మంగళవారం 31 మార్చి 2020
Horoscope - Jan 30, 2020 , 06:47:52

30 జనవరి 2020 గురువారం.. మీ రాశిఫలాలు

30 జనవరి 2020 గురువారం.. మీ రాశిఫలాలు

మేష రాశి :  ఈ రోజు ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. ముఖ్యంగా కంటికి సంబంధించిన సమస్యలతో బాధపడే అవకాశం ఉంటుంది. మానసికంగా ఆందోళనగా ఉంటుంది. అలాగే పని ఒత్తిడి అధికంగా ఉంటుంది. శివారాధన చేయటం మంచిది. ఆర్థిక లావాదేవీలు వాయిదా వేయడం మంచిది.


వృషభం :  ఈ రోజు ఆహ్లాద కరమైన రోజు. ఇష్టమైన వారితో ఎక్కువ సమయం గడుపుతారు. బంధుమిత్రులు కలుసుకోవడం, వివాహాది శుభకార్యాల్లో పాల్గొనడం చేస్తారు. మీరు గతంలో పోగొట్టుకున్న వస్తువులు దొరకడం కానీ, రాదనుకున్న డబ్బు తరిగి రావడం కాని జరుగుతుంది.


మిథునం :  ఈ రోజు అనుకున్న పనులు సమయానికి అవుతాయి. చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్న విషయంలో శుభవార్త వింటారు. మీ లక్ష్యం నెరవేరుతుంది. ధన లాభం కలుగుతుంది. అలాగే రుచికరమైన భోజనం చేస్తారు. ఆర్థిక లావాదేవీలకు అనుకూల దినం. కోర్టు లేదా ప్రభుత్వ సంబంధ వ్యవహారాల్లో అనుకూల ఫలితం పొందుతారు.


కర్కాటకం :  ఈ రోజు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు వచ్చే అవకాశముంటుంది. నిద్రలేమి కారణంగా మానసిక ప్రశాంతత ఉండదు. అలసట, నీరసం అధికంగా ఉంటాయి. మీ వ్యాపార భాగస్వామితో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త అవసరం. 


సింహం :  ఈ రోజు మీ సహోద్యోగులతో, పై అధికారులతో సామరస్యంగా వ్యవహరించడం మంచిది. మీ అజాగ్రత్త కారణంగా వారి కోపానికి గురయ్యే అవకాశమున్నది. వారితో వాదనకు దిగకండి. మాట విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక విషయాల్లో అనుకోని నష్టం కాని, మోసం కాని జరిగే అవకాశముంది.


కన్య :  మీ జీవిత భాగస్వామితో, పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వారితో కలిసి వినోదయాత్ర చేసే అవకాశముంది. ఖర్చు అధికంగా ఉంటుంది. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు.


తుల :  మీరు అనుకున్న పనులు పూర్తి చేయటానికి, కొత్త పనులు ప్రారంభించటానికి అనుకూలమైన రోజు. అలాగే చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. మీ పనికి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో అభివృద్ధి సాధిస్తారు.


వృశ్చికం : ఆర్థికంగా కొంత ఇబ్బందిని కలిగించే రోజు. ధన నష్టం కానీ, అనవసరమైన ఖర్చు కానీ ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలమైన రోజు కాదు. ఎవరికి కూడా డబ్బు విషయంలో మాట ఇచ్చి ఇబ్బంది పడకండి. ఆర్థిక నియంత్రణ అవసరం.


ధనుస్సు : ఆరోగ్య విషయంలో ఈ రోజు కొంత జాగ్రత్త అవసరం. కడుపు నొప్పి కానీ, ఛాతిలో మంటతో కానీ బాధ పడే అవకాశముంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. బయటి భోజనం చేయకండి. అలాగే మీ కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం కూడా మీకు ఆందోళన కలిగించే అవకాశం ఉన్నది.


మకరం :  ఈ రోజు ఆర్థికంగా కలిసి వస్తుంది. పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. అలాగే మొండి బకాయిలు వసూలవుతాయి. భూ సంబంధ లావాదేవీలు చేస్తారు. కుటుంబ సభ్యుల సహాయ, సహకారాలు అందుతాయి.


కుంభం : మీరు చేపట్టే పనుల్లో అవరోధాలు ఏర్పడతాయి. ముఖ్యంగా మీ కార్యాలయంలో మీరు చేయాలనుకున్న పనికి సహోద్యోగుల నుంచి వ్యతిరేకత రావచ్చు. ఆవేశానికి లోనుకాకుండా సామరస్యపూర్వకంగా వ్యవహరించండి. శారీరక, మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. విశ్రాంతి అవసరం.


మీనం :  అదృష్టం కలిసివచ్చే రోజు. మీరు చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న పనులు ఒక కొలిక్కి వస్తాయి. మీ తోటి వారి నుంచి కానీ, సహోద్యోగుల నుంచి కాని ప్రశంసలు అందుకుంటారు.


logo
>>>>>>