బుధవారం 08 ఏప్రిల్ 2020
Horoscope - Feb 02, 2020 , 06:19:43

2 ఫిబ్రవరి 2020 ఆదివారం.. మీ రాశిఫలాలు

2 ఫిబ్రవరి 2020 ఆదివారం.. మీ రాశిఫలాలు

మేష రాశి :  అదృష్టవంతమైన రోజు. మీ సహోద్యోగుల లేదా పై అధికారుల ప్రశంసలు పొందుతారు. మీపై గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్‌ కానీ పదోన్నతి విషయంలో శుభవార్త కానీవింటారు. వాయిదా పడిన పనులు పూర్తవుతాయి.


వృషభం : ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. కండ్లు లేదా దంతాలకు సంబంధించిన అనారోగ్యం భారిన పడే అవకాశముంటుంది. పని ఎక్కువ ఉండటం వల్ల అసహనానికి, ఉద్రేకానికి గురయ్యే అవకాశముంటుంది. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి.


మిథునం : ఆహ్లాద కరమైన రోజు. ఇష్టమైన వారితో గడుపుతారు. బంధుమిత్రుల సమాగమం. వివాహాది శుభకార్యాల్లో పాల్గొనటం అలాగే పాత మిత్రులను కలువడం జరుగుతుంది.


కర్కాటకం :   అనుకున్న పనులు అవుతాయి. చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్న విషయంలో శుభవార్త వింటారు. మీ లక్ష్యం నెరవేరుతుంది. ధనలాభం కలుగుతుంది అలాగే రుచికరమైన భోజనం చేస్తారు.


సింహం : ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు వచ్చే అవకాశముంటుంది. నిద్రలేమి కారణంగా మానసిక ప్రశాంతత ఉండదు. అలసట, నీరసం అధికంగా ఉంటాయి.


కన్య :  మీ సహోద్యోగులతో, పై అధికారులతో సుహృద్భావముతో మెలగండి. వారితో గొడవలకు దిగటం మంచిది కాదు. అలాగే వారు చెప్పిన దానిని శ్రద్ధగా విని ఆచరించటానికి ప్రయత్నించడం. కోపావేశాలకు లోనవటం వలన అనవసర సమస్యలకు గురయ్యే అవకాశముంటుంది.


తుల :  మీ జీవిత భాగస్వామితో, పిల్లలతో ఆనందంగా గడుపుతారు. వారితో కలిసి వినోదయాత్ర చేసే అవకాశముంది. ఖర్చు అధికంగా ఉంటుంది. మీ సంతానం కారణంగా ఆనందం పొందుతారు.


వృశ్చికం : ఈ రోజు తలపెట్టిన కార్యములు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. దాని కారణంగా సమాజంలో గౌరవాన్ని, గుర్తింపును పొందుతారు. ఉద్యోగంలో మార్పు కానీ, పదోన్నతి కానీ ఉంటుంది.


ధనుస్సు : ఆర్థికంగా కొంత ఇబ్బందిని కలిగించే రోజు. ధన నష్టం కానీ, అనవసరమైన ఖర్చు కానీ ఉంటుంది. పెట్టుబడులకు అనుకూలమైన రోజు కాదు. ఎవరికి కూడా డబ్బు విషయంలో మాట ఇచ్చి ఇబ్బంది పడకండి. ఆర్థిక నియంత్రణ అవసరం.


మకరం : ఆరోగ్య విషయంలో ఈ రోజు కొంత జాగ్రత్త అవసరం. కడుపు నొప్పి కానీ, ఛాతిలో మంటతో కానీ బాధ పడే అవకాశముంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. బయటి భోజనం చేయకండి. అలాగే మీ కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్యం కూడా మీకు ఆందోళన కలిగించే అవకాశం ఉన్నది.


కుంభం :  ఈ రోజు ఆర్థికంగా కలిసి వస్తుంది. పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. అలాగే మొండి బకాయిలువసూలవుతాయి. భూ సంబంధ లావాదేవీలు చేస్తారు. కుటుంబ సభ్యుల సహాయ, సహకారాలు అందుతాయి.


మీనం :  ఈ రోజు పనుల్లో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. ఆటంకాలు వచ్చినా ప్రయత్నం మానకండి. కొద్ది శ్రమతో ఆ పనిని పూర్తి చేయగలుగుతారు. ఆఫీస్‌లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఓపికతో మెలగాల్సిన సమయం. మానసికంగా ఓటమిని ఒప్పుకోకండి, విజయం మీ వశమవుతుంది.


logo