సోమవారం 30 మార్చి 2020
Horoscope - Feb 10, 2020 , 05:07:22

10 ఫిబ్రవరి సోమవారం 2020.. మీ రాశిఫలాలు

10 ఫిబ్రవరి సోమవారం 2020.. మీ రాశిఫలాలు

మేషరాశి :  ఈ రోజు డబ్బు విషయంలో కొంత సామాన్యంగా ఉంటుంది. అవసరానికి తగిన డబ్బు లభించక పోవడం కానీ, పెట్టుబడుల కారణంగా నష్టపోవడం కానీ జరుగవచ్చు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార లావాదేవీలకు అనువైన దినం కాదు. వాయిదా పడిన పనులు పూర్తిచేయగలుగుతారు. 


వృషభం: ఈ రోజు ఆరోగ్యం కొంత సామాన్యంగా ఉంటుంది. ఉదర లేదా ఛాతి సంబంధ సమస్యలు ఉండే అవకాశముంది. అలాగే మీ కుటుంబ సభ్యులు లేదా బంధువుల ఆరోగ్యం కూడా మీ ఆందోళనకు కారణమవుతుంది. నీరు, ఆహారం విషయంలో జాగ్రత్త అవసరం. వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం.


మిథునం :  ఈ రోజు ఆర్థికంగా చాలా అనుకూలంచే దినం. రావలసినబకాయిలు రావడమే కాకుండా మీరు తీర్చవలసిన బాకీలు కూడా తీర్చగలుగుతారు. అనుకొని డబ్బు కానీ, చేపట్టిన పనిలో విజయం వరిస్తుంది. ఉద్యోగ విషయంలో శుభవార్త వింటారు. నిర్ణయాల విషయంలో తొందరపాటు తగదు.


కర్కాటకం : ఈ రోజు చేపట్టిన పనులు వాయిదా పడడం కానీ, అనుకోని అడ్డంకులు రావడం కానీ జరుగవచ్చు. ఇది కేవలం తాత్కాలికమే కాబట్టి పట్టు వదలక ప్రయత్నించండి. విజయం మీ సొంతమవుతుంది. పని ఒత్తిడి కారణంగా స్వల్ప అనారోగ్యానికి, మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశముంటుంది. తగిన విశ్రాంతి తీసుకోవడం మంచిది.


సింహం :  ఈ రోజు దూర ప్రదేశం నుంచి ఒక శుభవార్త వింటారు. మీరు చేసిన పనికి మంచి గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రయాణం చేసే అవకాశముంటుంది. బంధువులను కలుసుకుంటారు.


కన్య:  ఈ రోజు ఆరోగ్యం విషయంలో కొంచె శ్రద్ధ అవసరం. నేత్ర సంబంధమైన సమస్యలు కానీ, ఎలర్జీ బారిన కానీ పడే అవకాశముంటుంది. అలాగే మానసికంగా ఏదో తెలియని ఒత్తిడిని ఫీల్‌ అవుతారు. ఆర్థిక విషయాలలో కూడా కొంత జాగ్రత్త అవసరం. డబ్బు ఎక్కువ దగ్గర పెట్టుకుని ప్రయాణం చేయకండి.


తుల:  ఈ రోజు మీకు ఆనందంగా, లాభ దాయకంగా ఉంటుంది. అనుకోని మిత్రులను కలవడం, వారితో రోజును ఆనందంగా గడపడం చేస్తారు. అలాగే మీ కుటుంబ సభ్యులను కలుసుకుంటారు. ఆర్థికంగా లాభిస్తుంది. పెట్టుబడుల నుంచి అనుకోని లాభం వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.


వృశ్చికం :  ఈ రోజు వృత్తి పరంగా అనుకూలంగా ఉంటుంది. మీ కోరిక నెరవేరడం, లక్ష్యానికి చేరువవ్వడం జరుగుతుంది. వాయిదా పడుతున్న పనులు పూర్తవుతాయి. ఉద్యోగం విషయంలో విదేశీ యానానికి సంబంధించి శుభవార్త వింటారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.


ధనుస్సు:  ఈ రోజు ప్రయాణం చేసే అవకాశం అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఉదర, ఛాతి సంబంధ అనారోగ్యాల వలన ఇబ్బంది పడే అవకాశముంటుంది. నిద్రలేమి కారణంగా రోజంతా ఏదో తెలియని అసౌకర్యంగా ఉంటుంది. మిత్రులతో కలిసి ఆధ్యాత్మిక క్షేత్ర దర్శనం చేసే అవకాశముంటుంది.


మకరం :  ఈ రోజు మీ సహోద్యోగులతో, పై అధికారులతో కొంత సామరస్య పూర్వంగా ప్రవర్తించడం మంచిది. అనుకోని ఆవేశం కారణంగా వారితో గొడవ జరిగే అవకాశముంటుంది. ప్రయాణంలో అనవసరమై చికాకుల్లో ఇరుక్కునే అవకాశముంటుంది కాబట్టి జాగ్రత్త అవసరం. పెట్టుబడులకు, భూ, గృహ సంబంధ ఒప్పందాలకు అనువైన రోజు కాదు.


కుంభం :  ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాహ విషయంలో అనుకూల ఫలితం ఏర్పడుతుంది. ఆటపాటలతో రోజంతా గడుపుతారు. వ్యాపార సంబంధ ఒప్పందాలు చేసుకుంటారు. వాయిదాపడుతున్న ప్రయాణం ఈ రోజు చేయగలుగుతారు. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది.


మీనం :  ఈ రోజు వాయిదా పడుతున్న పనులు పూర్తి చేయగలుగుతారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. వివాదాలు, గొడవలు ఒక పరిష్కారానికి వస్తాయి. ఆర్థిక స్థితి మెరుగవుతుంది. రావలసిన డబ్బు సమయానికి చేతికి అందుతుంది. శత్రువుల భయం తగ్గుతుంది. మీ పనికి తగిన గుర్తింపు లభిస్తుంది.


logo