మంగళవారం 07 ఏప్రిల్ 2020
Horoscope - Feb 12, 2020 , 06:55:07

12 ఫిబ్రవరి బుధవారం 2020.. మీ రాశిఫలాలు

12 ఫిబ్రవరి బుధవారం 2020.. మీ రాశిఫలాలు

ఈ రోజు ఉద్యోగ విషయంలో కానీ, ప్రయాణం విషయంలో కానీ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. వ్యాపార సంబంధ లావాదేవీలు, ఒప్పందాలు జరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం కానీ, ఇతరుల ఒత్తిడికి లొంగి నిర్ణయాలు తీసుకోవటం కానీ మంచిది కాదు.

     

మేషరాశి :  ఈ రోజు ఉద్యోగ విషయంలో కానీ, ప్రయాణం విషయంలో కానీ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. వ్యాపార సంబంధ లావాదేవీలు, ఒప్పందాలు జరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం కానీ, ఇతరుల ఒత్తిడికి లొంగి నిర్ణయాలు తీసుకోవటం కానీ మంచిది కాదు.

వృషభం:   ఈ రోజు మీరి అనుకున్న పనులు సమయానికి పూర్తి కాకపోవటం లేదా అనుకోని అడ్డంకులు రావటం వలన మానసికంగా చికాకుకు, కలతకు లోనవుతారు. మీ పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం కాదు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుని అవమానం పాలవకండి .

మిథునం :  ఈ రోజు ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు ఉండే అవకాశముంది. అలాగే మీ కుటుంబ సభ్యుల లేదా బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం.

కర్కాటకం :   ఈ రోజు మీ మనస్సు, ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆత్మీయులతో వివాదాలు ఏర్పడటం కానీ, వారి కోపానికి గురవటం కానీ జరగవచ్చు. ఉద్యోగం విషయంలో, పని విషయంలో నిర్లక్ష్యం చేయకండి. మీ బంధువుల్లో ఒకరి నుంచి అనుకోని సాయాన్ని పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.

సింహం :    ఈ రోజు ఇతరులతో వ్యవహరించనప్పుడు కొంత జాగ్రత్తగా ఉండటం మంచిది. మీ మాట తీరు కానీ, వ్యవహార శైలి కానీ ఎదుటివారిని ఇబ్బంది పెట్టే అవకాశముంటుంది. మీకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చకండి, దాని కారణంగా మీ ఆత్మీయులు దూరమయ్యే అవకాశముంటుంది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. 

కన్య:  ఈ రోజు మీ వ్యక్తిగత విషయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. మీ ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. మానసికంగా కొంత ఉత్సాహంగా ఉన్నప్పటికి ఏదో తెలియని ఆందోళన మిమ్మల్ని ఎక్కువగా ఆలోచించేలా చేస్తుంది. మీకు ఇష్టమైన వారితో మీ వ్యక్తిగత విషయాలు పంచుకుంటారు. వైవాహిక జీవితం మెరుగవుతుంది. 

తుల:  ఈ రోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు కానీ ప్రయాణాలు కానీ చేయవలసి వస్తుంది. మానసికంగా ఒత్తిడికి, ఒంటరితనానికి లోనవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. డబ్బు కానీ, విలువైన వస్తువులు కానీ పోగొట్టుకోకుండా చూసుకొండి. అలాగే ఇతరులతో వ్యవహరించేటప్పుడు కూడా జాగ్రత్త అవసరం.

వృశ్చికం :   ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బురావడం కానీ, లేదా మిత్రులు, బంధువుల ద్వారా ఆర్థిక సహాయం అందడం కానీ జరుగుతుంది. మీరు తలపెట్టిన పనులు సులువుగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో అనుకోని శుభపరిణామాలుంటాయి. మీ పిల్లల గురించి శుభవార్త వింటారు.

ధనుస్సు:    ఈ రోజు మీ వ్యాపార లేదా ఉద్యోగ సంబంధ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే విదేశీయానం గురించి కానీ, ఉద్యోగంలో మార్పు గురించి కానీ మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి సంబంధ వ్యవహారాలకు, పై అధికారులను కలవటానికి అనుకూల దినం. 

మకరం :   ఈ రోజు కొత్త ప్రదేశాలు సందర్శించడం కానీ, కొత్త వ్యక్తుల్ని కలుసుకోవడం చేస్తారు. ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన కానీ, మీ పై అధికారులను కలుసుకోవడం కానీ చేస్తారు. మానసికంగా కొంత ఆందోళనతో, ఉద్విగ్నతతో ఉంటారు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. పెట్టుబడులకు అనువైన రోజు కాదు.


కుంభం :    ఈ రోజు మీరు చేపట్టిన పనుల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. మాట విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అపోహలు, అపార్థాల కారణంగా బంధువులతో వివాదాలు ఏర్పడతాయి. నూతన వ్యాపారానికి, ఆర్థిక లావాదేవీలకు అనుకూల దినం కాదు.


మీనం :  ఈ రోజు నూతన ఆర్థిక లేదా వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు. వివాదాల పరిష్కారం జరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. మీ పిల్లల కారణంగా ఆనందం పొందుతారు. వాయిదాపడుతున్న పనులు పూర్తి చేయగలుగుతారు.


logo