మేషం
తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటూ, క్రమేపీ పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. వాహనాలు, భూముల కొనుగోలు విషయాల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగులకు స్థానచలన సూచన. పదోన్నతి లభించవచ్చు. చేసే పనిలో సంతృప్తి పొందుతారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. పారిశ్రామికవేత్తలు న్యాయపరమైన చిక్కులను అధిగమిస్తారు. పరిశ్రమలో ఉత్పత్తి పెరుగుతుంది.
వృషభం
పనుల్లో బరువు, బాధ్యతలు పెరుగుతాయి. శ్రమ అధికం అవుతుంది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. తోటివారికి సాయం చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగులకు పై అధికారులతో స్నేహం కుదురుతుంది. తోబుట్టువులతో అవగాహన పెరుగుతుంది. కోర్టు వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు రావచ్చు. అనుకోని ఖర్చులు ముందుకురావడం వల్ల ఆర్థికంగా చికాకులు ఏర్పడవచ్చు. వ్యవసాయదారులకు అనుకూల వారం. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. సంగీత, సాహిత్య రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. నూతన దుస్తులు, ఇంట్లోకి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.
మిథునం
అనవసరమైన విషయాల జోలికి వెళ్లకుండా చేయాల్సిన పనులపై దృష్టి నిలపడం మంచిది. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. స్నేహితులు, బంధువుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం మంచిది. కోర్టు పనులు వాయిదా పడతాయి. పాత బాకీలు కొంత వరకు వసూలు అవుతాయి. ఆదాయంలో హెచ్చు తగ్గుల మూలంగా పనులలో జాప్యం జరగవచ్చు. ఇంట్లో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విహార యాత్రలు, తీర్థ యాత్రలు చేయాలనుకుంటారు. వ్యాపారవేత్తలకు భాగస్వాములతో సంబంధాలు పెరుగుతాయి. అయితే, కొత్త పనులు ప్రారంభించడానికి అంత అనుకూలమైన వారం కాదు. వివాదాలకు దూరంగా ఉంటూ, పట్టుదలతో పనిచేయండి. వ్యవసాయదారులకు అనుకూలం.
కర్కాటకం
కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. అధికారుల ఆదరణ పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతి, స్థాన చలన సూచన. సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. బంధువర్గంతో సత్సంబంధాలు కొనసాగుతాయి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. న్యాయపరమైన సమస్యలను అధిగమిస్తారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. మంచి పనులు చేస్తారు. కుటుంబసభ్యులతో సంతృప్తిగా ఉంటారు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి.
సింహం
పాతబాకీలు వసూలు అవుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇంటా బయటా సంతోషంగా ఉంటారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. కళాకారులకు ఆదాయం స్థిరంగా ఉంటూ, క్రమేపీ పెరుగుతుంది. తలపెట్టిన పనులు ఆలస్యమైనా విజయవంతంగా పూర్తవుతాయి. రాజకీయ, కోర్టు, ప్రభుత్వ పనులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. కుటుంబసభ్యులతో చిన్నపాటి మనస్పర్ధలు ఏర్పడవచ్చు. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఆర్థిక స్థితి, వాతావరణం అనుకూలంగా ఉంది. శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. నలుగురిలో మంచి పేరును సంపాదిస్తారు.
కన్య
వృత్తి, వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ప్రయాణాలు కలిసి వస్తాయి. బంధువర్గంతో, స్నేహితులతో చిన్నపాటి మనస్పర్ధ్ధలు తలెత్తవచ్చు. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నతాధికారుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఇంట్లో ప్రశాంత వాతావరణం ఉంటుంది. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. భూముల వల్ల ఆదాయం పెరుగుతుంది. వ్యవసాయదారులకు కలిసి వస్తుంది.
తుల
ఇంట్లో వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. ఆదాయం మెరుగ్గా ఉన్నా.. ఖర్చుల నియంత్రణ అవసరం. శుభకార్య ప్రయత్నాల్లో నలుగురి సహకారం లభిస్తుంది. ప్రారంభించిన పనుల్లో అవాంతరాలు ఎదురైనా పట్టుదలతో పూర్తిచేస్తారు. ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. నలుగురిలో మంచిపేరును పొందుతారు. ఉద్యోగులకు తోటివారి సహకారం లభిస్తుంది. అయితే, ఉన్నతాధికారుల విమర్శలు ఎదుర్కోవాల్సి రావచ్చు. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపారులకు భాగస్వాములతో చిన్నపాటి మనస్పర్ధ్ధలు రావచ్చును. బంధువులు, సోదరులతో పనులు పూర్తయినా.. ఖర్చులు పెరగవచ్చు. వ్యవసాయదారులకు వాతావరణం కలిసి వస్తుంది. పారిశ్రామికవేత్తలకు వ్యాపారం సంతృప్తికరంగా ఉంటుంది.
