శనివారం 27 ఫిబ్రవరి 2021
Horoscope - Jan 21, 2021 , 06:14:15

21-01-2021.. గురువారం మీ రాశిఫ‌లాలు

21-01-2021.. గురువారం మీ రాశిఫ‌లాలు

మేషం: అన‌వ‌స‌ర‌మైన భ‌యాందోళ‌న‌లు తొల‌గిపోతాయి. ప్ర‌యాణాలు జాగ్ర‌త్త‌గా చేయ‌డం మంచిది. వృత్తి ఉద్యోగ‌రంగాల్లో స్థాన‌చ‌ల‌న సూచ‌న‌లు ఉన్నాయి. ఆర్థిక ప‌రిస్థితిలో మార్పులు ఉంటాయి. రుణ‌ప్ర‌య‌త్నాలు చేస్తారు. ఆత్మీయుల స‌హ‌కారం ఆల‌స్యంగా ల‌భిస్తుంది. 

వృష‌భం: స‌్థిరాస్తుల‌కు సంబంధించిన విష‌యాల్లో స‌మ‌య‌స్ఫూర్తి అవ‌స‌రం. నిరుత్సాహంగా కాలంగ‌డుస్తుంది. అప‌కీర్తి వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. ఇత‌రుల‌కు అప‌కారం క‌లిగించే ప‌నుల‌కు దూరంగా ఉండ‌టం మంచిది. ప‌రిశుభ్ర‌త‌కు ప్రాధాన్య‌మిస్తే అనారోగ్య బాధ‌లు ఉండ‌వు. 

మిథునం: ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం ప‌ట్ల జాగ్ర‌త్త అవ‌స‌రం. కొన్ని ముఖ్య‌మైన కార్య‌క్ర‌మాలు వాయిదా వేసుకోవాల్సి వ‌స్తుంది. స్వ‌ల్ప అనారోగ్య‌బాధ‌లు ఉంటాయి. వృధాప్ర‌యాణాలు చేస్తారు. స్థాన‌చ‌ల‌న సూచ‌న‌లు ఉన్నాయి. స‌న్నిహితుల‌తో విరోధ‌మేర్ప‌డ‌కుండా వెల‌గ‌డం మంచిది. 

క‌ర్కాట‌కం: త‌ర‌చూ ప్ర‌యాణాలు చేయాల్సి వ‌స్తుంది. అకాల భోజ‌నం వ‌ల్ల ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న విష‌యాల్లో మాన‌సిక ఆందోళ‌న చెందుతారు. వృత్తిరీత్యా జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది. స‌హ‌నం అన్నివిధాలా శ్రేయ‌స్క‌రం. ఆవేశంవ‌ల్ల కొన్నిప‌నులు చెడిపోతాయి. 

సింహం: బ‌ంధు, మిత్రుల‌తో క‌లుస్తారు. నూత‌న గృహ‌నిర్మాణ ప్ర‌య‌త్నం చేస్తారు. ఆక‌స్మిక ధ‌న‌లాభంతో రుణ‌బాధ‌లు తొల‌గిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శ‌తృబాధ‌లు దూర‌మ‌వుతాయి. దీర్ఘ‌కాలిక స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. 

క‌న్య‌: ఆత్మీయుల స‌హ‌కారం ఆల‌స్యంగా ల‌భిస్తుంది. ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతారు. ప్ర‌యాణాలు జాగ్ర‌త్త‌గా చేయ‌డం మంచిది. అజీర్ణ‌బాధ‌లు అధిక‌మ‌వుతాయి. కీళ్ల‌నొప్పుల బాధ నుంచి ర‌క్షించుకోవ‌డం అవ‌స‌రం. మ‌నోవిచారాన్ని క‌లిగి ఉంటారు. 

తుల‌: తోటివారితో విరోధం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్తగా ఉండ‌టం మంచిది. వ్యాపార మూల‌కంగా ధ‌న‌న‌ష్టం క‌లిగే అవ‌కాశాలు ఉన్నాయి. వ‌ధా ప్ర‌యాణాలు ఎక్కువ‌గా చేస్తారు. కుటుంబ విష‌యాల్లో అనాస‌క్తితో ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవ‌డం అవ‌స‌రం. 

వృశ్చికం: ఒక ముఖ్య‌మైన స‌మాచారాన్ని అందుకుంటారు. ఆక‌స్మిక ధ‌న‌లాభ‌యోగం ఉంటుంది. ప్ర‌య‌త్న‌కార్యాల్లో విజ‌యం సాధిస్తారు. బంధు, మిత్రుల‌తో క‌లుస్తారు. క్రీడాకారులు, రాజ‌కీయ‌రంగాల్లోవారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాల‌క్షేపం చేస్తారు. 

ధ‌నుస్సు: ధ‌ర్మ‌కార్యాలు చేయ‌డంపై ఆస‌క్తి పెరుగుతుంది. దైవ‌ద‌ర్శ‌నం చేసుకుంటారు. కుటుంబ‌సౌఖ్యం ఉంటుంది. మాన‌సిక ఆనందాన్ని అనుభ‌విస్తారు. పేరుప్ర‌తిష్ట‌లు ల‌భిస్తాయి. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. శుభ‌వార్త‌లు వింటారు. శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర్చుకుంటారు. 

మ‌క‌రం: శుభకార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర్చుకుంటారు. శుభ‌వార్త‌లు వింటారు. బంధు, మిత్రుల‌తో క‌లిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆక‌స్మిక ధ‌న‌లాభాన్ని పొందుతారు. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాల‌ను ఖ‌రీదు చేస్తారు. ముఖ్య‌మైన కార్యాలు పూర్త‌వుతాయి.

కుంభం: కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మాన‌సిక ఆనందాన్ని పొందుతారు. ప్ర‌తివిష‌యంలో వ్య‌య‌, ప్ర‌యాస‌లు త‌ప్ప‌వు. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. వృత్తిరీత్యా కొత్త స‌మ‌స్య‌లు ఎదుర్కొంటారు. బంధు, మిత్రుల‌తో క‌ల‌హాలు ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డటం మంచిది. 

మీనం: అప‌కీర్తి రాకుండా జాగ్ర‌త్త‌ప‌డటం మంచిది. మ‌నోల్లాసాన్ని పొందుతారు. సోద‌రుల‌తో వైరం ఏర్ప‌డ‌కుండా మెల‌గాలి. త‌ల‌చిన కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆల‌స్యంగా తొల‌గిపోతాయి. నూత‌న వ్య‌క్తుల జోలికి వెళ్ల‌రాదు.


పంచాంగ‌క‌ర్త‌..
గౌరీభ‌ట్ల రామ‌కృష్ణ‌శ‌ర్మ సిద్ధాంతి
మేడిప‌ల్లి, ఉప్ప‌ల్‌, హైద‌రాబాద్‌
9440 350 868

VIDEOS

logo