గురువారం 25 ఫిబ్రవరి 2021
Horoscope - Jan 11, 2021 , 06:09:41

ఈరోజు మీ రాశి ఫ‌లాలు

ఈరోజు మీ రాశి ఫ‌లాలు

మేషం: ఇత‌రుల‌కు ఇబ్బందిని క‌లుగ‌జేసే ప‌నుల‌ను మానుకోవాల్సి ఉంటుంది. వృత్తిలో ఇబ్బందులను అధిగ‌మిస్తారు. మీరు చేసే ప్ర‌తిప‌నిలో వ్య‌తిరేక ఫ‌లితాలు క‌లుగ‌కుండా జాగ్ర‌త్త అవ‌స‌రం. నూత‌న కార్యాలు ప్రారంభించ‌కుండా ఉంటే మంచిది. ధైర్య‌సాహ‌సాల‌తో నూత‌న కార్యాలు ప్రారంభిస్తారు. 

వృష‌భం: శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేరుతాయి. బంధు, మిత్రుల‌తో స‌ర‌దాగా గ‌డుపుతారు. ప్ర‌యాణాల‌వ‌ల్ల లాభం చేకూరుతుంది. శ్ర‌మ‌కు త‌గిన ప్ర‌తిఫ‌లం ల‌భిస్తుంది. ధ‌న‌చింత ఉండ‌దు. స‌మాజంలో గౌర‌వ‌మ‌ర్యాద‌లు ల‌భిస్తాయి. అన్నివిధాలా సుఖాన్ని పొందుతారు. 

మిథునం: కోపాన్ని అదుపులో ఉంచుకోవ‌డం మంచిది. మాన‌సిక ఆందోళ‌న‌ను తొల‌గించ‌డానికి దైవ‌ధ్యానం అవ‌స‌రం. శారీర‌క అనారోగ్యంతో బాధ‌ప‌డుతారు. కుటుంబ విష‌యాలు సంతృప్తిక‌రంగా ఉండ‌వు. వృధా ప్ర‌యాణాలు ఎక్కువవుతాయి. ధ‌న‌వ్య‌యం త‌ప్ప‌దు. 

క‌ర్కాట‌కం: ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాలు ఖ‌రీదు చేస్తారు. ముఖ్య‌మైన వ్య‌క్తుల‌ను క‌లుస్తారు. అన్నిరంగాల్లో అద్భుత విజ‌యాల‌ను సాధిస్తారు. నూత‌న కార్యాల‌ను ప్రారంభిస్తారు. రుణ‌విముక్తి ల‌భిస్తుంది. మాన‌సిక ఆనందం పొందుతారు. 

సింహం: ముఖ్య‌మైన వ్య‌క్తుల‌ను క‌లుస్తారు. ఆక‌స్మిక భ‌యాందోళ‌న‌లు దూర‌మ‌వుతాయి. రుణ‌ప్ర‌య‌త్నాలు ఆల‌స్యంగా ఫ‌లిస్తాయి. కుటుంబంలో మ‌న‌శ్శాంతి లోపిస్తుంది. బంధు మిత్రుల‌తో వైర‌మేర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌వ‌హించ‌డం మంచిది. ర‌హ‌స్య శ‌తృబాధ‌లుండే అవ‌కాశం ఉంది. 

క‌న్య‌: నూతన వ్య‌క్తుల‌ను న‌మ్మి మోస‌పోరాదు. సంఘంలో అప్ర‌తిష్ఠ‌రాకుండా జాగ్ర‌త్త‌ప‌డ‌టం మంచిది. ప్ర‌య‌త్న‌కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వ‌డంతో ఇబ్బంది ప‌డుతారు. దైవ‌ద‌ర్శనానికి ప్ర‌య‌త్నిస్తారు. రుణ‌ప్ర‌య‌త్నాలు ఆల‌స్యంగా ఫ‌లిస్తాయి. సోద‌ర‌వైరం క‌లిగే అవ‌కాశం ఉంటుంది. 

తుల‌: కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి. ధ‌న‌ధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజ‌యాన్ని సాధిస్తారు. ప్ర‌య‌త్న కార్యాలు ఫ‌లిస్తాయి. గృహంలో జ‌రిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధు, మిత్రుల‌తో క‌లుస్తారు. ప్ర‌యాణాలు లాభ‌దాయ‌కంగా ఉంటాయి. 

వృశ్చికం: ప‌్ర‌య‌త్నం మేర‌కు స్వ‌ల్ప‌లాభం ఉంటుంది. వృథా ప్ర‌యాణాలు ఎక్కువగా చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి. రుణ‌ప్ర‌య‌త్నాలు చేయ‌వ‌ల‌సి వ‌స్తుంది. నూత‌న కార్యాల‌కు శ్రీకారం చుడ‌తారు. బంధు, మిత్రుల స‌హ‌కారం ఆల‌స్యంగా ల‌భిస్తుంది. 

ధ‌నుస్సు: అకాల భోజ‌నాదుల‌వ‌ల్ల అనారోగ్యం ఏర్ప‌డుతుంది. పిల్ల‌ల ప‌ట్ల ఎక్క‌వ‌ప‌ట్టుద‌ల‌తో ఉండ‌టం అంత మంచిదికాదు. చెడు ప‌నుల‌కు దూరంగా ఉండ‌టం మంచిది. మ‌నోద్వేగానికి గుర‌వుతారు. కోపాన్ని త‌గ్గించుకోవ‌డం అన్నివిధాలా శ్రేయ‌స్క‌రం. కొత్త‌ప‌నులు ప్రారంభించ‌కూడ‌దు. 

మ‌క‌రం: బ‌ంధు, మిత్ర విరోధం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది. మాన‌సిక ఆందోళ‌న అధికం అవుతుంది. అనారోగ్య బాధ‌ల‌ను అధిగ‌మిస్తారు. అన‌వ‌స‌ర నింద‌ల‌తో అప‌కీర్తి వ‌స్తుంది. స్థిర‌మైన నిర్ణ‌యాలు తీసుకోలేరు. నూత‌న కార్యాల‌కు ప్ర‌ణాళిక‌లు వేస్తారు. 

కుంభం: త‌ల‌చిన కార్యాల‌న్నీ విజ‌యంతంగా పూర్తిచేసుకోలుగుతారు. బంధు, మిత్రుల మ‌ర్యాద మ‌న్న‌న‌ల‌ను పొందుతారు. అనారోగ్య‌బాధ‌లు ఉండ‌వు. స‌హ ఉద్యోగుల‌కు స‌హ‌క‌రించే అవ‌కాశం ల‌భిస్తుంది. మీ ఆలోచ‌న‌లు ప్ర‌ణాళికాబ‌ద్ధంగా ఉంటాయి. అనుకూల ప‌రిస్థితులు ఏర్ప‌డాయి. 

మీనం: వృత్తిరీత్యా ఇబ్బందుల‌ను అధిగ‌మిస్తారు. మాన‌సిక ఆందోళ‌న‌తో కాలం గ‌డుపుతారు. స్త్రీలు చేసే వ్య‌వ‌హారాల్లో స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం ఏర్ప‌డే అవ‌కాశం ఉటుంది. ర‌హ‌స్య శ‌త్రువుల‌ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది. ఏ విష‌యంలోనూ నిరుత్సాహం ప‌నికిరాదు. 


పంచాంగ‌క‌ర్త‌..
గౌరీభ‌ట్ల రామ‌కృష్ణ‌శ‌ర్మ సిద్ధాంతి
మేడిప‌ల్లి, ఉప్ప‌ల్‌, హైద‌రాబాద్‌
9440 350 868

VIDEOS

logo