గురువారం 09 ఏప్రిల్ 2020
Horoscope - Mar 10, 2020 , 06:12:55

మార్చి 10వ తేదీ మంగళవారం మీ రాశి ఫలాలు

మార్చి 10వ తేదీ మంగళవారం మీ రాశి ఫలాలు

మేషరాశి :  ఈ రోజు ఉద్యోగ విషయంలో కానీ, ప్రయాణం విషయంలో కానీ ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటారు. వ్యాపార సంబంధ లావాదేవీ, ఒప్పందాలు జరుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కానీ, ఇతరుల ఒత్తిడికి లొంగి నిర్ణయాలు తీసుకోవడం కానీ మంచిది కాదు.


వృషభం: ఈ రోజు మీరు అనుకున్న పనులు సమయానికి పూర్తి కాకపోవటం లేదా అనుకోని అడ్డంకులు రావడం వలన మానసికంగా చికాకుకు, కలతకు లోనవుతారు. మీ స్నేహితుల కారణంగా సమస్య కొంత తగ్గుతుంది. మీ పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక సంబంధ వ్యవహారాలకు అనుకూల దినం కాదు. 


మిథునం :  ఈ రోజు ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు ఉండే అవకాశముంది. అలాగే మీ కుటుంబ సభ్యులు లేదా బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం.


కర్కాటకం :  ఈ రోజు మీ మనసు, ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనాలోచిత నిర్ణయాల కారణంగా ఆత్మీయులతో వివాదాలు ఏర్పడటం కానీ, వారి కోపానికి గురవడం కానీ జరుగవచ్చు. ఉద్యోగం విషయంలో, పని విషయంలో నిర్లక్ష్యం చేయకండి. మీ బంధువులలో ఒకరి నుంచి అనుకోని సాయాన్ని పొందుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం.


సింహం :  ఈ రోజు ఇతరులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. మీ మాట తీరు కానీ, వ్యవహార శైలి కానీ ఎదుటివారిని ఇబ్బంది పెట్టే అవకాశముంటుంది. మీకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చకండి. దాని కారణంగా మీ ఆత్మీయులు దూరమయ్యే అవకాశముంటుంది. 


కన్య :  ఈ రోజు మీ వ్యక్తిగత విషయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. మీ ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. మానసికంగా కొంత ఉత్సాహంగా ఉన్నప్పటికీ ఏదో తెలియని ఆందోళన మిమ్మల్ని ఎక్కువగా ఆలోచించేలా చేస్తుంది. మీకు ఇష్టమైన వారితో మీ వ్యక్తిగత విషయాలు పంచుకుంటారు. వైవాహిక జీవితం మెరుగవుతుంది. 


తుల :  ఈ రోజు ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు కాని ప్రయాణాలు కాని చేయవలసి వస్తుంది. మానసికంగా ఒత్తిడికి, ఒంటరితనానికి లోనవుతారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. డబ్బు కానీ, విలువైన వస్తువులు కానీ పోగొట్టుకోకుండా చూసుకోండి. అలాగే ఇతరులతో వ్యవహరించేటప్పుడు కూడా జాగ్రత్త అవసరం.


వృశ్చికం :  ఈ రోజు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. అనుకోని విధంగా డబ్బురావడం కానీ, లేదా మిత్రులు, బంధువుల ద్వారా ఆర్థిక సహాయం అందడం కానీ జరుగుతుంది. మీరు తలపెట్టిన పనులు సులువుగా పూర్తి చేయగలుగుతారు. ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ అనుకోని శుభపరిణామాలుంటాయి. 


ధనుస్సు :  ఈ రోజు మీ వ్యాపార లేదా ఉద్యోగ సంబంధ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అలాగే విదేశీయానం గురించి కానీ, ఉద్యోగంలో మార్పు గురించి కానీ మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. స్తిరాస్థి సంబంధ వ్యవహారాలకు, పై అధికారులను కలవడానికి అనుకూల దినం. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.


మకరం : ఈ రోజు కొత్త ప్రదేశాలు సందర్శించడం కానీ, కొత్త వ్యక్తుల్ని కలుసుకోవడం కాని చేస్తారు. ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన కాని, మీ పై అధికారులను కలుసుకోవడం కానీ చేస్తారు. మానసికంగా కొంత ఆందోళనతో, ఉద్విగ్నతతో ఉంటారు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. పెట్టుబడులకు అనువైన రోజు కాదు.


కుంభం :  ఈ రోజు మీరు చేపట్టిన పనుల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయాణాలు వాయిదా పడుతాయి. మానసికంగా ఒత్తిడికి లోనవుతారు. మాట విషయంలో కొంత జాగ్రత్త అవసరం. అపోహలు, అపార్థాల కారణంగా బంధువులతో వివాదాలు ఏర్పడుతాయి. నూతన వ్యాపారానికి, ఆర్థిక లావాదేవీలకు అనుకూల దినం కాదు.


మీనం :  ఈ రోజు నూతన ఆర్థిక లేదా వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు. వివాదాల పరిష్కారం జరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. మీ పిల్లల కారణంగా ఆనందం పొందుతారు. వాయిదాపడుతున్న పనులు పూర్తి చేయగలుగుతారు.



logo