e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, June 21, 2021
Home బతుకమ్మ రాశి ఫలాలు

రాశి ఫలాలు

రాశి ఫలాలు

6.6.2021 నుంచి 12.6.2021 వరకు

మేషం
వృత్తిలో సంతృప్తి, అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. బంధుమిత్రులతో ఖర్చులు ఉంటాయి. నిత్య వ్యాపారం కలిసివస్తుంది. ఇచ్చిన డబ్బు తిరిగి రావడంలో కొంత ఆలస్యమైనా చేతికి అందుతుంది. ఆదాయం సంతృప్తిగా ఉంటుంది. వృత్తిరీత్యా అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో తోటివారితో చిన్నపాటి మనస్పర్ధలున్నా అధికారుల ఆదరణ లభిస్తుంది. మంచిపేరు సంపాదిస్తారు. అందరితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ప్రయాణాలు వాయిదా పడతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సంబంధాలు మరింత బలపడతాయి.

వృషభం
ఈవారం అనుకూలంగా ఉంటుంది. ఇంట్లో వాతావరణం బావుంటుంది. ఆరోగ్యంగా ఉంటారు. బంధుమిత్రాదులతో పనులు నెరవేరుతాయి. పరిచయాలు అనుకూలిస్తాయి. ప్రారంభించిన పనులలో కొంత ఆలస్యమైనా శ్రద్ధతో చేస్తారు. వ్యాపారం లాభదాయకంగానే ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలలో నలుగురి సహకారం లభిస్తుంది. రావలసిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందినా సద్వినియోగం అవుతుంది. వృత్తిరీత్యా సంతృప్తిగా ఉంటారు. ఘర్షణ వాతావరణం తొలగుతుంది. స్నేహం పెంపొందుతుంది. చదువులో అనుకూలత ఉంటుంది. ఆస్తుల వివాదాలు పరిష్కారమై, తద్వారా ఆదాయం పెరుగుతుంది. మంచి ఆలోచనలతో ముందుకు వెళతారు. సకాలంలో నిర్ణయాలు తీసుకుంటారు.

మిథునం
ఇంటా బయటా సంతృప్తిగా ఉంటారు. అందరితో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడంతో సత్ఫలితాలు పొందుతారు. ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. ఆఫీసులో అధికారుల అండదండలు లభిస్తాయి. రావలసిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందుతుంది. కొన్ని పనులలో జాప్యం జరుగవచ్చు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటికి కావలసిన వస్తువులను కొంటారు. ఉద్యోగ మార్పు ఉండవచ్చు. వ్యాపారస్తులకు అనుకూలమైన వారం. తల్లిదండ్రులు, అనుభవజ్ఞుల సలహాలు అందుతాయి. సత్ఫలితాలు పొందుతారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. ఆస్తుల విషయంలో తగాదాలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యం నయమవుతుంది.

కర్కాటకం
ఆఫీసులో అందరితో స్నేహంగా ఉంటూ, పనులు నెరవేర్చుకుంటారు. తోటి ఉద్యోగుల సహకారం బాగా లభిస్తుంది. ఉద్యోగంలో సంతృప్తిని పొందుతారు. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం సంతృప్తినిస్తుంది. దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు. అధికారులతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. వ్యాపారస్తులకు భాగస్వాములతో అవగాహన పెంపొందుతుంది. ప్రారంభించిన పనులలో అనుకోని ఆటంకాలు రావచ్చు. పట్టుదలతో, ఏకాగ్రతతో ముందుకు వెళతారు. ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి.

సింహం
ప్రారంభించిన పనులు సంతృప్తిగా పూర్తి చేస్తారు. పూర్వ పెట్టుబడులకు ప్రతిఫలం పొందుతారు. బంధుమిత్రులతో ఖర్చులు, వివాదాలు ఉండవచ్చు. ఆదాయం స్థిరంగా ఉండి, క్రమేపీ పెరుగుతుంది. సంతృప్తిగా ఉంటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. భాగస్వాములతో సత్సంబంధాలు, వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కొనసాగుతాయి. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు సిబ్బందితో కొంత మనస్పర్ధలున్నా పనులు లాభసాటిగా పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నవారికి అనుకూలం. ఆఫీసులో అధికారులతో సంతృప్తిగా ఉంటారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.

కన్య
తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. స్వయంవృత్తిలో ఉన్నవారు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా ఫలితాలు సంతృప్తిగానే ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి తాత్కాలిక ఫలితాలు ఉంటాయి. కొన్ని పనులలో అదృష్టం కలిసివస్తుంది. కష్టానికి తగిన ఫలితం కూడా ఉంటుంది. వృథా ఖర్చులవల్ల ఇబ్బందులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కారణంగా ఉన్నత విద్యాయత్నాలు వాయిదా పడవచ్చు. సమాజంలో గుర్తింపు ఉండటం వల్ల అందరి సహకారం లభిస్తుంది. శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పనులను ఏకాగ్రతతో, పట్టుదలతో చేయాలి. నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది.

