బుధవారం 03 మార్చి 2021
Horoscope - Feb 08, 2021 , 06:19:24

08-02-2021 సోమ‌వారం.. మీ రాశి ఫ‌లాలు

08-02-2021 సోమ‌వారం.. మీ రాశి ఫ‌లాలు

మేషం: ర‌హ‌స్య శ‌త్రువుల‌ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది. ఏ విష‌యంలోనూ నిరుత్సాహం ప‌నికిరాదు. వృత్తిరీత్యా ఇబ్బందుల‌ను అధిగ‌మిస్తారు. మాన‌సిక ఆందోళ‌న‌తో కాలం గ‌డుపుతారు. స్త్రీలు చేసే వ్య‌వ‌హారాల్లో స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయి. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంది. 

వృష‌భం: క‌్రీడాకారుల‌కు, రాజ‌కీయ‌రంగాల్లోని వారికి మాన‌సిక ఆందోళ‌న త‌ప్ప‌దు. నూత‌న కార్యాలు వాయిదావేసుకోవ‌డం మంచిది. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం క‌లిగే అవ‌కాశం ఉంది. స్థిరాస్తుల విష‌యంలో మిక్కిలి జాగ్ర‌త్త అవ‌స‌రం. ప‌క్క‌దోవ ప‌ట్టించేవారి మాట‌లు విన‌రాదు. 

మిథునం: ఇత‌రుల‌కు హాని త‌ల‌పెట్టే కార్యాల‌కు దూరంగా ఉంటారు. మ‌నోధైర్యాన్ని కోల్పోకుండా జాగ్ర‌త్త‌వ‌హించ‌డం అవ‌స‌రం. నూత‌న కార్యాల‌కు ఆటంకాలు ఏర్ప‌డుతాయి. కోపాన్ని త‌గ్గించుకుంటే మంచిది. క‌ఠిన సంభాష‌ణ‌వ‌ల్ల ఇబ్బందుల‌ను ఎదుర్కొంటారు. 

క‌ర్కాట‌కం: కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి. మ‌నోల్లాసాన్ని పొందుతారు. స్వ‌ల్ప అనారోగ్య బాధ‌లు ఉంటాయి. ప‌ట్టుద‌ల‌తో కొన్ని కార్యాలు పూర్తిచేసుకోగలుగుతారు. పిల్ల‌ల‌ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది. వృత్తిరీత్యా గౌర‌వ‌, మ‌ర్యాద‌లు పొందుతారు. 

సింహం: నూత‌న వ‌స్తు, వ‌స్త్ర‌, ఆభ‌ర‌ణాలు పొందుతారు. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. విద్యార్థుల ప్ర‌తిభ‌కు త‌గిన గుర్తింపు ల‌భిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చ‌ర్చ‌లు, స‌ద‌స్సులు మిమ్మ‌ల్ని ఆక‌ర్షిస్తాయి. మ‌నోధైర్యాన్ని క‌లిగిఉంటారు. శుభ‌వార్త‌లు వింటారు. 

క‌న్య‌: ఆర్థిక ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా మారుతుంది. నూత‌న కార్యాలు ప్రారంభించ‌కూడ‌దు. ప్ర‌యాణాలు ఎక్కువ‌గా చేస్తారు. త‌ల‌చిన కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి. స్థిరాస్తుల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల్లో జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది. మోస‌పోయే అవ‌కాశాలు ఉంటాయి. 

తుల‌: ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం జ‌రుగ‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌టం మంచిది. మ‌న‌స్తాపానికి గురవుతారు. ప్ర‌యాణాల్లో అప్ర‌మ‌త్త‌త అవ‌స‌రం. నూత‌న కార్యాలు వాయిదా వేసుకోక త‌ప్ప‌దు. అనుకోకుండా కుటుంబంలో క‌ల‌హాలు ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంది. అశుభ‌వార్త‌లు వినాల్సి వ‌స్తుంది. 

వృశ్చికం: వ‌్య‌వ‌సాయ మూల‌కంగా లాభాల‌ను పొందుతారు. ప్ర‌య‌త్న‌కార్యాల‌న్నీ ఫ‌లిస్తాయి. సూక్ష్మ విష‌యాల‌ను గ్ర‌హిస్తారు. కుటుంబం అంతా సంతోషంగా ఉంటారు. గ‌తంలో వాయిదావేసిన ప‌నుల‌న్నీ పూర్తిచేసుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యం ఏర్ప‌డుతుంది. స్థిర‌నివాసం ఉంటుంది. 

ధ‌నుస్సు: స‌ంతోషంగా కాలం గ‌డుపుతారు. శుభ‌వార్త వింటారు. కుటుంబ ప‌రిస్థితి సంతృప్తిక‌రంగా ఉంటుంది. తోటివారి ప్ర‌శంస‌లు అందుకుంటారు. విందులు, వినోదాల్లో పాల్గొనే అవ‌కాశం ఉంది. ఆర్థికంగా బ‌ల‌ప‌డుతారు. స్త్రీలు మ‌నోల్లాసాన్ని పొందుతారు. 

మ‌క‌రం: కుటుంబం అంతా సౌఖ్యంగా ఉంటారు. అత్యంత స‌న్నిహితుల‌ను క‌లుస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. స్త్రీల మూల‌కంగా లాభాలు ఉంటాయి. ప్ర‌య‌త్న కార్యాల‌న్నింటిలో విజ‌యం పొందుతారు. శుభ‌వార్త‌లు వింటారు. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. 

కుంభం: విదేశ‌యాన ప్ర‌య‌త్నాల‌కు మార్గం సుగ‌మం అవుతుంది. ఆరోగ్యంప‌ట్ల శ్ర‌ద్ధ వ‌హించ‌క త‌ప్ప‌దు. ప్ర‌యాణాలు ఎక్కువ‌గా చేయాల్సి వ‌స్తుంది. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం. అన‌వ‌స‌రంగా డ‌బ్బు ఖ‌ర్చ‌వ‌డంతో ఆందోళ‌న చెందుతారు. 

మీనం: అద్భుత శ‌క్తి సామ‌ర్థ్యాల‌ను పొంద‌గ‌లుగుతారు. కుటుంబంలో అభివృద్ధితోపాటు ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. అన్నికార్యాల్లో విజ‌యాన్ని సాధిస్తారు. అంత‌టా సౌఖ్యాన్ని పొందుతారు. శ‌త్రుబాధ‌లు ఉండ‌వు. శుభ‌వార్త‌లు వింటారు. గౌర‌వ‌, మ‌ర్యాద‌లు అధిక‌మ‌వుతాయి.   


పంచాంగ‌క‌ర్త‌..
గౌరీభ‌ట్ల రామ‌కృష్ణ‌శ‌ర్మ సిద్ధాంతి
మేడిప‌ల్లి, ఉప్ప‌ల్, హైద‌రాబాద్‌
9440 350 868

VIDEOS

logo