2.5.2021 నుంచి 8.5.2021 వరకు
మేషం
గురు అనుకూలతవల్ల పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. వ్యాపారం కలిసివస్తుంది. వృత్తిలో అందరి సహాయ సహకారాలు పొందుతారు. సదవగాహనతో పనులు ముందుకు సాగుతాయి. వ్యాపార లావాదేవీలు, ఒప్పందాలు కలిసివస్తాయి. రావలసిన డబ్బు కొంతజాప్యంతో అందవచ్చు. స్నేహితులు, ఆత్మీయుల సహకారం లభిస్తుంది. అందరితో సత్సంబంధాలు పెంపొందుతాయి. కార్యసాఫల్యత ఉంటుంది. వాహనాలను కొనే అవకాశం వుంది. వాహనాలవల్ల పనులు నెరవేరుతాయి. దగ్గరి ప్రయాణాలు కలిసివస్తాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. రియల్ ఎస్టేట్, గృహ నిర్మాణాలలో పెట్టుబడులు పెట్టే ఆలోచన చేస్తారు.
వృషభం
ఇంట్లో సంతృప్తిగా ఉంటారు. భార్యాపిల్లలు, ఆత్మీయులు, స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపార ఒప్పందాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉన్నా పనులలో కొంత ఆలస్యం ఉండవచ్చు. శ్రద్ధ నిలిపి పనులు చేయడం అవసరం. ఉద్యోగ ప్రయత్నాలలో తాత్కాలిక ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులు అందరితో స్నేహంగా ఉంటూ పనులు పూర్తి చేసుకోవడం మంచిది. వివాదాలకు దూరంగా ఉండి, ఓపికతో పనులు చేసుకోవడం అవసరం. అందరి సహకారం లభిస్తుంది. ప్రయాణాలవల్ల వృథా ఖర్చులు ఉంటాయి. అనవసరమైనవి వాయిదా వేసుకోవడం ఉత్తమం. రోజువారీ కార్యక్రమాలు నిరాటంకంగా కొనసాగుతాయి. పిల్లల చదువు అనుకూలిస్తుంది.
మిథునం
ఉద్యోగస్తులకు ఆఫీసులో అనుకూలత ఉంటుంది. తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది. పై అధికారుల ఆదరణ లభిస్తుంది. తలపెట్టిన పనులు నిరాటంకంగా పూర్తవుతాయి. గత ఆర్థిక ఇబ్బందులు యథావిధిగా ఉన్నా పనులు పూర్తయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇబ్బందులను అధిగమిస్తారు. పిల్లల వివాహాది శుభకార్య ప్రయత్నాలలో అందరి సహకారం లభిస్తుంది. శుభకార్యం చేసే అవకాశం వుంది. చదువులో రాణిస్తారు. ఉన్నత విద్యా ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా, లాభదాయకంగా, సంతృప్తితో ఉంటాయి. ఆదాయంలో స్థిరత్వం ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించే ఆలోచన చేస్తారు. కుటుంబపెద్దలతో చర్చించి, మంచి నిర్ణయాలు తీసుకుంటారు.
కర్కాటకం
వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ప్రయాణాలు కలిసివస్తాయి. రావలసిన డబ్బు కొంత అందుతుంది. సర్దుబాట్లు అవసరం కావచ్చు. ఉద్యోగస్తులకు ఆఫీసులో తోటివారితో అనుకూలత ఉంటుంది. పై అధికారులను మంచి చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఉద్యోగస్తులకు స్థానచలనం ఉండవచ్చు. గత న్యాయసమస్యలు తీరుతాయి. కోర్టు కేసులలో ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. రాజకీయ, ప్రభుత్వ పనులలో విజయం చేకూరుతుంది. స్నేహితులు, ఆత్మీయులతో స్నేహం, ఆప్యాయత పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తారు. కొంతవరకు సఫలీకృతులవుతారు.
సింహం
కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తులు, భూముల విషయంలో తగాదాలు పరిష్కారమవుతాయి. ఆస్తులవల్ల ఆదాయం పెరుగుతుంది. వాహనం, ప్లాట్లు కొనే అవకాశం వుంది. కొన్ని పనులను సాహసించి పట్టుదలతో పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఆర్థిక ఒప్పందాలు అనుకూలిస్తాయి. వ్యవసాయదారులకు అనుకున్న పనులు నెరవేరుతాయి. గతంలో ఇచ్చిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త పనులలో పెట్టుబడుల గురించి ఆలోచిస్తారు. ఆదాయం క్రమంగా పెరుగుతుంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. కొత్త అవకాశాలు వస్తాయి.
కన్య
ప్రారంభించిన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. అనుకున్న మేర లాభాలు లేకపోయినా సంతోషంతో కాలం గడుపుతారు. పిల్లల చదువు, ఉద్యోగ ప్రయత్నాలలో ఖర్చులు ఉండవచ్చు. పనులను ఉత్సాహంతో చేస్తారు. శుభకార్య ప్రయత్నాలలో అందరి సహకారం లభిస్తుంది. ప్రారంభించిన పనులను పూర్తి చేయడంలో పెద్దలతో చర్చిస్తారు. వ్యాపార లావాదేవీలు సంతృప్తికరంగానే ఉంటాయి. పెట్టుబడుల విషయంలో ఆలోచన అవసరం. రావలసిన డబ్బు చేతికి అందడంలో ఆలస్యం జరుగుతుంది. ఇంటా, బయటా వాతావరణం సంతృప్తికరంగానే ఉంటుంది. విందులకు హాజరవుతారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఖర్చులు ఉండవచ్చు. కార్యసాఫల్యం కూడా ఉండే అవకాశం వుంది.
