గురువారం 04 మార్చి 2021
Horoscope - Feb 03, 2021 , 06:19:37

03-02-2021 బుధ‌వారం.. మీ రాశి ఫ‌లాలు

03-02-2021 బుధ‌వారం.. మీ రాశి ఫ‌లాలు

మేషం: కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ల‌భిస్తుంది. ఆక‌స్మిక ధ‌న‌లాభంతో ఆనందాన్ని పొందుతారు. ఇత‌రుల‌కు ఉప‌కారం చేసే కార్యాల్లో నిమ‌గ్నుల‌వుతారు. స్త్రీల‌మూల‌కంగా లాభం ఉంది. పేరు, ప్ర‌తిష్ట‌లు ల‌భిస్తాయి. రుణ‌బాధ‌లు తొల‌గిపోతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. 

వృష‌భం: మీ మంచి ప్ర‌వ‌ర్త‌న‌ను ఇత‌రులు ఆద‌ర్శంగా తీసుకుంటారు. ప్ర‌య‌త్న కార్యాల‌న్నింటిలో విజ‌యాన్ని సాధిస్తారు. దైవ‌ర్శ‌నం చేసుకుంటారు. స్థిరాస్తుల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకుంటారు. క‌ళ‌లందు ఆస‌క్తి పెరుగుతుంది. నూత‌న‌, వ‌స్తు, వ‌స్త్ర ఆభ‌ర‌ణాల‌ను పొందుతారు. 

మిథునం: కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి. ఆరోగ్యం గురించి శ్ర‌ద్ధ‌వ‌హించాలి. ఆర్థిక ఇబ్బందుల‌తో స‌త‌మ‌త‌మ‌వుతారు. నూత‌న కార్యాలు ప్రారంభిచ‌కుండా ఉండ‌టం మంచిది. ఆత్మీయుల స‌హాయ స‌హ‌కారాల‌కోసం స‌మ‌యం వెచ్చించాల్సి వ‌స్తుంది. 

క‌ర్కాట‌కం: రాజ‌కీయ వ్య‌వ‌హారాల్లో దిగ్విజ‌యాన్ని పొందుతారు. ప్ర‌య‌త్న కార్యాల‌న్నీ సంపూర్ణంగా ఫ‌లిస్తాయి. శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేరుతాయి. సంపూర్ణ ఆరోగ్య‌వంతులుగా ఉంటారు. ఇత‌రుల‌కు ఉప‌క‌రించే ప‌నులు చేప‌డుతారు. గౌర‌వ‌మ‌ర్యాదలు ల‌భిస్తాయి. శుభ‌వార్త‌లు వింటారు. 

సింహం: కుటుంబ విష‌యాల‌పై ఆనాస‌క్తితో ఉంటారు. గృహంలో మార్పులు జ‌రిగే అవ‌కాశాలు ఉన్నాయి. త‌ల‌చిన కార్యాలు ఆల‌స్యంగా నెర‌వేరుతాయి. కొన్నికార్యాలు విధిగా రేప‌టికి వాయిదా వేసుకుంటారు. స్త్రీల‌తో ఉండ‌టం మంచిది. 

క‌న్య‌: నూతన వ‌స్తు, వ‌స్త్ర‌, ఆభ‌ర‌ణాలు పొందుతారు. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. విద్యార్థుల ప్ర‌తిభ‌కు త‌గిన గుర్తింపు ల‌భిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చ‌ర్చ‌లు, స‌ద‌స్సులు మిమ్మ‌ల్ని ఆక‌ర్షిస్తాయి. మ‌నోధైర్యాన్ని క‌లిగి ఉంటారు. శుభ‌వార్త‌లు వింటారు. 

తుల‌: మానసిక ఆందోళ‌న తొల‌గుతుంది. ఆరోగ్యం గురించి జాగ్ర‌త్త వ‌హించాలి. ఆక‌స్మిక భ‌యం దూర‌మ‌వుతుంది. ప్రయాణాల్లో మెల‌కువ అవ‌స‌రం. ప్ర‌య‌త్న‌కార్యాల్లో ఇబ్బందులు ఎదురువుతాయి. విదేశ‌యాన ప్ర‌య‌త్నాలు ఆల‌స్యంగా ఫ‌లిస్తాయి. 

వృశ్చికం: ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాల‌ను పొందుతారు. కీర్తి, ప్ర‌తిష్ఠ‌లు పెరుగుతాయి. కుటుంబ సంభ్యుల‌తో సంతోషంగా కాల‌క్షేపం చేస్తారు. ఇత‌రుల‌కు ఉప‌కారం చేయ‌డానికి వెనుకాడ‌రు. రుణ‌బాధ‌లు తొల‌గిపోతాయి. శ‌త్రుబాధ‌లు ఉండ‌వు. 

ధ‌నుస్సు: కుటుంబ క‌ల‌హాలు దూర‌మ‌వుతాయి. ప్ర‌య‌త్న‌కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి. వృథా ప్ర‌యాణాల‌వ‌ల్ల అల‌స‌ట చెందుతారు. చెడు ప‌నుల‌కు దూరంగా ఉండ‌టం మంచిది. అంద‌రితో స్నేహంగా ఉండ‌టానికి ప్ర‌య‌త్నించాలి. ఆర్థిక ఇబ్బందులు స్వల్పంగా ఉంటాయి. 

మ‌క‌రం: విదేశ‌యాన ప్ర‌య‌త్నం సుల‌భం అవుతుంది. కుటుంబ క‌ల‌హాల‌కు తావీయ‌కూడ‌దు. ఆక‌స్మిక ధ‌న న‌ష్టం ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంది. పిల్ల‌ల‌తో జాగ్ర‌త్త వ‌హించ‌డం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగంలోని వారికి ఆటంకాలు ఎదుర‌వుతాయి. ఆరోగ్యం గురించి ప్ర‌త్యేక శ్ర‌ద్ధ అవ‌స‌రం. 

కుంభం: ఊహించ‌ని కార్యాల్లో పాల్గొనే అవ‌కాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి ఉంటుంది.  ఆత్మీయులను క‌ల‌వ‌డంలో విఫ‌ల‌మ‌వుతారు. అన‌వ‌స‌ర వ్య‌య‌ప్ర‌యాస‌ల వ‌ల్ల ఆందోళ‌న చెందుతారు. వృథా ప్ర‌యాణాలు ఎక్కువ‌గా ఉంటాయి. స్త్రీల‌మూల‌కంగా ధ‌న‌లాభం ఉంటుంది.  ‌

మీనం: అద్భుత‌మైన అవ‌కాశాల‌ను పొందుతారు. శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేరుతాయి. ముఖ్య‌మైన శుభ‌వార్త‌లు వింటారు. ఆత్మీయుల స‌హాయ‌, స‌హ‌కారాలు సంపూర్ణంగా ల‌భిస్తాయి. అనుకోకుండా డ‌బ్బు చేతికందుతుంది. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాలు సేక‌రిస్తారు.


పంచాంగ‌క‌ర్త‌..
గౌరీభ‌ట్ల రామ‌కృష్ణ‌శ‌ర్మ సిద్ధాంతి
మేడిప‌ల్లి, ఉప్ప‌ల్, హైద‌రాబాద్‌
9440 350 868

VIDEOS

logo