వృశ్చికం
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. తాత్కాలికంగా కొత్త ఉద్యోగంలో చేరవచ్చు. ఆఫీసులో అందరి సహకారం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆత్మీయుల మధ్య సఖ్యత పెరుగుతుంది. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలం. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. న్యాయ పరమైన సమస్యలను అధిగమిస్తారు. రాజకీయ, ప్రభుత్వ పనులు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. కళాకారులకు, సాహితీవేత్తలకు కొత్త అవకాశాలు వస్తాయి. దూర ప్రయాణాలు చేయవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ధనుస్సు
ప్రయాణాల మూలంగా పనులు నెరవేరుతాయి. ఏకాగ్రతతో బాధ్యతలు నిర్వర్తిస్తారు. కోర్టు వ్యాజ్యాలు అనుకూలంగా ఉంటాయి. స్నేహితులు, బంధువర్గంతో పనులు నెరవేరుతాయి. అనవసర చర్చలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగస్థులు సంతృప్తిగా ఉంటారు. అధికారుల ఆదరణతో కొన్ని పనులు నెరవేరుతాయి. సాహితీవేత్తలకు, కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. కొత్త అవకాశాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. భూములు, వాహనాల కొనుగోలు యత్నాలు వాయిదా పడవచ్చు. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు అన్నివిధాలా కలిసివస్తుంది. ఆరోగ్యంగా ఉంటూ, ఉత్సాహంతో పనులు చేస్తారు. ఖర్చుల నియంత్రణ, తోటివారితో స్నేహంగా ఉండటం ఈ వారం అవసరం.
మకరం
తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. రాబడి, ఖర్చులు సమానంగా ఉండవచ్చు. వాహనాల వల్ల పనులు నెరవేరుతాయి. రావలసిన డబ్బు అందక పోవడంతో కొన్ని పనులు వాయిదా పడతాయి. వివాహాది శుభకార్య యత్నాలు ఫలిస్తాయి. సమాజంలో మంచిస్థాయిలో ఉన్నవారి సహకారం లభిస్తుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. పనుల్లో బాధ్యతలు పెరుగుతాయి. వ్యవసాయదారులకు అనుకూల వాతావరణం. రాజకీయ, ప్రభుత్వ కార్యకలాపాలలో ఖర్చులు ఎక్కువ కావచ్చు. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా పనులపై మనసు నిలిపి పట్టుదలతో పూర్తిచేసే ప్రయత్నం చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది.
కుంభం
ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. ధార్మిక కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. మంచివారి సాహచర్యం లభిస్తుంది. సంగీత, సాహిత్య కళాకారులకు అనుకూల వారం. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. రావలసిన డబ్బు ఆలస్యంగా అందుతుంది. ఈ వారం కొత్త పనులు ప్రారంభించకుండా, చేతిలో ఉన్నవి పూర్తిచేయడం మంచిది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. భూములు, వాహనాల లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. ఉద్యోగులు తోటివారితో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. అధికారుల ఆదరణ లభిస్తుంది. అనవసరమైన ప్రయాణాలను వాయిదా వేసుకుంటారు. తీర్థ యాత్రలు, విహార యాత్రలపై మనసు నిలుపుతారు.
మీనం
ఏకాగ్రతతో, పట్టుదలతో పనులు పూర్తిచేస్తారు. శుభకార్యాల మూలంగా ఖర్చులు పెరుగుతాయి. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. నలుగురికి ఉపయోగపడే పనులను చేస్తారు. వ్యాపారులకు రావలసిన డబ్బు అందుతుంది. నిర్మాణ కార్యక్రమాలు చేపడతారు. ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. రోజువారీ కార్యక్రమాలు సంతృప్తిగా ఉంటాయి. కోర్టు కేసులలో విజయం చేకూరుతుంది. ఉద్యోగులకు కార్య
స్థలంలో అనుకూల వాతావరణం ఉంటుంది. తోటి ఉద్యోగుల సహకారం లభిస్తుంది. బంధుమిత్రులతో స్నేహంగా ఉంటారు. వాహనం ద్వారా పనులు నెరవేరుతాయి.
గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్., సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in