ఈరోజు మీ రాశిఫలాలు

మేషం: ఆర్థిక పరిస్థితిలో మార్పులు ఉంటాయి. రుణప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. అనవసరమైన భయాందోళనలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. వృత్తి ఉద్యోగరంగాల్లో స్థానచలన సూచనలు ఉన్నాయి.
వృషభం: ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండటం మంచిది. పరిశుభ్రతకు ప్రాధాన్యమిచ్చినట్లయితే అనారోగ్య బాధలుండవు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి అవసరం. నిరుత్సాహంగా కాలం గడుస్తుంది. అపకీర్తి వచ్చే అవకాశం ఉంటుంది.
మిథునం: స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. వృధాప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగడం మంచిది. ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.
కర్కాటకం: వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. ఆవేశంవల్ల కొన్ని పనులు చెడిపోతాయి. తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు.
సింహం: దీర్ఘకాలిక సమస్యలు తొలగిపోపతాయి. ఆరోగ్యం బాగుంటుంది. బంధు మిత్రులతో కలుస్తారు. నూతన గృహనిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శతృబాధలు దూరమవుతాయి.
కన్య: కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుతారు. ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నులవుతారు. స్థ్రీలమూలకంగా లాభం ఉంది. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. రుణబాధలు తొలగిపోతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది.
తుల: కుటుంబ విషయాల్లో అనాసక్తితో ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం. తోటివారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. వ్యాపారం వల్ల ధననష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.
వృశ్చికం: ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. ప్రయత్నకార్యాల్లో విజయం సాధిస్తారు. బంధు మిత్రులతో కలుస్తారు. క్రీడాకారులు, రాజకీయరంగాల్లో ఉన్నవారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు.
ధనుస్సు: కుటుంబ సౌఖ్యం ఉంటుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. పేరుప్రతిష్ఠలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ధర్మకార్యాలు చేయడంలో ఆసక్తి పెరుగుతుంది. దైవదర్శనం చేసుకుంటారు.
మకరం: నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తి అవుతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు.
కుంభం: వృత్తిరీత్యా కొత్త సమస్యలను ఎదుర్కొంటారు. బంధు, మిత్రులతో కలహాలు ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మానసిక ఆనందాన్ని పొందుతారు. ప్రతి విషయంలో వ్యయ, ప్రయాసలు తప్పవు. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది.
మీనం: ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్లకూడదు. అపకీర్తి రాకుండా జాగ్రత్త పడటం మంచిది. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగాలి. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి.
పంచాంగకర్త..
గౌరీభట్ల రామకృష్ణశర్మ సిద్ధాంతి
మేడిపల్లి, ఉప్పల్, హైదరాబాద్
9440 350 868
తాజావార్తలు
- గాఢ నిద్రలో ఏనుగు పిల్ల.. తల్లి ఏనుగు ఏమి చేసిందంటే..
- టీచర్‌కు స్టూడెంట్ ఓదార్పు.. వైరల్ అవుతున్న లెటర్
- యువకుడి వేధింపులు.. వివాహిత ఆత్మహత్య.!
- రామ్‌తో కృతిశెట్టి రొమాన్స్..మేకర్స్ ట్వీట్
- కుక్కల దాడిలో 22 గొర్రెలు మృతి
- ఇండియా విజ్ఞప్తికి డోంట్ కేర్..సౌదీ ప్రతి సవాల్!
- భృంగివాహనంపై ఊరేగిన ముక్కంటీశుడు
- జగన్‌కు విదేశీ జైలు తప్పదు : నారా లోకేశ్
- జూబ్లీహిల్స్ శ్రీవారి ఆలయ తొలి బ్రహ్మోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ
- మహారాష్ట్రలో కొత్తగా 10,216 కరోనా కేసులు.. 53 మరణాలు