌త్నం సుల‌భ‌మ‌వుతుంది. కుటుంబ క‌ల‌హాల‌కు తావీయ‌కూడ‌దు. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంది. పిల్ల‌ల‌తో జాగ్ర‌త్త వ‌హించ‌డం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగంలోని వారికి ఆటంకాలు ఎదుర‌వుతాయి. ఆరోగ్యం గురించి ప్ర‌త్యేక శ్ర‌ద్ధ అవ‌స‌రం. 

ధ‌నుస్సు: క‌ళాకారుల‌కు, మీడియా రంగాల‌వారికి మంచి అవ‌కాశాలు ల‌భిస్తాయి. దేహాలంక‌ర‌ణ‌కు ఎక్కువ ప్రాధాన్య‌మిస్తారు. కుటుంబ‌సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రుల‌ను క‌లుస్తారు. పేరు, ప్ర‌తిష్ఠ‌లు సంపాదిస్తారు. నూత‌న వ‌స్తు, వ‌స్త్ర‌, ఆభ‌ర‌ణాల‌ను పొందుతారు. 

మ‌క‌రం: రుణ‌ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉండ‌క మాన‌సిక ఆందోళ‌న చెందుతారు. స్త్రీల‌కు స్వ‌ల్ప అనారోగ్య బాధ‌లు ఉంటాయి. బంధు, మిత్రుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది. 

కుంభం: రుణ‌ప్ర‌య‌త్నాలు తొంద‌ర‌గా ఫ‌లిస్తాయి. స్థాన‌చ‌ల‌న సూచ‌న‌లు ఉంటాయి. శుభ‌కార్యాల మూల‌కంగా ధ‌న‌వ్య‌యం అధిక‌మ‌వుతుంది. ప్ర‌యాణాలు ఎక్కువగా చేస్తారు. అనారోగ్యం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త అవ‌స‌రం. 

మీనం: స‌్థిరాస్తుల విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది. ఒక అద్భుత అవ‌కాశాన్ని కోల్పోతారు. నూత‌న వ్య‌క్తుల ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. ప్ర‌యాణాల వ‌ల్ల లాభాన్ని పొందుతారు. త‌ల‌చిన కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి. నూత‌న కార్యాలు వాయిదా వేసుకోక త‌ప్ప‌దు. 


పంచాంగ‌క‌ర్త‌..
గౌరీభ‌ట్ల రామ‌కృష్ణ‌శ‌ర్మ సిద్ధాంతి
మేడిప‌ల్లి, ఉప్ప‌ల్‌, హైద‌రాబాద్‌
9440 350 868

VIDEOS

logo