తుల
పిల్లల చదువు, శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. ఆర్థిక ఇబ్బందులున్నా కొత్త పనులు ప్రారంభించే ఆలోచనలు చేస్తారు. నలుగురి సూచనలను పాటిస్తూ ముందుకు వెళతారు. పాత సమస్యలను అధిగమిస్తారు. అనుకూల ఫలితాలు ఉంటాయి. భక్తిభావనలు పెరుగుతాయి. గౌరవ మర్యాదలు పొందుతారు. తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. పనులలో కొంత అసంతృప్తి ఉండవచ్చు. మనసు నిలిపి పనులు చేయడం అవసరం. పారిశ్రామికవేత్తలకు సిబ్బందితో ఇబ్బందులు ఎదురైనా రాబడి సంతృప్తికరంగానే ఉంటుంది. రాజకీయ, ప్రభుత్వ పనులలో అనుకూలత ఉంటుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యం విషయమై శ్రద్ధ చూపుతారు.
వృశ్చికం
గతంలో ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. వ్యాపారం నిరాటంకంగా కొనసాగుతుంది. వ్యాపారస్తులు కొత్త పనుల కోసం ప్రయత్నిస్తారు. ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ప్రారంభించిన పనులలో ఆలస్యం ఉండవచ్చు. శుభకార్య ప్రయత్నాలు అందరి సహకారంతో ముందుకు సాగుతాయి. పిల్లల చదువు, ఉద్యోగాలు నిరాటంకంగా కొనసాగుతాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. అత్యుత్సాహం విడనాడి పనులపై శ్రద్ధ నిలపడం అవసరం. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. వృత్తిలో సంతృప్తి ఉంటుంది. వ్యాపారంలో అనుకున్న లాభాలు ఉండకపోయినా సంతృప్తితో ఉంటారు.
ధనుస్సు
గతంతో పోల్చినా ఈవారం కొంత అనుకూలంగానే ఉంటుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. గత సమస్యలు తొలగిపోతాయి. వ్యాపారంలో లాభం ఉంటుంది. కోర్టుకేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఇంటి వాతావరణం అనుకూలంగా ఉండటంతో భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. కావలసిన వస్తువులను కొనుగోలు చేయడంపై మనసు నిలుపుతారు. ఒకపక్క ఆర్థిక సమస్య వెంటాడటం వల్ల పనులలో జాప్యం ఉండవచ్చు. సర్దుబాట్లు అవసరం కావచ్చు. గురుభక్తి పెంపొందించుకుంటారు. సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. వ్యాపారస్తులకు, పారిశ్రామికవేత్తలకు, వ్యవసాయదారులకు అందరి సహకారం లభిస్తుంది.
మకరం
ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో లాభదాయకంగా పూర్తి చేస్తారు. సంతృప్తికరంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. అనవసరమైన ఖర్చులు ఉండవచ్చు. నియంత్రణ అవసరం. వివాహాది శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభకార్యాలు చేస్తారు. చదువు, ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. ఉన్నత విద్యా సమస్యలను అధిగమిస్తారు. భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటారు. ఇంటాబయటా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆరోగ్యంతో ఉంటారు. వృత్తి, వ్యాపారం సంతృప్తికరంగా ఉంటుంది. కోర్టుకేసులలో విజయం చేకూరుతుంది. బంధువులు, స్నేహితులతో పనులు నెరవేరుతాయి. రియల్ ఎస్టేట్, భూముల వ్యవహారం అనుకూలంగా ఉంటుంది.
కుంభం
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. తాత్కాలికంగా ఉద్యోగంలో చేరతారు. ఉత్సాహంతో ఆఫీసులో పనులు నిర్వర్తిస్తారు. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. రావలసిన డబ్బు సమయానికి అందకపోవడంతో కొంత అసంతృప్తి ఉంటుంది. సర్దుబాట్లు అవసరం కావచ్చు. వృథా ఖర్చులు కూడా గోచరిస్తున్నాయి. నియంత్రణ అవసరం. ఆరోగ్యంగా ఉంటారు. రాజకీయ, కోర్టు, ప్రభుత్వ పనులలో సత్ఫలితాలు ఉంటాయి. పెట్టిన పెట్టుబడులకు ప్రతిఫలాలను పొందుతారు. భార్యాపిల్లలతో సంతృప్తిగా ఉంటూ, బయటి పనులను ఉత్సాహంతో చేస్తారు. సంగీత, సాహిత్య, సినిమా రంగాలలోని వారికి మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం క్రమేపీ పెరుగుతుంది. వివాదాల్లోకి వెళ్లకుండా పనులపై మనసు నిలుపుతారు.
మీనం
ఆదాయం స్థిరంగా ఉంటుంది. క్రమేపీ పెరుగుతుంది. గతంలో ఇచ్చిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త పనుల ప్రారంభంపై మనసు నిలుపుతారు. వృత్తి, వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. కోర్టుకేసులలో విజయం ఉంటుంది. ఇంట్లో భార్యా పిల్లలతో సంతృప్తి ఉంటుంది. బయట వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. సంగీత, సాహిత్య కళాకారులకు ఆదాయం కలిసివస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పనులు నెరవేరుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపడం అవసరం. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలించి ఖర్చులు పెరుగవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. స్థలమార్పు ఉండవచ్చు.
గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్., ఫోన్: 040-27651530
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in