శనివారం 27 ఫిబ్రవరి 2021
Horoscope - Jan 24, 2021 , 05:56:15

24-01-2021 ఆదివారం.. మీ రాశిఫ‌లాలు

24-01-2021 ఆదివారం.. మీ రాశిఫ‌లాలు

మేషం: ఆక‌స్మిక ధ‌న‌లాభ‌యోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తిక‌రంగా ఉంటారు. పేరు, ప్ర‌తిష్ఠ‌లు ల‌భిస్తాయి. సంఘంలో గౌర‌వ మ‌ర్యాద‌లు ఉంటాయి. అంత‌టా అనుకూల వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధు, మిత్రులు క‌లుస్తారు. 

వృష‌భం: విదేశ‌యాన ప్ర‌య‌త్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య‌బాధ‌లు అధిక‌మ‌వుతాయి. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంది. బంధు, మిత్రుల‌తో విరోధం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త వ‌హించ‌డం మంచిది. అన‌వ‌స‌ర వ్య‌య‌ప్ర‌యాస‌లు ఉంటాయి. ప్ర‌యాణాలు ఎక్కువ చేస్తారు. 

మిథునం: ప‌్ర‌య‌త్న‌కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి. బంధుమిత్రుల‌తో జాగ్ర‌త్త‌గా మెల‌గ‌డం మంచిది. ఆక‌స్మిక క‌ల‌హాల‌కు అవ‌కాశం ఉంటుంది. ధ‌న‌న‌ష్టాన్ని అధిగ‌మించ‌డానికి రుణ‌ప్ర‌య‌త్నం చేస్తారు. కుటుంబ విష‌యాల్లో మార్పులు ఉంటాయి. 

క‌ర్కాట‌కం: నూత‌న కార్యాల‌కు చ‌క్క‌ని రూప‌క‌ల్ప‌న చేస్తారు. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రుల‌తో క‌లిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభ‌వార్త‌లు వింటారు. మ‌నోల్లాసాన్ని పొంది ఆనందంగా కాల‌క్షేపం చేస్తారు. 

సిహం: ప‌్ర‌య‌త్న కార్యాల‌న్నీ సంపూర్ణంగా ఫ‌లిస్తాయి. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఏర్ప‌డుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్ల‌ల‌కు సంతోషాన్ని క‌లుగ‌జేస్తారు. క‌ళాత్మ‌క వ‌స్తువుల‌ను సేక‌రిస్తారు. బంధు, మిత్రుల‌ను క‌లుస్తారు. కొత్త కార్యాల‌కు చ‌క్క‌ని రూప‌క‌ల్ప‌న చేస్తారు. 

క‌న్య‌: కొన్ని ముఖ్య‌మైన ప‌నులు వాయిదా వేసుకుంటారు. మాన‌సిక చంచ‌లంతో ఇబ్బంది ప‌డుతారు. సోమ‌రిత‌నం ఆవ‌హిస్తుంది. పిల్ల‌ల‌ప‌ట్ల మిక్కిలి జాగ్ర‌త్త వ‌హిస్తారు. కొన్ని మంచి అవ‌కాశాల‌ను కోల్పోతారు. ఆర్థిక ప‌రిస్థితిలో మార్పులు ఉండ‌వు. 

తుల‌: అనుకూల స్థాన‌చ‌ల‌నం క‌లిగే అవ‌కాశాలు ఉన్నాయి. గృహంలో మార్పును కోరుకుంటారు. ఇత‌రుల విమ‌ర్శ‌ల‌కు లోన‌వుతారు. స్థిర‌మైన నిర్ణ‌యాలు తీసుకోలేరు. ఆక‌స్మిక ధ‌న‌వ్య‌యం అయ్యే అవ‌కాశం ఉంది. బంధు, మిత్రుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది. రుణ‌ప్ర‌య‌త్నాలు చేస్తారు. 

వృశ్చికం: ఆరోగ్యం గురించి జాగ్ర‌త్త‌ప‌డ‌టం మంచిది. ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. విదేశ‌యాన ప్ర‌య‌త్నాల‌కు మార్గం సుగ‌మ‌మ‌వుతుంది. కుటుంబ క‌ల‌హాల‌కు దూరంగా ఉంటే మేలు. స‌హ‌నం అన్నివిధాలా శ్రేయ‌స్క‌రం. డ‌బ్బును పొదుపుగా వాడు‌తారు. 

ధ‌నుస్సు: వ‌్యాపారంలో విశేష‌లాభాన్ని ఆర్జిస్తారు. మంచివారితో స్నేహం చేస్తారు. అంత‌టా సుఖ‌మే ల‌భిస్తుంది. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. బంధు, మిత్రుల స‌హాయ స‌హ‌కారాలు ల‌భిస్తాయి. ఒక ముఖ్య‌మైన స‌మాచారాన్ని సేక‌రిస్తారు. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాల‌ను కొనుగోలు చేస్తారు. 

మ‌క‌రం: పిల్లల‌వ‌ల్ల ఇబ్బందుల‌ను ఎదుర్కొంటారు. అధికారుల‌తో గౌర‌వింప‌బ‌డుతారు. ప‌ట్టుద‌ల‌తో కొన్ని కార్యాలు పూర్తిచేసుకుంటారు. అనారోగ్య బాధ‌లు తొలగిపోతాయి. ప్ర‌యాణాలు జాగ్ర‌త్త‌గా చేయ‌డం మంచిది. నూత‌న వ్య‌క్తులు ప‌రిచ‌యం అవుతారు. 

కుంభం: ప‌్ర‌య‌త్న‌కార్యాల‌న్నీ వెంట‌నే ఫ‌లిస్తాయి. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఏర్ప‌డుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాల‌ను పొందుతారు. కుటుంబ సౌఖ్యం ల‌భిస్తుంది. బుణ‌బాధ‌లు తొల‌గిపోతాయి. ధైర్య‌సాహ‌సాల‌తో ముందుకు వెళ్తారు. 

మీనం: ప‌్ర‌య‌త్న కార్యాల్లో దిగ్విజ‌యాన్ని పొందుతారు. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాల‌క్షేపం చేస్తారు. ఒక ముఖ్య‌మైన ప‌ని పూర్తికావ‌డంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి, ప్ర‌తిష్ఠ‌లు పొందుతారు. శాశ్వ‌త ప‌నుల‌కు శ్రీకారం చుడ‌తారు. 


పంచాంగ‌క‌ర్త‌..
గౌరీభ‌ట్ల రామ‌కృష్ణ‌శ‌ర్మ సిద్ధాంతి
మేడిప‌ల్లి, ఉప్ప‌ల్‌, హైద‌రాబాద్‌
9440 350 868

VIDEOS

logo