మేషం
వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా కొనసాగుతాయి. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగరీత్యా అనుకూల సమయం. నలుగురిలో మంచిపేరును సంపాదిస్తారు. విద్యార్థులు సంతృప్తికరంగా ఉంటారు. మంచిస్థాయిలో నిలుస్తారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. అధికారుల సహాయ సహకారాలతో చాలా పనులు నెరవేరుతాయి. శుభకార్యాలు చేస్తారు. బంధుమిత్రుల రాక సంతోషాన్నిస్తుంది. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. వ్యవసాయదారులకు కలిసి వస్తుంది. ఖర్చులు పెరిగినా స్నేహితుల మూలంగా పనులు నెరవేరుతాయి. గతంలో ఇచ్చిన సొమ్ము చేతికి అందుతుంది.
వృషభం
ఉద్యోగంలో సంతృప్తి పొందుతారు. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. గతంలో ఎదురైన సమస్యలను అధిగమిస్తారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ నిలుపుతారు. బంధువర్గంతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు ఉన్నా పనులు కలిసి వస్తాయి. నూతన పెట్టుబడులకు అనుకూల వారం. సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు. సాహిత్యవేత్తలకు ఆదాయం స్థిరంగా ఉంటుంది. క్రమేపీ పెరుగుతుంది. కొత్త అవకాశాలతో సంతోషాన్ని పొందుతారు. పూర్వంతో పోల్చితే పనులను శ్రద్ధతో పూర్తిచేస్తారు. వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు చేస్తారు. డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. వృథా ఖర్చులు ఉండవచ్చు. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి.
మిథునం
పనిలో బరువు, బాధ్యతలు పెరుగుతాయి. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం ఈ వారం అవసరం. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. ఉద్యోగస్తులకు తోటివారితో, పై అధికారులతో చిన్నపాటి మనస్పర్ధలు తలెత్తవచ్చు. అందరినీ కలుపుకొనే ప్రయత్నం చేయండి. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందడంతో కొన్ని పనులలో జాప్యం జరగవచ్చు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. ఉద్యోగ ప్రయత్నాలలో తాత్కాలిక ప్రయోజనాలు ఆశిస్తారు. వ్యవసాయదారులకు ఈ వారం అనుకూలిస్తుంది. భూ వ్యవహారాల్లో జాగ్రత్త పాటించడం అవసరం. పారిశ్రామికవేత్తలు న్యాయపరమైన సమస్యలు అధిగమిస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. సాహితీవేత్తలకు, కళాకారులకు కొత్త అవకాశాలు రావచ్చు.
కర్కాటకం
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యంతో ఉత్సాహంగా పనులు చేస్తారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. స్నేహితులు, ఆత్మీయుల మూలంగా పనులు నెరవేరుతాయి. వ్యాపారస్తులకు భాగస్వాములతో సంబంధాలు పెరుగుతాయి. అనవసరమైన ఖర్చులు నియంత్రించుకోవడం అవసరం. కుటుంబపెద్దల సహకారం లభిస్తుంది. నలుగురితో చర్చించి తీసుకునే నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. కళాకారులకు, రచయితలకు మంచి అవకాశాలు వస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు.
సింహం
రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆస్తి వ్యవహారాల్లో వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆత్మీయులు సహకరిస్తారు. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. సమాజంలో స్నేహ సంబంధాలు పెంపొందుతాయి. ఆధ్యాత్మిక ప్రవచనాలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఆర్థిక ఒప్పందాలు లాభదాయకంగా ఉంటాయి. పారిశ్రామిక వేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. తద్వారా ఉత్పాదన సంతృప్తికరంగా ఉంటుంది. కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో పనిభారం పెరుగుతుంది. సహోద్యోగుల సహకారంతో సకాలంలో పనులు పూర్తి చేస్తారు.
కన్య
కొత్త పనులపై మనసు నిలుపుతారు. కళాకారులకు అవకాశాలు వస్తాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. సాంస్కృతిక, దైవిక కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. భూములు, వాహనాల వ్యవహారాల్లో జాగ్రత్త అవసరం. రాజకీయ, ప్రభుత్వ పనులలో జాప్యం జరగవచ్చు. స్నేహితులు, బంధువులతో సత్సంబంధాలను కొనసాగిస్తారు. పెద్దల సలహాలు ఆచరణలో పెట్టి, సత్ఫలితాలు పొందుతారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. సమాజంలో మంచి పేరును పొందుతారు. ఆరోగ్యంగా ఉంటూ, ఉత్సాహంతో పనులు చేస్తారు. ఉద్యోగస్తులు అధికారుల ప్రశంసలను పొందుతారు. పనిభారం పెరిగినా సంతృప్తిగా పూర్తిచేస్తారు.
