మేషం: ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధు, మిత్రులు కలుస్తారు.
మిథునం: స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన గృహకార్యాలపై శ్రద్ధవహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు. భక్తిశ్రద్ధలు అధికమవుతాయి.
కర్కాటకం: మనస్సు చంచలంగా ఉంటుంది. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. అకాల భోజనం వల్ల అనారోగ్య బాధలను అనుభవిస్తారు. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. చెడు సహవాసానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి.
సింహం: వ్యాపారంలో విశేషలాభాన్ని ఆర్జిస్తారు. మంచివారితో స్నేహం చేస్తారు. అంతటా సుఖమే లభిస్తుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఒక ముఖ్యమైన సమాచారాన్ని సేకరిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను కొనుగోలు చేస్తారు.
కన్య: ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు దూరమవుతాయి. రుణప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం మంచిది. రహస్య శతృబాధలు ఉండే అవకాశం ఉంది.
తుల: సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖసంతోషాలు అనుభవిస్తారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. ప్రయత్నకార్యాలన్నింటిలో విజయం సాధిస్తారు. శుభవార్తలు వింటారు. ధైర్యసాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది.
వృశ్చికం: ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబంలో ఆనందోత్సాహాలు లభిస్తాయి. బంధు, మిత్రులను కలుస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ప్రతి విషయంలో అభివృద్ధి ఉంటుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు.
ధనుస్సు: మిక్కిలి ధైర్య, సాహసాలు కలిగిఉంటారు. సూక్ష్మబుద్ధితో విజయాన్ని సాధిస్తారు. మీ పరాక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు. శతృబాధలు తొలగిపోతాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక లాభాలు ఉంటాయి.
మకరం: మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. కళలందు ఆసక్తి పెరుగుతుంది. నూతన వస్తు, వస్త్ర ఆభరణాలను పొందుతారు.
కుంభం: అపకీర్తి రాకుండా జాగ్రత్త పడుట మంచిది. స్వల్ప అనారోగ్య బాధలు ఉంటాయి. ప్రయాణాల్లో వ్యయ, ప్రయాసలు తప్పవు. కలహాలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. దూర వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది.
మీనం: రుణప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలు ఉంటాయి. శుభకార్యాల మూలకంగా ధనవ్యయం అధికమవుతుంది. ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త అవసరం.
పంచాంగకర్త..
గౌరీభట్ల రామకృష్ణశర్మ సిద్ధాంతి
మేడిపల్లి, ఉప్పల్, హైదరాబాద్
9440 350 868