e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 19, 2021
Home News 13-05-2021 గురువారం.. మీ రాశి ఫ‌లాలు

13-05-2021 గురువారం.. మీ రాశి ఫ‌లాలు

13-05-2021 గురువారం.. మీ రాశి ఫ‌లాలు

మేషం: విందులు, వినోదాల‌కు దూరంగా ఉండ‌టం మంచిది. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం క‌లిగే అవ‌కాశం ఉంది. మాన‌సిక ఆందోళ‌న‌తో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్ర‌తి చిన్న విష‌యంలో ఆటంకాలు ఎదుర‌వుతాయి. ఆరోగ్యం గురించి ప్ర‌త్యేక శ్ర‌ద్ధ అవ‌స‌రం.

వృష‌భం: స్త్రీల మూల‌కంగా లాభాలు ఉంటాయి. ప్ర‌య‌త్న‌కార్యాల‌న్నింటిలో విజ‌యం పొందుతారు. శుభ‌వార్త‌లు వింటారు. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు. అత్యంత స‌న్నిహితుల‌ను క‌లుస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.

మిథునం: అద్భుత‌మైన అవ‌కాశాల‌ను పొందుతారు. శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేరుతాయి. ముఖ్య‌మైన శుభ‌వార్త‌లు వింటారు. ఆత్మీయుల స‌హాయ‌, స‌హ‌కారాలు సంపూర్ణంగా ల‌భిస్తాయి. అనుకోకుండా డ‌బ్బు చేతికందుతుంది. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాలు సేక‌రిస్తారు.

క‌ర్కాట‌కం: మ‌నోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్ర‌త్త వ‌హించ‌డం అవ‌స‌రం. నూత‌న కార్యాల‌కు ఆటంకాలు ఏర్ప‌డుతాయి. కోపాన్ని త‌గ్గించుకుంటే మంచిది. క‌ఠిన సంభాష‌ణ వ‌ల్ల ఇబ్బందుల‌ను ఎదుర్కొంటారు. ఇత‌రుల‌కు హాని త‌ల‌పెట్టే కార్యాల‌కు దూరంగా ఉంటారు.

సింహం: కుటుంబ విష‌యాల‌పై అనాస‌క్తితో ఉంటారు. గృహంలో మార్పులు జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయి. త‌ల‌చిన కార్యాలు ఆల‌స్యంగా నెర‌వేరుతాయి. కొన్ని కార్యాలు విధిగా రేప‌టికి వాయిదా వేసుకుంటారు. స్త్రీల‌తో జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది.

క‌న్య‌: స‌్థిరాస్తుల‌కు సంబంధించిన విష‌యాల్లో స‌మ‌య‌స్ఫూర్తి అవ‌స‌రం. నిరుత్సాహంగా కాలం గ‌డుస్తుంది. అప‌కీర్తి వ‌చ్చే అవ‌కాశం ఉంటుంది. ఇత‌రుల‌కు అప‌కారం క‌లిగించే ప‌నుల‌కు దూరంగా ఉండ‌టం మంచిది. ప‌రిశుభ్ర‌త‌కు ప్రాధాన్య‌మిస్తే అనారోగ్య బాధ‌లు ఉండ‌వు.

తుల‌: మాన‌సిక ఆందోళ‌న తొల‌గుతుంది. ఆరోగ్యం గురించి జాగ్ర‌త్త వ‌హించాలి. ఆక‌స్మిక భ‌యం దూర‌మ‌వుతుంది. ప్ర‌యాణాల్లో మెల‌కువ అవ‌స‌రం. ప్ర‌య‌త్న కార్యాల్లో ఇబ్బందులు ఎదుర‌వుతాయి. విదేశ‌యాన ప్ర‌య‌త్నాలు ఆల‌స్యంగా ఫలిస్తాయి.

వృశ్చికం: విదేశ‌యాన ప్ర‌య‌త్నాలకు అనుకూలంగా ఉంటుంది. ప్ర‌యాణాలు ఎక్కువ‌గా చేస్తారు. మెల‌కువ‌గా ఉండ‌టం అవ‌స‌రం. స్థాన‌చ‌ల‌నం ఏర్ప‌డే అవ‌కాశాలు ఉంటాయి. రుణ‌లాభం పొందుతారు. ఎల‌ర్జీతో బాధ‌ప‌డేవారు జాగ్ర‌త్త‌గా ఉండాలి. ప్ర‌య‌త్న కార్యాల‌కు ఆటంకాలు ఉంటాయి.

ధ‌నుస్సు: కుటుంబ క‌ల‌హాలు దూర‌మ‌వుతాయి. ప్ర‌య‌త్న‌కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి. వృథా ప్ర‌యాణాల‌వ‌ల్ల అల‌స‌ట చెందుతారు. చెడు ప‌నుల‌కు దూరంగా ఉండ‌టం మంచిది. అంద‌రితో స్నేహంగా ఉండ‌టానికి ప్ర‌య‌త్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వ‌ల్పంగా ఉంటాయి.

మ‌క‌రం: కోరుకునేది ఒక‌టైతే జ‌రిగేది మరొక‌టి అవుతుంది. అనారోగ్య బాధ‌లు స్వ‌ల్పంగా ఉన్నాయి. వేళ ప్ర‌కారం భుజించ‌డానికి ప్రాధాన్య‌మిస్తారు. చంచ‌లం వ‌ల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర‌వుతాయి. మ‌నోనిగ్ర‌హానికి ప్ర‌య‌త్నించాలి. పిల్ల‌ల‌ప‌ట్ల ఏమాత్రం అశ్ర‌ద్ధ ప‌నికిరాదు.

కుంభం: గొప్ప‌వారి ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. స్థ్రీల మూల‌కంగా లాభం ఉంటుంది. మంచి ఆలోచ‌న‌ల‌ను క‌లిగి ఉంటారు. బంధు, మిత్రులు గౌర‌విస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు. స‌త్కార్యాల్లో పాల్గొంటారు. గృహ అవ‌స‌రాల‌కు ప్రాధాన్య‌మిస్తారు.

మీనం: ఆర్థిక ఇబ్బందుల‌ను ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగ‌రంగాల్లో న‌ష్ట‌పోయే అవ‌కాశం ఉంది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవ‌కాశాన్ని జార‌విడుచుకుంటారు. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టంప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండ‌టం అవ‌స‌రం.

పంచాంగ‌క‌ర్త‌..
గౌరీభ‌ట్ల రామ‌కృష్ణ‌శ‌ర్మ సిద్ధాంతి
మేడిప‌ల్లి, ఉప్ప‌ల్‌, హైద‌రాబాద్‌
9440 350 868

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
13-05-2021 గురువారం.. మీ రాశి ఫ‌లాలు

ట్రెండింగ్‌

Advertisement