మేషం: ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందులను అధిగమిస్తారు. మీరు చేసే ప్రతిపనిలో వ్యతిరేక ఫలితాలు కలుగకుండా జాగ్రత్త అవసరం. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ధైర్య సాహసాలతో నూత కార్యాలు ప్రారంభిస్తారు.
వృషభం: సంతోషంగా కాలం గడుపుతారు. శుభవార్త వింటారు. కుటుంబ పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. తోటివారి ప్రశంసరంగా ఉంటుంది. తోటివారి ప్రశంసలందుకుంటారు. విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆర్థికంగా బలపడతారు. స్త్రీలు మనోల్లాసాన్ని పొందుతారు.
మిథునం: ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. పిల్లలకు సంతోషాన్ని కలుగజేస్తారు. కళాత్మక వస్తువులను సేకరిస్తారు. బంధు, మిత్రులను కలుస్తారు. కొత్త కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు.
కర్కాటకం: ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. బంధు, మిత్రులతో కలుస్తారు. క్రీడాకారులు, రాజకీయరంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు.
సింహం: ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. రహస్య శతృబాధలు ఉండే అవకాశం ఉంది.
కన్య: నూతన వ్యక్తులను నమ్మి మోసపోరాదు. సంఘంలో అప్రతిష్ఠ రాకుండా జాగ్రత్త పడటం మంచిది. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవడంతో ఇబ్బంది పడతారు. దైవదర్శనానికి ప్రయత్నిస్తారు. రుణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. సోదర వైరం కలిగే అవకాశం ఉంటుంది.
తుల: మనస్సు చంచలంగా ఉంటుంది. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. అకాల భోజనం వల్ల అనారోగ్య బాధలను అనుభవిస్తారు. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. చెడు సహవాసానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి.
వృశ్చికం: ప్రయత్నంమేరకు స్వల్ప లాభం ఉంటుంది. వృథా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలుంటాయి. రుణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు. బంధు, మిత్రుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.
ధనుస్సు: తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. ఆవేశం వల్ల కొన్ని పనులు చెడిపోతాయి.
మకరం: బంధు, మిత్ర విరోధం ఏర్పడకుండా జాగ్రత్తవహించడం మంచిది. మానసిక ఆందోళన అధికమవుతుంది. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. అనవసర నిందలతో అపకీర్తి వస్తుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. నూతన కార్యాలకు ప్రణాళికలు వేస్తారు.
కుంభం: బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. చేసే పనులలో ఇబ్బందులు ఉంటాయి. కొత్త పనులను ప్రారంభించడం మంచిదికాదు. గృహంలో జరిగే మార్పులవల్ల ఆందోళన చెందుతారు. ప్రయానాల్లో జాగ్రత్త అవసరం.
మీనం: మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. కళలందు ఆసక్తి పెరుగుతుంది. నూతన వస్తు వస్త్ర ఆభరణాలను పొందుతారు.
పంచాంగకర్త..
గౌరీభట్ల రామకృష్ణశర్మ సిద్ధాంతి
మేడిపల్లి, ఉప్పల్, హైదరాబాద్
9440 350 868