శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Horoscope - Jan 20, 2021 , 06:05:42

ఈరోజు మీ రాశిఫ‌లాలు

ఈరోజు మీ రాశిఫ‌లాలు

మేషం: వృత్తిలో ఇబ్బందుల‌ను అధిగ‌మిస్తారు. మీరు చేసే ప్ర‌తి ప‌నిలో వ్య‌తిరేక ఫ‌లితాలు క‌లుగ‌కుండా జాగ్ర‌త్త అవ‌స‌రం. నూత‌న కార్యాలు ప్రారంభించ‌కుండా ఉంటే మంచిది. ధైర్య‌సాహ‌సాల‌తో నూత‌న కార్యాలు ప్రారంభిస్తారు. ఇత‌రుల‌కు ఇబ్బందిని క‌లుగ‌జేసే ప‌నుల‌ను మానుకోవాల్సి వ‌స్తుంది. 

వృష‌భం: నూత‌న కార్యాల‌కు చ‌క్క‌ని రూప‌క‌ల్ప‌న చేస్తారు. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. కుటుంబసౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు మిత్రుల‌తో క‌లిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభ‌వార్త‌లు వింటారు. మ‌నోల్లాసాన్ని పొంది ఆనందంగా కాల‌క్షేపం చేస్తారు. 

మిథునం: వృధా ప్ర‌యాణాలు ఎక్కువ‌వుతాయి. ధ‌న‌వ్య‌యం త‌ప్ప‌దు. కోపాన్ని అదుపులో ఉంచుకోవ‌డం మంచిది. మాన‌సిక ఆందోళ‌న‌లు తొల‌గించ‌డానికి దైవ‌ధ్యానం అవ‌స‌రం. శారీర‌క అనారోగ్యంతో బాధ‌ప‌డుతారు. కుటుంబ విష‌యాలు సంతృప్తిక‌రంగా ఉండ‌వు. 

క‌ర్కాట‌కం: వ‌్య‌వ‌హారంలో ఇబ్బందుల‌ను ఎదుర్కొనే అవ‌కాశం ఉంటుంది. చేసే ప‌నుల‌లో కొన్ని ఇబ్బందులు వ‌స్తాయి. రుణ‌ప్ర‌య‌త్నాలు సుల‌భంగా ఫ‌లిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధ‌లు ఉంటాయి. బంధు, మిత్రుల‌తో వైరం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌టం మంచిది. 

సింహం: ముఖ్య‌మైన వ్య‌క్తుల‌ను క‌లుస్తారు. ఆక‌స్మిక భ‌యాందోళ‌న‌లు దూర‌మ‌వుతాయి. రుణ‌ప్ర‌య‌త్నాలు ఆల‌స్యంగా ఫ‌లిస్తాయి. కుటుంబంలో మ‌న‌శ్శాంతి లోపిస్తుంది. బంధు, మిత్రుల‌తో వైరం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్తగా ఉండ‌టం మంచిది. ర‌హ‌స్య శ‌తృబాధ‌లుండే అవ‌కాశం ఉంది. 

క‌న్య‌: నూతన వ్య‌క్తుల‌ను న‌మ్మి మోస‌పోకూడ‌దు. సంఘంలో అప్ర‌తిష్ఠ రాకుండా జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది. ప్ర‌య‌త్న‌కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వ‌డంతో ఇబ్బంది ప‌డుతారు. దైవ‌ద‌ర్శ‌నానికి ప్ర‌య‌త్నిస్తారు. రుణ‌ప్ర‌య‌త్నాలు ఆల‌స్యంగా ఫ‌లిస్తాయి. సోద‌ర వైరం క‌లిగే అవ‌కాశం ఉంటుంది. 

తుల‌: కుటుంబంలో సుఖ‌, సంతోషాలు ఉంటాయి. ధ‌న‌ధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజ‌యాన్ని సాధిస్తారు. ప్ర‌య‌త్న‌కార్యాలు ఫ‌లిస్తాయి. గృహంలో జ‌రిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధు, మిత్రుల‌తో క‌లుస్తారు. ప్ర‌యాణాలు లాభ‌దాయ‌కంగా ఉంటాయి. 

వృశ్చికం: వ‌్యాపార రంగంలో లాభాలు ఉంటాయి. రుణ ప్ర‌య‌త్నాలు చేయాల్సి వ‌స్తుంది. నూత‌న కార్యాల‌కు శ్రీకారం చుడ‌తారు. బంధు, మిత్రుల స‌హ‌కారం ఆల‌స్యంగా ల‌భిస్తుంది. ప్ర‌య‌త్నం మేర‌కు స్వ‌ల్ప‌లాభం ఉంటుంది. వృథా ప్ర‌యాణాలు ఎక్కువ‌గా చేస్తారు. 

ధ‌నుస్సు: కోపాన్ని త‌గ్గించుకోవ‌డం అన్నివిధాలా శ్రేయ‌స్క‌రం. కొత్త‌ప‌నులు ప్రారంభించ‌కూడ‌దు. అకాల భోజ‌నాదుల వ‌ల్ల అనారోగ్యం ఏర్ప‌డుతుంది. పిల్ల‌ల‌ప‌ట్ల ఎక్కువ ప‌ట్టుద‌ల‌తో ఉండ‌టం అంత మంచిదికాదు. చెడు ప‌నుల‌కు దూరంగా ఉండ‌టం మంచిది. మ‌నోద్వేగానికి గుర‌వుతారు.  

మ‌క‌రం: నూత‌న కార్యాల‌కు ప్ర‌ణాళికలు వేస్తారు. బంధు, మిత్ర విరోధం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌వ‌హించ‌డం మంచిది. మాన‌సిక ఆందోళ‌న అధిక‌మ‌వుతుంది. అనారోగ్య బాధ‌ల‌ను అధిగ‌మిస్తారు. అన‌వ‌స‌ర నింద‌ల‌తో అప‌కీర్తి వ‌స్తుంది. స్థిర‌మైన నిర్ణ‌యాలు తీసుకోలేరు. 

కుంభం: విందులు, వినోదాల‌కు దూరంగా ఉండ‌టం మంచిది. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం క‌లిగే అవ‌కాశం ఉంది. మాన‌సిక ఆందోళ‌న‌తో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్ర‌తి చిన్న విష‌యంలో ఆటంకాలు ఎదుర‌వుతాయి. ఆరోగ్యం గురించి ప్ర‌త్యేక శ్ర‌ద్ధ అవ‌స‌రం. 

మీనం: వృత్తిరీత్యా ఇబ్బందుల‌ను అధిగ‌మిస్తారు. మాన‌సిక ఆందోళ‌న‌తో కాలం గ‌డుపుతారు. స్త్రీలు చేసే వ్య‌వ‌హారాల్లో స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంది. ర‌హ‌స్య శ్ర‌తువుల‌ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది. ఏ విష‌యంలోనూ నిరుత్సాహం ప‌నికిరాదు. 


పంచాంగ‌క‌ర్త‌..
గౌరీభ‌ట్ల రామ‌కృష్ణ‌శ‌ర్మ సిద్ధాంతి
మేడిప‌ల్లి, ఉప్ప‌ల్‌, హైద‌రాబాద్‌
9440 350 868

VIDEOS

logo