సోమవారం 06 ఏప్రిల్ 2020
Horoscope - Mar 06, 2020 , 06:28:12

శుక్రవారం, 6 మార్చి 2020... మీ రాశి ఫలాలు

శుక్రవారం, 6 మార్చి 2020... మీ రాశి ఫలాలు

మేషరాశి :  ఈ రోజు ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు ఉండే అవకాశముంది. అలాగే మీ కుటుంబ సభ్యులు లేదా బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం.

వృషభం :  ఈ రోజు ఆర్థికంగా చాలా అనుకూలించే దినం. రావలసిన బకాయిలు రావటమే కాకుండా మీరు తీర్చవలసిన బాకీలు కూడా తీర్చగలుగుతారు. అనుకోని డబ్బు కానీ, చేపట్టిన పనిలో విజయం కానీ వరిస్తుంది. ఉద్యోగ విషయంలో శుభవార్త వింటారు.

మిథునం :  ఈ రోజు చేపట్టిన పనులు వాయిదా పడటం కానీ, అనుకోని అడ్డంకులు రావటం కానీ జరగవచ్చు. ఇది కేవలం తాత్కాలికమే కాబట్టి పట్టు వదలక ప్రయత్నించండి. విజయం మీ స్వంతమవుతుంది. పని ఒత్తిడి కారణంగా స్వల్ప అనారోగ్యానికి, మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశముంటుంది. తగిన విశ్రాంతి తీసుకోవటం మంచిది.

కర్కాటకం :  ఈ రోజు దూర ప్రదేశం నుంచి ఒక శుభవార్త వింటారు. మీరు చేసిన పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణం చేసే అవకాశముంటుంది. బంధువులను కలుసుకుంటారు. 

సింహం :  ఈ రోజు ఆరోగ్యం విషయంలో కొంచె శ్రద్ధ అవసరం. నేత్ర సంబంధ మైన సమస్యలు కానీ, ఎలర్జీ బారిన కానీ పడే అవకాశముంటుంది. అలాగే మానసికంగా ఏదో తెలియని ఒత్తిడికి ఫీల్‌ అవుతారు. ఆర్థిక విషయాల్లో కూడా కొంత జాగ్రత్త అవసరం. డబ్బు ఎక్కువ దగ్గర పెట్టుకుని ప్రయాణం చేయకండి.

కన్య :   ఈ రోజు మీకు ఆనందంగా, లాభ దాయకంగా ఉంటుంది. అనుకోని మిత్రులను కలవటం, వారితో రోజును ఆనందంగా గడపటం చేస్తారు. అలాగే మీ కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. ఆర్థికంగా లాభిస్తుంది. పెట్టుబడుల నుంచి అనుకోని లాభం వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.

తుల :  ఈ రోజు వృత్తి పరంగా అనుకూలంగా ఉంటుంది. మీ కోరిక నెరవేరడం, లక్ష్యానికి చేరువవటం జరుగుతుంది. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగ విషయంలోవిదేశీ యానానికి సంబంధించి శుభవార్త వింటారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.

వృశ్చికం :  ఈ రోజు ప్రయాణం చేసే అవకాశం అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉదర, ఛాతి సంబంధ అనారోగ్యాల వల్ల ఇబ్బంది పడే అవకాశముంటుంది. నిద్రలేమి కారణంగా రోజంతా ఏదో తెలియని అసౌకర్యంగా ఉంటుంది. మిత్రులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనం చేసే అవకాశముంటుంది. 

ధనుస్సు :  ఈ రోజు మీ సహోద్యోగులతో, పై అధికారులతో కొంత సామరస్య పూర్వకంగా ప్రవర్తించటం మంచిది. అనుకోని ఆవేశం కారణంగా వారితో గొడవ జరిగే అవకాశముంటుంది. ప్రయాణంలో అనవసరమై న చిక్కుల్లో ఇరుక్కునే అవకాశముంటుంది. కాబట్టి జాగ్రత్త అవసరం. పెట్టుబడులకు, భూ, గృహ సంబంధ ఒప్పందాలకు అనువైన రోజు కాదు.

మకరం :   మీ జీవిత భాగస్వామితో కలిసి ఈ రోజంతా ఆనందంగా గడుపుతారు. మీ మధ్య ఉన్న అపోహలు, అపార్థాలు తొలగిపోతాయి. గృహ సంబంధ విషయాల్లో జరుగుతున్న ఆలస్యం తొలగిపోతుంది. మీ సంతా నం కారణంగా ఆనందం పొందుతారు. వ్యాపారంలో అనుకున్న లాభాలు వస్తాయి. పెట్టుబడులు లాభిస్తాయి. నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆరోగ్యం మెరుగవుతుంది.

కుంభం :   ఈ రోజు మీ వృత్తిలో శుభపరిణామాలు ఏర్పడతాయి. మీరు చేసే పనికి గుర్తింపు లభిస్తుంది. కోర్టు కేసులు లేదా వివాదాల్లో గెలుపొందుతారు. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. రావలసిన బకాయిలు వసూలవుతాయి. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త అవసరం. తలనొప్పి లేదా మెడ నొప్పులు మిమ్మల్ని బాధించవచ్చు.

మీనం :  ఈ రోజు అనుకోని ఖర్చుల కారణంగా ఆర్థికంగా కొంత ఒత్తిడికి లోనవుతారు. మీ పిల్లల ఆరోగ్యం మెరుగవుతుంది. పోటీలకు, వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. పెట్టుబడులకు అనువైన రోజు కాదు. మీ జీవిత భాగస్వామికి ఉద్యోగం విషయంలో అనుకూల ఫలితాలు ఏర్పడతాయి.












logo