మంగళవారం 02 మార్చి 2021
Horoscope - Feb 22, 2021 , 07:59:27

22-02-2021.. సోమవారం, మీ రాశి ఫలాలు

22-02-2021.. సోమవారం, మీ రాశి ఫలాలు

మేషం : వృత్తి, ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంటుంది. వృధా ప్రయాణాలెక్కువ చేస్తారు. బంధు, మిత్రులతో కలహించుకోకుండా జాగ్రత్తగా నుండుట మంచిది. 

వృషభం : నూతన కార్యాలకు ఆటంకాలున్నా సత్ఫలితాలు పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వృత్తి, వ్యాపార రంగాల్లో ధన నష్టమేర్పడకుండా జాగ్రత్త వహించాలి. ఆత్మీయుల సహాయ, సహకారాలకై వేచి ఉంటారు. దైవ దర్శనం లభిస్తుంది. అనారోగ్య బాధలను అధిగమిస్తారు. 

మిథునం : నూతన కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అల్ప భోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురి చేస్తుంది. వీలైనంత వరకు అసత్యానికి దూరంగా నుండుట మంచిది. అనవసర భయాందోళనలకు లోనవుతారు. 

కర్కాటకం : ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది. నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ, లాభాలను పొందుతారు. ఆకస్మిక ధన లాభయోగ ముంటుంది. శుభవార్తలు వింటారు. శుభ కార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. 

సింహం : వృత్తి రీత్యా అనుకూల స్థాన చలనం ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. పోట్లాటలకు దూరంగా ఉండుట మంచిది. అనారోగ్య బాధలు అధిగమించుటకు ఔషధ సేవ తప్పదు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో తొందరపాటు పనికిరాదు. 

కన్య : ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధు, మిత్రులతో విరోధమేర్పడే అవకాశాలు ఉంటాయి. స్త్రీల మూలకంగా శత్రు బాధలను అనుభవిస్తారు. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురి చేస్తుంది. పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికి రాదు. పగ సాధించు ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది. 

తుల : ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. ప్రయాణాలు జాగ్రత్తగా చేయుట మంచిది. అజీర్ణ బాధలు అధికమగును. కీళ్ల నొప్పుల బాధ నుండి రక్షించుకోవడం అవసరం. మనో విచారాన్ని కలిగి ఉంటారు. 

వృశ్చికం : తోటివారితో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. వ్యాపార మూలకంగా ధన నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయి. వృధా ప్రయాణాలు ఎక్కువ చేస్తారు. కుటుంబ విషయాలందు అనాసక్తితో ఉంటారు. స్త్రీలు విశ్రాంతి తీసుకోవడం అవసరం. 

ధనుస్సు : ఒక ముఖ్యమైన సమాచారాన్ని అందుకుంటారు. ఆకస్మిక ధన లాభ యోగం ఉంటుంది. ప్రయత్న కార్యాల్లో విజయం సాధిస్తారు. బంధు, మిత్రులతో కలుస్తారు. క్రీడాకారులు, రాజకీయ రంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. స్త్రీలు సంతోషంగా కాలక్షేపం చేస్తారు. 

మకరం : వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశాలుంటాయి. ఏ విషయంలోనూ స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ, మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడుట మంచిది. 

కుంభం : కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుండుటచే మానసిక ఆనందాన్ని పొందుతారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. నిన్నటి వరకు వాయిదా వేయబడిన కొన్ని పనులు ఈ రోజు పూర్తి చేసుకోగలుగుతారు. ముఖ్యమైన వ్యక్తుల్ని కలుస్తారు. 

మీనం : ఆకస్మిక ధన లాభం ఉంటుంది. కుటుంబంలో ఆనందోత్సహాలు లభిస్తాయి. బంధు, మిత్రులతో కలుస్తారు. సమాజంలో గౌరవం లభిస్తుంది. సంపూర్ణ ఆరోగ్య వంతులుగా ఉంటారు. ప్రతి విషయంలో అభివృద్ధి ఉంటుంది. శుభ కార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. 

పంచాంగ కర్త

గౌరీభట్ట రామకృష్ణ శర్మ సిద్ధాంతి

మేడిపల్లి, ఉప్పల్‌, హైదరాబాద్‌

ఫోన్‌ నంబర్‌ : 9440350868

VIDEOS

logo