e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Home News 13.04.2021, మంగళవారం మీ రాశిఫలాలు

13.04.2021, మంగళవారం మీ రాశిఫలాలు

13.04.2021, మంగళవారం మీ రాశిఫలాలు

మేషం : ఆకస్మిక ధనలాభయోగముంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగా ఉంటారు. పేరు, ప్రతిష్టలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఏర్పడుతాయి. అంతటా అనుకూల వాతావరణమేర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధు, మిత్రులను కలుస్తారు.

వృషభం : రుణ ప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసం వైపు వెళ్లకుండా వుంటే గౌరవం దక్కుతుంది.క్షణికావేశం పనికిరాదు. అనుకోకుండా కుటుంబంలో కలతలేర్పడే అవకాశం ఉంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది. అనారోగ్య బాధలు అధికమవుతాయి.

మిథునం : ప్రయత్నకార్యాలకు ఆటంకాలెదురవుతాయి. బంధు, మిత్రులతో జాగ్రత్తగా మెలగుట మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. ధన నష్టాన్ని అధిగమించుటకు రుణ ప్రయత్నం చేస్తారు.

కర్కాటకం : తలచిన కార్యాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు. బంధు, మిత్రుల మర్యాద మన్ననలను పొందుతారు. అనారోగ్య బాధలుండవు. సహ ఉద్యోగులకు సహకరించే అవకాశంలభిస్తుంది. మీ ఆలోచనలు ప్రణాళికాబద్దంగా ఉంటాయి. అనుకూల పరిస్థితులేర్పడుతాయి.

సింహం : మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవ దర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. కళలందు ఆసక్తి పెరుగుతుంది. నూతన, వస్తు, వస్త్ర ఆభరణాలను పొందుతారు.

కన్య : రుణప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధలుండును. బంధు, మిత్రులతో వైరమేర్పడకుండా జాగ్రత్త పడుట మంచిది. వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. చేసే పనుల్లో కొన్ని ఇబ్బందులు వస్తాయి.

తుల : వృతి, ఉద్యోగరంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభ కార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి.

వృశ్చికం : ఆరోగ్యం గూర్చి జాగ్రత్త పడుట మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు. సహనం అన్ని విధాలా శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడుతారు.

ధనస్సు : కుటుంబంలో సుఖ, సంతోషాలుంటాయి. ధనధాన్యాభివృద్ధి ఉంటుంది. విద్యార్థులు విజయాన్ని సాధిస్తారు. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. బంధు, మిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.

మకరం : పిల్లల వల్ల ఇబ్బందులనెదుర్కొంటారు. అధికారులతో గౌరవింపబడుతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తి చేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయుట మంచిది. నూతన వ్యక్తులు పరిచయమవుతారు.

కుంభం : బంధు, మిత్రులతో మనస్పర్థలు రాకుండా జాగ్రత్త వహించుట మంచిది. అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలున్నాయి. ఆరోగ్య విషయంలో మిక్కిలి శ్రద్ధ అవసరం. శారీరక శ్రమతో పాటు, మానసికాందోళన తప్పదు. చిన్న విషయాలకై ఎక్కువ శ్రమిస్తారు.

మీనం : ప్రయత్న కార్యాలయందు దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభముంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి, ప్రతిష్టలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడుతారు.

– పంచాంగ కర్త
గౌరీభట్ల రామకృష్ణ సిద్ధాంతి
మేడిపల్లి, ఉప్పల్‌, హైదరాబాద్‌
సెల్‌ : 94403 50868

ఇవి కూడా చదవండి

రాబోయే ఐదు రోజులు రాష్ట్రంలో వర్షాలు
నిరాడంబరంగా ఉగాది వేడుకలు
పెరూలో బస్సు బోల్తా.. 20 మంది దుర్మరణం
నేటి నుంచి భద్రాద్రి రామయ్య బ్రహ్మోత్సవాలు
Advertisement
13.04.2021, మంగళవారం మీ రాశిఫలాలు
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement