శుక్రవారం 05 మార్చి 2021
Horoscope - Feb 01, 2021 , 06:08:35

1-02-2021 సోమ‌వారం.. మీ రాశి ఫ‌లాలు

1-02-2021 సోమ‌వారం.. మీ రాశి ఫ‌లాలు

మేషం: ఇత‌రుల‌కు ఇబ్బందిని క‌లుగ‌జేసే ప‌నుల‌ను మానుకోవాల్సి వ‌స్తుంది. వృత్తిలో ఇబ్బందుల‌ను అధిగ‌మిస్తారు. మీరు చేసే ప్ర‌తి ప‌నిలో వ్య‌తిరేక ఫ‌లితాలు క‌లుగ‌కుండా జాగ్ర‌త్త అవ‌సరం. నూత‌న కార్యాలు ప్రారంభించ‌కుండా ఉంటే మంచిది. ధైర్య‌సాహ‌సాల‌తో నూత‌న కార్యాలు ప్రారంభిస్తారు. 

వృష‌భం: బ‌ంధు, మిత్రుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది. చేసే ప‌నుల‌లో ఇబ్బందులు ఉంటాయి. కొత్త ప‌నుల‌ను ప్రారంభించ‌డం మంచిదికాదు. గృహంలో జ‌రిగే మార్పుల‌వ‌ల్ల ఆందోళ‌న చెందుతారు. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త అవ‌స‌రం. 

మిథునం: ఇంత‌వ‌ర‌కు అనుభ‌వించిన క‌ష్టాల‌న్నీ క్ర‌మేణ తొల‌గిపోతాయి. నూత‌న కార్యాల‌కు శ్రీకారం చుడ‌తారు. కుటుంబ‌సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రుల‌తో క‌లిసి స‌ర‌దాగా కాల‌క్షేపం చేస్తారు. ఆక‌స్మిక ధ‌నలాభం ఉంటుంది. గొప్ప వ్య‌క్తిని క‌లుస్తారు. 

క‌ర్కాట‌కం: రుణప్ర‌య‌త్నాలు సుల‌భంగా ఫ‌లిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధ‌లు ఉంటాయి. బంధు, మిత్రుల‌తో వైరం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌ప‌డ‌టం మంచిది. వ్య‌వ‌హారంలో ఇబ్బందుల‌ను ఎదుర్కొనే అవ‌కాశం ఉంది. చేసే ప‌నుల‌లో కొన్ని ఇబ్బందులు వ‌స్తాయి. 

సింహం: ముఖ్యమైన వ్య‌క్తుల‌ను క‌లుస్తారు. ఆక‌స్మిక భ‌యాందోళ‌న‌లు దూర‌మ‌వుతాయి. రుణ‌ప్ర‌య‌త్నాలు ఆల‌స్యంగా ఫ‌లిస్తాయి. కుటుంబంలో మ‌న‌శ్శాంతి లోపిస్తుంది. బంధు, మిత్రుల‌తో వైరం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది. ర‌హ‌స్య శ‌తృబాధ‌లు ఉండే అవ‌కాశం ఉంది. 

క‌న్య‌: నూత‌న వ్య‌క్తుల‌ను న‌మ్మి మోస‌పోకూడ‌దు. సంఘంలో అప్ర‌తిష్ఠ రాకుండా జాగ్ర‌త్త‌ప‌డ‌టం మంచిది. ప్ర‌య‌త్న‌కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వ‌డంతో ఇబ్బంది ప‌డుతారు. దైవ‌ద‌ర్శ‌నానికి ప్ర‌య‌త్నిస్తారు. రుణ‌ప్ర‌యత్నాలు ఆల‌స్యంగా ఫ‌లిస్తాయి. సోద‌ర వైరం క‌లిగే అవ‌కాశం ఉంటుంది. 

తుల‌: అనారోగ్య బాధ‌లు అధిక‌మ‌వుతాయి. అకార‌ణంగా క‌ల‌హాలు ఏర్ప‌డే అవ‌కాశాలు ఉంటాయి. అన‌వ‌స‌ర భ‌యానికి లోన‌వుతారు. విద్యార్థులు చంచ‌లంగా ప్ర‌వ‌ర్తిస్తారు. వ్యాపార రంగంలోనివారు జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది. స్త్రీలు పిల్ల‌ల‌ప‌ట్ల మిక్కిలి శ్ర‌ద్ధ‌వ‌హిస్తారు. 

వృశ్చికం: ప‌్ర‌య‌త్నం మేరకు స్వ‌ల్ప లాభం ఉంటుంది. వృథా ప్ర‌యాణాలు ఎక్కువ‌గా చేస్తారు. వ్యాపార రంగంలో లాభాలు ఉంటాయి. రుణ ప్ర‌య‌త్నాలు చేయాల్సి వ‌స్తుంది. నూత‌న కార్యాల‌కు శ్రీకారం చుడ‌తారు. బంధు, మిత్రుల స‌హ‌కారం ఆల‌స్యంగా ల‌భిస్తుంది. 

ధ‌నుస్సు: అకాల భోజ‌నాదుల వ‌ల్ల అనారోగ్యం ఏర్ప‌డుతుంది. పిల్ల‌ల‌ప‌ట్ల ఎక్కువ ప‌ట్టుద‌ల‌తో ఉండ‌టం అంత మంచిది కాదు. చెడు ప‌నుల‌కు దూరంగా ఉండాలి. మ‌నోద్వేగానికి గుర‌వుతారు. కోపాన్ని త‌గ్గించుకోవ‌డం అన్నివిధాలా శ్రేయ‌స్క‌రం. కొత్త ప‌నులు ప్రారంభించ‌రాదు. 

మ‌క‌రం: బంధు, మిత్రుల‌తో వైరం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది. మాన‌సిక ఆందోళ‌న అధిక‌మ‌వుతుంది. అనారోగ్య బాధ‌ల‌ను అధిగ‌మిస్తారు. అన‌వ‌స‌ర నింద‌ల‌తో అపకీర్తి వ‌స్తుంది. స్థిర‌మైన నిర్ణ‌యాలు తీసుకోలేరు. నూత‌న కార్యాల‌కు ప్ర‌ణాళిక‌లు వేస్తారు. 

కుంభం: శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేరుతాయి. బంధు, మిత్రుల‌తో స‌ర‌దాగా గ‌డుపుతారు. ప్ర‌యాణాల‌వ‌ల్ల లాభం చేకూరుతుంది. శ్ర‌మ‌కు త‌గిన ఫ్ర‌తిఫ‌లం ల‌భిస్తుంది. ధ‌న‌చింత ఉండ‌దు. స‌మాజంలో గౌర‌వ మ‌ర్యాద‌లు ల‌భిస్తాయి. అన్నివిధాలా సుఖాన్ని పొందుతారు. 

మీనం: శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేర్చుకుంటారు. శుభ‌వార్త‌లు వింటారు. ఆక‌స్మిక ధ‌న‌లాభంతో ఆనందంగా ఉంటారు. ప్ర‌య‌త్న కార్యాల‌న్నింటిలో స‌ఫ‌లీకృతుల‌వుతారు. కీర్తి, ప్ర‌తిష్ఠ‌లు అధిక‌మ‌వుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. 


పంచాంగక‌ర్త‌..
గౌరీభ‌ట్ల రామ‌కృష్ణ‌శ‌ర్మ సిద్ధాంతి
మేడిప‌ల్లి, ఉప్ప‌ల్‌, హైద‌రాబాద్‌
9440 350 868  

VIDEOS

logo