తుల
పిల్లల విద్యా ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇంటి వాతావరణం సంతృప్తిగా ఉంటుంది. చదువులో మంచి స్థాయిలో నిలుస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. రావలసిన డబ్బు పాక్షికంగా చేతికి అందుతుంది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. అనవసరమైన ప్రయాణాలు అలసటకు దారి తీస్తాయి. కొన్ని నిర్ణయాలు వాయిదా వేసుకోవడం మంచిది. రాజకీయ, ప్రభుత్వ పనులలో వృథా ఖర్చులు ఉంటాయి. నిత్య వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. స్నేహితులు, బంధువుల సహకారం లభిస్తుంది. కుటుంబంలో అందరితో చర్చించి పనులు చేస్తారు. ఏకాగ్రతతో పనులు చేయడం వల్ల అనుకూల ఫలితాలు పొందుతారు.

వృశ్చికం
ఆదాయం స్థిరంగా ఉంటుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. మంచివారితో పరిచయాలు ఏర్పడతాయి. భార్యాపిల్లలతో సంతోషంగా గడుపుతారు. ఆలోచనలను సరైన సమయంలో ఆచరణలో పెడతారు. సత్ఫలితాలను పొందుతారు. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. అనుభవజ్ఞుల సూచనల మేరకు పనులు చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో బాధ్యతలు పెరుగుతాయి. నిత్య వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. వ్యాపార విస్తరణను వాయిదా వేసుకుంటారు. వ్యాపార భాగస్వాములతో చిన్నపాటి మనస్పర్ధలు రావచ్చు. సమయస్ఫూర్తితో వాటిని పరిష్కరించుకుంటారు. పట్టుదలతో పనులు చేస్తారు.

ధనుస్సు
ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగస్తులు తోటి సిబ్బందితో స్నేహంగా ఉంటారు. సంతృప్తిగా పనులు చేస్తారు. అధికారులతో అభిప్రాయ భేదాలు రావచ్చు. అప్రమత్తంగా ఉండటం మంచిది. అనవసరమైన ఖర్చులు ముందుకు వస్తాయి. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతారు. గతంతో పోలిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యల మూలంగా సర్దుబాట్లు అవసరం పడవచ్చు. బంధుమిత్రులతో వివాదాలు తలెత్తే అవకాశం ఉంది. ఆదాయం స్థిరంగా ఉన్నా , ఖర్చులవల్ల అవసరానికి చేతిలో డబ్బు లేకపోవడంతో కొంత అధైర్యానికి గురయ్యే అవకాశం ఉంది. నిర్ణయాలను సమయానుకూలంగా తీసుకోవాలి. వృత్తి, వ్యాపారాలలో లాభం ఉంటుంది.

మకరం
తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. డబ్బు ఆలస్యంగా చేతికి అందినా పనులు పూర్తవుతాయి. వ్యాపార భాగస్వాములతో స్నేహం పెంపొందుతుంది. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో అందరి సహకారం లభిస్తుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తుల విషయంలో తగాదాలు పరిష్కారమవుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంగా పనులు చేస్తారు. వాహనాల వల్ల ఖర్చులు పెరిగినా పనులు పూర్తవుతాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ నిర్మాణ పనులు చేపడతారు. పిల్లలు చదువులో రాణిస్తారు. ఉన్నతవిద్యా యత్నాలలో సంతృప్తి లభిస్తుంది.

కుంభం
నలుగురికి సహాయపడే పనులు చేస్తారు. పిల్లలు చదువులో రాణిస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు పాక్షికంగా ఫలిస్తాయి. ఆఫీసులో తోటివారితో చిన్నపాటి మనస్పర్ధలున్నా అధికారుల ఆదరణ లభిస్తుంది. సమస్యలను అధిగమిస్తారు. అందరితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. రావలసిన డబ్బు కొంత చేతికి అందుతుంది. శుభకార్యాలవల్ల ఖర్చులు పెరుగుతాయి. సర్దుబాట్లు అవసరం పడవచ్చు. అనాలోచిత నిర్ణయాలతో ఇబ్బందులు ఉంటాయి. భార్యాపిల్లలతో సంతోషంగా ఉంటారు. కళాకారులకు సమయం కలిసివస్తుంది. వ్యవసాయదారులకు అందరి సహకారంతో దిగుబడి సంతృప్తికరంగా ఉంటుంది.

మీనం
రావలసిన డబ్బు అందుతుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ప్రయత్నిస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. పూర్వ పెట్టుబడుల మూలంగా లాభాలు ఉంటాయి. రాజకీయ, కోర్టు వ్యవహారాలలో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ప్రయాణాలు కలిసివస్తాయి. ఆస్తుల తగాదాలు పరిష్కారమవుతాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. వ్యాపార భాగస్వాములమధ్య సదవగాహన ఉంటుంది. సంయుక్త నిర్ణయాలతో ముందుకు వెళతారు. మంచి ఫలితాలు పొందుతారు. ఇంటా బయటా సంతృప్తిగా ఉంటారు. సమస్యలను చర్చలద్వారా పరిష్కరించుకుంటారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
రాశి ఫలాలు

ట్రెండింగ్‌

Advertisement