బుధవారం 24 ఫిబ్రవరి 2021
Horoscope - Jan 18, 2021 , 06:03:56

ఈరోజు మీ రాశిఫ‌లాలు

ఈరోజు మీ రాశిఫ‌లాలు

వేషం: బ‌ంధు, మిత్రుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచింది. అనారోగ్య‌బాధ‌లు అధిక‌మ‌వుతాయి. రుణ‌ప్ర‌య‌త్నం ఫ‌లిస్తుంది. చెడు స‌హ‌వాసం వైపు వెళ్ల‌కుండా ఉంటే గౌర‌వం ద‌క్కుతుంది. క్ష‌ణికావేశం ప‌నికిరాదు. అనుకోకుండా కుటుంబంలో క‌ల‌త‌లు ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. 

వృష‌భం: వృత్తి ఉద్యోగ‌రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తుల‌కు సంబంధించిన విష‌యాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం. మాన‌సిక ఆందోళ‌న‌తో కాలం గ‌డుస్తుంది. ఆరోగ్య విష‌యంలో శ్ర‌ద్ధ‌వ‌హించ‌క త‌ప్ప‌దు. ప్ర‌య‌త్న‌కార్యాలు ఆల‌స్యంగా స‌ఫ‌ల‌మ‌వుతాయి. చెడు ప‌నుల‌కు దూరంగా ఉండ‌టం మంచిది. 

మిథునం: త‌ల‌చిన కార్యాల‌న్నీ విజ‌య‌వంతంగా పూర్తి చేసుకోగ‌లుగుతారు. బంధు, మిత్రుల మ‌ర్యాద మ‌న్న‌న‌ల‌ను పొందుతారు. అనారోగ్య బాధ‌లు ఉండ‌వు. స‌హ ఉద్యోగుల‌కు స‌హ‌క‌రించే అవ‌కాశం ల‌భిస్తుంది. మీ ఆలోచ‌న‌లు ప్ర‌ణాళికాబ‌ద్ధంగా ఉంటాయి. అనుకూల ప‌రిస్థితులు ఏర్ప‌డుతాయి. 

క‌ర్కాట‌కం: అన‌వ‌స‌ర ధ‌నవ్య‌యంతో రుణ ప్ర‌య‌త్నాలు చేయాల్సి వ‌స్తుంది. అనారోగ్య బాధ‌ల‌కు ఔష‌ధ‌సేవ అవ‌స‌రం. కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి. స‌హ‌నంగా ఉండ‌టం అన్నివిధాలా మేలు. బంధు, మిత్రుల‌తో విరోధం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌టం మంచిది. 

సింహం: ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాలు ఖ‌రీదు చేస్తారు. ముఖ్య‌మైన వ్య‌క్తుల‌ను క‌లుస్తారు. అన్నిరంగాల్లో అద్భుత విజ‌యాల‌ను సాధిస్తారు. నూత‌న కార్యాల‌ను ప్రారంభిస్తారు. రుణ‌విముక్తి ల‌భిస్తుంది. మాన‌సిక ఆనందాన్ని పొందుతారు. 

క‌న్య‌: గౌర‌వ మ‌ర్యాద‌లు పెరుగుతాయి. పిల్ల‌ల‌కు సంతోషం క‌లిగించే కార్యాలు చేస్తారు. శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేరుతాయి. వృత్తి, ఉద్యోగ‌రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆక‌స్మిక ధ‌న‌లాభం పొందుతారు. కుటుంబ‌సౌఖ్యం సంపూర్ణంగా ల‌భిస్తుంది. 

తుల‌: ఇత‌రులు మిమ్మ‌ల్మి ఆద‌ర్శంగా తీసుకోవ‌డానికి కృషి చేస్తారు. స్త్రీలు, బంధు, మిత్రుల‌ను క‌లుస్తారు. కుటుంబ‌ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి. ఆక‌స్మిక ధ‌న‌లాభంతో రుణ‌బాధ‌లు తొల‌గిపోతాయి. స‌మాజంలో మంచిపేరు సంపాదిస్తారు. 

వృశ్చికం: అధికారుల‌తో జాగ్ర‌త్త‌గా మెల‌గ‌డం మంచిది. అన‌వ‌స‌ర భ‌యం ఆవ‌హిస్తుంది. బంధుమిత్రుల స‌హాయ స‌హ‌కారాలు ల‌భిస్తాయి. మాన‌సిక ఆందోళ‌న‌తో కాలం గ‌డుస్తుంది. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంది. స్థిర‌మైన నిర్ణ‌యాలు తీసుకోలేక‌పోతారు. 

ధ‌నుస్సు: ముఖ్య‌మైన వ్య‌క్తుల‌ను క‌లుస్తారు. ఆక‌స్మిక లాభాలు ఉంటాయి. మిక్కిలి ధైర్య‌, సాహ‌సాలు క‌లిగి ఉంటారు. సూక్ష్మ‌బుద్ధితో విజ‌యాన్ని సాధిస్తారు. మీ ప‌రాక్ర‌మాన్ని ఇత‌రులు గుర్తిస్తారు. శ‌తృబాధ‌లు తొల‌గిపోతాయి. శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర్చుకుంటారు. 

మ‌క‌రం: శారీర‌క శ్ర‌మ‌తోపాటు, మాన‌సిక ఆందోళ‌న త‌ప్ప‌దు. చిన్న విష‌యాల‌కోసం ఎక్కువ‌గా శ్ర‌మిస్తారు. బంధు, మిత్రుల‌తో మ‌న‌స్ప‌ర్థ‌లు రాకుండా జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది. అనుకోకుండా డ‌బ్బు చేజారే అవ‌కాశాలు ఉన్నాయి. ఆరోగ్య విష‌యంలో మిక్కిలి శ్ర‌ద్ధ అవ‌స‌రం. 

కుంభం: దూర వ్య‌క్తుల ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. అప‌కీర్తి రాకుండా జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది. స్వ‌ల్ప అనారోగ్య బాధ‌లు ఉంటాయి. ప్ర‌యాణాల్లో వ్య‌య‌, ప్ర‌యాస‌లు త‌ప్ప‌వు. క‌ల‌హాల‌కు దూరంగా ఉండ‌టానికి ప్ర‌య‌త్నించాలి. 

మీనం: శుభ‌వార్త‌లు వింటారు. మ‌నోల్లాసాన్ని పొంది ఆనందంగా కాల‌క్షేపం చేస్తారు. నూత‌న కార్యాల‌కు చ‌క్క‌ని రూప‌క‌ల్ప‌న చేస్తారు. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రుల‌తో క‌లిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు.


 పంచాంగ‌క‌ర్త‌..
గౌరీభ‌ట్ల రామ‌కృష్ణ‌శ‌ర్మ సిద్ధాంతి
మేడిప‌ల్లి, ఉప్ప‌ల్‌, హైద‌రాబాద్‌
9440 350 868

VIDEOS

logo