తుల
ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తిచేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు తాత్కాలికంగా ఊరటనిస్తాయి. ఆఫీసులో పనిభారంతో ఇబ్బందులు ఎదురుకావచ్చు. ప్రభుత్వ పనుల మూలంగా ఖర్చులు పెరుగుతాయి. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. నలుగురిలో గౌరవ మర్యాదలను పొందుతారు. సంతోషంతో పనులు పూర్తిచేస్తారు. స్నేహితులు, బంధువర్గంతో కార్య సాఫల్యం ఉంది. అయితే, వృథా ఖర్చుల నియంత్రణ అవసరం. వివాదాలకు దూరంగా ఉండండి. స్థిర, చరాస్తుల విషయంలో వివాదాలు కొనసాగుతాయి. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. సంగీత, సాహిత్య, కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. పారిశ్రామికవేత్తలకు నలుగురి సహకారం లభిస్తుంది.
వృశ్చికం
వ్యాపారస్తులకు అనుకూలం. గత పెట్టుబడులకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కొనసాగుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. స్థిర, చరాస్తుల విషయంలో తగాదాలు కొనసాగుతాయి. అయితే, కొన్ని పరిష్కారం కావచ్చు. ప్రారంభించిన పనులలో తాత్కాలిక ఆటంకాలు రావచ్చును. ఓపికతో పరిష్కరించుకోవడం మంచిది. ఉద్యోగస్తులు ఆఫీసులో సంతృప్తిగా ఉంటారు. అధికారుల అండదండలు లభిస్తాయి. ఉద్యోగ, శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కోర్టు, ప్రభుత్వ, రాజకీయ పనులలో విజయం చేకూరుతుంది. వ్యవసాయదారులకు బాగా
కలిసివస్తుంది. బంధువర్గంతో పనులు నెరవేరుతాయి.
ధనుస్సు
సాహితీవేత్తలకు, కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త అవకాశాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. ప్రయాణాల మూలంగా పనులు నెరవేరుతాయి. అలసట లేకుండా ఏకాగ్రతతో పనులు నిర్వర్తిస్తారు. కోర్టు పనులు అనుకూలంగా ఉంటాయి.స్నేహితులు, బంధువర్గంతో పనులు నెరవేరినా చిన్నపాటి అభిప్రాయ విభేదాలు తలెత్తవచ్చు. అనవసర చర్చలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులు సంతృప్తిగా ఉంటారు. అధికారుల ఆదరణతో కొన్ని పనులు నెరవేరుతాయి. భూములు, వాహనాల కొనుగోలు యత్నాలు వాయిదా పడవచ్చు. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు కలిసివస్తుంది. ఆరోగ్యంగా ఉంటూ, ఉత్సాహంతో పనులు చేస్తారు. ఖర్చుల నియంత్రణ, తోటివారితో స్నేహంగా ఉండటం ఈ వారం అవసరం.
మకరం
తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. అదేసమయంలో ఖర్చులూ పెరుగుతాయి. నియంత్రణ అవసరము. వివాహాది శుభకార్య యత్నాలు ఫలిస్తాయి. సమాజంలో మంచిస్థాయిలో ఉన్నవారి సహకారం లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. పనుల్లో బాధ్యతలు పెరుగుతాయి. సంయమనంతో వాటిని నిర్వర్తిస్తారు. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం. రాజకీయ, ప్రభుత్వ కార్యకలాపాలలో ఖర్చులు ఎక్కువ కావచ్చు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా పనులపై మనసు నిలిపి పట్టుదలతో పూర్తిచేసే ప్రయత్నం చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. కోర్టు పనులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి.
కుంభం
ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. ధార్మిక కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. గురుభక్తికి ప్రాధాన్యం ఇస్తారు. మంచివారి సాహచర్యం లభిస్తుంది. సంగీత, సాహిత్య కళాకారులకు అనుకూల వారం. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. రావలసిన డబ్బు ఆలస్యంగా అందుతుంది. ఈ వారం కొత్త పనులు ప్రారంభించకుండా, చేతిలో ఉన్నవి పూర్తిచేయడం మంచిది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. భూములు, వాహనాల లావాదేవీల్లో ఏమరపాటు తగదు. ఉద్యోగస్తులు తోటివారితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. అధికారుల ఆదరణ లభిస్తుంది. అనవసరమైన ప్రయాణాలను వాయిదా వేసుకుంటారు. తీర్థయాత్రలు, విహార యాత్రలపై మనసు నిలుపుతారు.
మీనం
ఏకాగ్రతతో, పట్టుదలతో పనులు పూర్తిచేస్తారు. శుభకార్యాల మూలంగా ఖర్చులు పెరుగుతాయి. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. నలుగురికి ఉపయోగపడే పనులను చేస్తారు. ఉత్సాహంతో ఉంటారు. ఉద్యోగస్తులకు తోటివారి సహకారం లభిస్తుంది. ఆఫీసులో మంచిపేరు సంపాదిస్తారు. భూముల వ్యవహారం అనుకూలిస్తుంది. నూతన వాహనం కొనుగోలు చేయవచ్చు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. ప్రభుత్వ, రాజకీయ పనులు కలిసివస్తాయి. కుటుంబంతో సంతృప్తిగా కాలం గడుపుతారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక సమస్యలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. వ్యాపార ఒప్పందాలు ప్రయోజనకరంగా ఉంటాయి.
గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్., సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in