శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Horoscope - Feb 10, 2021 , 06:13:57

10-02-2021 బుధ‌వారం.. మీ రాశి ఫ‌లాలు

10-02-2021 బుధ‌వారం.. మీ రాశి ఫ‌లాలు

మేషం: ఆక‌స్మిక ధ‌న‌లాభం ఉంటుంది. రాజ‌కీయ‌రంగంలో ఉన్న‌వారికి, క్రీడాకారుల‌కు అద్భుత‌మైన అవ‌కాశాలు ల‌భిస్తాయి. అన్నింటా విజ‌యాన్నే సాధిస్తారు. బంధు, మిత్రులు క‌లుస్తారు. శుభ‌వార్త‌లు వింటారు. వృత్తి, ఉద్యోగ రంగాల్లోనివారికి అభివృద్ధి ఉంటుంది. 

వృష‌భం: స‌్థిరాస్తుల‌కు సంబంధించిన స‌మ‌స్యలు ప‌రిష్క‌రింప‌బ‌డుతాయి. నూత‌న గృహ‌కార్యాల‌పై శ్ర‌ద్ధ‌వ‌హిస్తారు. ఆక‌స్మిక ధ‌న‌లాభంతో ఆనందిస్తారు. బంధు, మిత్రుల‌తో క‌లిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవ‌ద‌ర్శ‌నం చేసుకుంటారు. భ‌క్తిశ్ర‌ద్ధ‌లు అధిక‌మ‌వుతాయి. 

మిథునం: శుభ‌కార్య ప్ర‌య‌త్నాలు సుల‌భంగా నెర‌వేరుతాయి. దూర బంధువుల‌తో క‌లుస్తారు. త‌ద్వారా లాభాలు ఉంటాయి. విదేశ‌యాన ప్ర‌య‌త్నాలు సంపూర్ణంగా నెర‌వేర్చుకుంటారు. ఆక‌స్మిక ధ‌న‌లాభ‌యోగం ఉంటుంది. అన్ని విష‌యాల్లో విజ‌యాన్ని సాధిస్తారు. 

క‌ర్కాట‌కం: ఆత్మీయుల స‌హ‌కారం ల‌భిస్తుంది. ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. ఆర్థిక ఇబ్బందుల‌ను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధ‌వ‌ల్ల బ‌ల‌హీనులు అవుతారు. అధికార భ‌యం ఉంటుంది. ప్ర‌యాణాలు వాయిదావేసుకోవాల్సి వ‌స్తుంది. 

సింహం: మానసిక ఆనందం ల‌భిస్తుంది. గ‌తంలో వాయిదా వేయ‌బ‌డిన ప‌నులు పూర్త‌వుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి. కొన్ని జటిల‌మైన స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం ల‌భిస్తుంది. 

క‌న్య‌: విదేశ‌యాన ప్ర‌య‌త్నాల‌కు అనుకూలంగా ఉంటుంది. ప్ర‌యాణాలు ఎక్కువ‌గా చేస్తారు. మెల‌కువ‌గా ఉండ‌టం అవ‌స‌రం. స్థాన‌చ‌ల‌నం ఏర్ప‌డే అవ‌కాశాలు ఉంటాయి. రుణ‌లాభం పొందుతారు. ఎల‌ర్జీతో బాధ‌ప‌డేవారు జాగ్ర‌త్త‌గా ఉండాలి. ప్ర‌‌త్న‌కార్యాల‌కు ఆటంకాలు ఉంటాయి. 

తుల‌: అనారోగ్య బాధ‌ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతారు. స్థాన‌చ‌ల‌న సూచ‌న‌లు ఉంటాయి. నూత‌న వ్య‌క్తులు క‌లుస్తారు. కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉండ‌కపోవ‌డం మాన‌సిక ఆందోళ‌న చెందుతారు. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు దూర‌మ‌వుతాయి. 

వృశ్చికం: ఆర్థిక ఇబ్బందులు ఉండ‌వు. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాల‌ను ఖ‌రీదు చేస్తారు. స్నేహితుల‌ను క‌లుస్తారు. ఇత‌రుల‌కు మంచి స‌ల‌హాలు సూచ‌న‌లు చేస్తారు. సంఘంలో గౌర‌వం పెరుగుతుంది. ధైర్య‌సాహ‌సాల‌తో కొన్ని ప‌నులు పూర్తిచేస్తారు. శుభ‌వార్త‌లు వింటారు. 

ధ‌నుస్సు: క‌ళాకారుల‌కు, మీడియా రంగాల‌వారికి మంచి అవ‌కాశాలు ల‌భిస్తాయి. దేహాలంక‌ర‌ణ‌కు ఎక్కువ ప్రాధాన్య‌మిస్తారు. కుటుంబంసౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రుల‌ను క‌లుస్తారు. పేరు, ప్ర‌తిష్ట‌లు సంపాదిస్తారు. నూత‌న వ‌స్తు, వ‌స్త్ర‌, ఆభ‌ర‌ణాల‌ను పొందుతారు. 

మ‌క‌రం: రుణ‌ప్ర‌యత్నాలు ఫలిస్తాయి. కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉండ‌క‌పోవ‌డంతో మాన‌సిక ఆందోళ‌న చెందుతారు. స్త్రీల‌కు స్వ‌ల్ప అనారోగ్య బాధ‌లు ఉంటాయి. బంధు, మిత్రుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది.

కుంభం: రుణ‌ప్ర‌యత్నాలు తొంద‌ర‌గా ఫలిస్తాయి. స్థాన‌చ‌ల‌న సూచ‌న‌లు ఉంటాయి. శుభ‌కార్యా‌ల మూల‌కంగా ధ‌న‌వ్య‌యం అధిక‌మ‌వుతుంది. ప్ర‌య‌ణాలు ఎక్కువ‌గా చేస్తారు. అనారోగ్యం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త అవ‌స‌రం. 

మీనం: స‌్థిరాస్తుల విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండ‌టం మంచిది. ఒక అద్భుత అవ‌కాశాన్ని కోల్పోతారు. నూత‌న వ్య‌క్తుల ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. ప్ర‌యాణాల‌వ‌ల్ల లాభాన్ని పొందుతారు. త‌ల‌చిన కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి. నూత‌న కార్యాలు వాయిదావేసుకోక త‌ప్ప‌దు.       

పంచాంగ‌క‌ర్త‌..
గౌరీభ‌ట్ల రామ‌కృష్ణ‌శ‌ర్మ సిద్ధాంతి
మేడిప‌ల్లి, ఉప్ప‌ల్, హైద‌రాబాద్‌
9440 350 868

VIDEOS

logo