ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Horoscope - Feb 07, 2021 , 06:12:57

07-02-2021 ఆదివారం.. మీ రాశి ఫ‌లాలు

07-02-2021 ఆదివారం.. మీ రాశి ఫ‌లాలు

మేషం: రుణ‌ప్ర‌య‌త్నం ఫ‌లిస్తుంది. చెడు స‌హ‌వాసంవైపు వెళ్ల‌కుండా ఉంటే గౌర‌వం ద‌క్కుతుంది. క్ష‌ణికావేశం ప‌నికిరాదు. అనుకోకుండా కుటుంబంలో క‌ల‌త‌లు ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. బంధు, మిత్రుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది. అనారోగ్య బాధ‌లు అధిక‌మ‌వుతాయి. 

వృష‌భం: మాన‌సిక ఆందోళ‌న‌తో కాలం గ‌డుస్తుంది. ఆరోగ్యం విష‌యంలో శ్ర‌ద్ధ‌వ‌హించ‌క త‌ప్ప‌దు. ప్ర‌య‌త్న‌కార్యాలు ఆలస్యంగా స‌ఫ‌ల‌మ‌వుతాయి. చెడు ప‌నుల‌కు దూరంగా ఉండ‌టం మంచిది. వృత్తి ఉద్యోగ‌రంగాల్లో అభివృద్ధి ఉంటుంది. స్థిరాస్తుల‌కు సంబంధించిన విష‌యాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం. 

మిథునం: కుటుంబ‌సౌఖ్యం సంపూర్ణంగా ల‌భిస్తుంది. ఆక‌స్మిక ధ‌న‌లాభంతో ఆనందాన్ని పొందుతారు. ఇత‌రుల‌కు ఉప‌కారం చేసే కార్యాల్లో నిమ‌గ్నుల‌వుతారు. స్త్రీల‌మూల‌కంగా లాభం ఉంది. పేరు, ప్ర‌తిష్ఠ‌లు ల‌భిస్తాయి. రుణ‌బాధ‌లు తొల‌గిపోతాయి. ఆరోగ్యం మెరుగ‌వుతుంది. 

క‌ర్కాట‌కం: కోపాన్ని అదుపులో ఉంచుకోవ‌డం మంచిది. మాన‌సిక ఆందోళ‌న‌ను తొల‌గించ‌డానికి దైవ‌ధ్యానం అవ‌స‌రం. శారీర‌క అనారోగ్యంతో బాధ‌ప‌డుతారు. కుటుంబ విష‌యాలు సంతృప్తిక‌రంగా ఉండ‌వు. వృధా ప్ర‌యాణాలు ఎక్కువ అవుతాయి. ధ‌న‌వ్య‌యం త‌ప్ప‌దు. 

సింహం: ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాలు ఖ‌రీదు చేస్తారు. ముఖ్య‌మైన వ్య‌క్తుల‌ను క‌లుస్తారు. అన్నిరంగాల్లో అద్భుత విజయాల‌ను సాధిస్తారు. నూత‌న కార్యాల‌ను ప్రారంభిస్తారు. రుణ‌విముక్తి ల‌భిస్తుంది. మాన‌సిక ఆనందం పొందుతారు. 

క‌న్య‌: ‌వృత్తి, ఉద్యోగ‌రంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆక‌స్మిక ధ‌న‌లాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ల‌భిస్తుంది. గౌర‌వ‌, మ‌ర్యాద‌లు పెరుగుతాయి. పిల్ల‌ల‌కు సంతోషం క‌లిగించే కార్యాలు చేస్తారు. శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేరుతాయి. 

తుల‌: కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి. ఆక‌స్మిక ధ‌న‌లాభంతో రుణ‌బాధ‌లు తొల‌గిపోతాయి. స‌మాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ఇత‌రులు మిమ్మ‌ల్ని ఆద‌ర్శంగా తీసుకోవ‌డానికి కృషి చేస్తారు. స్త్రీలు, బంధు, మిత్రుల‌ను క‌లుస్తారు. 

వృశ్చికం: బ‌ంధుమిత్రుల స‌హాయ స‌హ‌కారాలు ల‌భిస్తాయి. మాన‌సిక ఆందోళ‌న‌తో కాలం గ‌డుస్తుంది. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంది. స్థిర‌మైన నిర్ణ‌యాలు తీసుకోలేక‌పోతారు. అధికారుల‌తో జాగ్ర‌త్త‌గా మెల‌గ‌డం మంచిది. అన‌వ‌స‌ర భ‌యం ఆవ‌హిస్తుంది. 

ధ‌నుస్సు: మిక్కిలి ధైర్య‌, సాహ‌సాలు క‌లిగి ఉంటారు. సూక్ష్మ‌బుద్ధితో విజ‌యాన్ని సాధిస్తారు. మీ ప‌రాక్ర‌మాన్ని ఇత‌రులు గుర్తిస్తారు. శ‌తృబాధ‌లు తొల‌గిపోతాయి. శుభ‌కార్య‌ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర్చుకుంటారు. ముఖ్య‌మైన వ్య‌క్తుల‌ను క‌లుస్తారు. ఆక‌స్మిక లాభాలు ఉంటాయి. 

మ‌క‌రం: బ‌ంధు, మిత్రుల‌తో మ‌న‌స్ప‌ర్థ‌లు రాకుండా జాగ్ర‌త్త‌వ‌హించ‌డం మంచిది. అనుకోకుండా డ‌బ్బు చేజారే అవ‌కాశాలు ఉన్నాయి. ఆరోగ్యం విష‌యంలో మిక్కిలి శ్ర‌ద్ధ అవ‌స‌రం. శారీర‌క శ్ర‌మ‌తోపాటు మానసిక ఆందోళ‌న త‌ప్ప‌దు. చిన్న విష‌యాల‌కోసం ఎక్కువ శ్ర‌మిస్తారు. 

కుంభం: అప‌కీర్తి రాకుండా జాగ్ర‌త్త ప‌డ‌టం మంచిది. స్వ‌ల్ప అనారోగ్య బాధ‌లు ఉంటాయి. ప్ర‌యాణాలు వ్య‌య‌, ప్ర‌యాస‌లు త‌ప్ప‌వు. క‌ల‌హాల‌కు దూరంగా ఉండ‌టానికి ప్ర‌య‌త్నించాలి. దూర వ్య‌క్తుల ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. 

మీనం: విదేశయాన ప్ర‌య‌త్నం సుల‌భం అవుతుంది. కుటుంబ క‌ల‌హాల‌కు తావీయ‌కూడ‌దు. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంది. పిల్ల‌ల‌తో జాగ్ర‌త్త వ‌హించ‌డం మంచిది. వృత్తి, ఉద్యోగ‌రంగంలోని వారికి ఆటంకాలు ఎదుర‌వుతాయి. ఆరోగ్యం గురించి ప్ర‌త్యేక శ్ర‌ద్ధ అవ‌స‌రం. ‌ 


పంచాంగ‌క‌ర్త‌..
గౌరీభ‌ట్ల రామ‌కృష్ణ‌శ‌ర్మ సిద్ధాంతి
మేడిప‌ల్లి, ఉప్ప‌ల్, హైద‌రాబాద్‌
9440 350 868

VIDEOS

logo