e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, September 22, 2021
Home రాశి ఫలాలు రాశి ఫలాలు

రాశి ఫలాలు

1.8.2021 నుంచి 7.8.2021 వరకు

మేషం
వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. అనుకున్న సమయంలో పనులు పూర్తవుతాయి. బరువు, బాధ్యతలున్నా మెరుగైన ఫలితాలుంటాయి. రోజువారీ కార్యకలాపాలు, వ్యాపారం లాభదాయకంగా ఉంటాయి. వ్యాపారస్తులకు సిబ్బందితో సత్సంబంధాలు ఉంటాయి. గతంలో ఇచ్చిన డబ్బు చేతికి అందుతుంది. క్రమేపీ ఆదాయం పెరుగుతుంది. అనవసర ఖర్చులు ముందుకు రావచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలమైన వారం. నలుగురిలో పేరుప్రతిష్ఠలు పెంపొందుతాయి. ఇంటా, బయటా వాతావరణం సంతృప్తికరంగా ఉంటుంది. పిల్లలతో సంతోషంగా గడుపుతారు. కుటుంబ పెద్దల తోడ్పాటు లభిస్తుంది.

- Advertisement -

వృషభం
స్నేహ సంబంధాలు పెరుగుతాయి. మిత్రుల రాకతో కొన్ని ఖర్చులున్నా, పనులు చాలామటుకు పూర్తవుతాయి. అనుకూల వాతావరణంలో సంతృప్తిగా ఉంటారు. పనులు సంయమనంతో పూర్తి చేస్తారు. అనవసర ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వకుండా పనులపై మనసు నిలుపుతారు. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంగా పనులు నిర్వహిస్తారు. వ్యాపారస్తులకు లాభదాయకమైన వారం. ఆర్థిక ఒత్తిడులు ఉండవచ్చు. నిర్ణయాలు, ఖర్చులు జాగ్రత్తగా చేయాలి. రాబడి స్థిరంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి. బాధ్యతలు పెరుగడంతో కొన్ని విషయాలలో ఆలస్యం జరుగవచ్చు. ఉద్యోగస్తులు సహోద్యోగులతో కలిసిమెలిసి పనులు పూర్తి చేసుకుంటారు.

మిథునం
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. మంచివారితో స్నేహ సంబంధాలు పెరుగుతాయి. చిన్ననాటి స్నేహితుల సహకారం లభిస్తుంది. బంధువులతో ఆప్యాయంగా ఉంటారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో సత్సంబంధాలు ఉంటాయి. అనుకూలంగా పనులు పూర్తవుతాయి. ఉత్సాహంగా ఉంటారు. కొన్ని పనులలో ఆటంకాలు, శ్రమ ఉండవచ్చు. ప్రయత్నాలు ఫలించి శుభకార్యాలు చేస్తారు. గతంలో ఇచ్చిన డబ్బు చేతికి అందడంలో జాప్యం జరుగవచ్చు. ముఖ్యమైన పనుల కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. ఖర్చుల నియంత్రణ చాలా అవసరం. వ్యాపారం సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తిలో అందరి సహకారం లభిస్తుంది. బరువు, బాధ్యతలు పెరుగుతాయి.

కర్కాటకం
ప్రణాళికతో పనులు చేస్తారు. సత్ఫలితాలు పొందుతారు. తలపెట్టిన ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపుతారు. ఉత్సాహంగా పనులు చేస్తారు. మనసు నిలిపి పనులు చేయడంతో సత్ఫలితాలు పొందుతారు. సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకొంటూ, ఆలోచనలను ఆచరణలో పెడతారు. వృత్తి, వ్యాపారాలలో సిబ్బందివల్ల ఇబ్బందులు ఎదురుకావచ్చు. ఖర్చులు పెరుగుతాయి. పనులలో బాధ్యతలు కొంత అసహనానికి గురి చేయవచ్చు. ఉద్యోగస్తులు ఆఫీసులో తోటివారితో, అధికారులతో స్నేహ సంబంధాలను పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తారు.

సింహం

సంగీత, సాహిత్య కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. సంతృప్తిగా ఉంటారు. కుటుంబపెద్దల సహకారం లభిస్తుంది. పిల్లలతో సంతోషంగా ఉంటారు. ఆదాయం గతంలోకంటే పెరుగుతుంది. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. కొత్త పనులపై మనసు నిలుపుతారు. బంధువర్గం, స్నేహితుల కారణంగా ఖర్చులు పెరుగుతాయి. తగాదాలు పరిష్కారమవుతాయి. స్థిర, చరాస్తులవల్ల రావలసిన డబ్బు చేతికి అందుతుంది. నిత్య వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. వృత్తి, వ్యాపారాలలో సిబ్బందితో ఇబ్బందులు ఉండవచ్చు. వ్యాపార విస్తరణ చేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.

కన్య
ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతృప్తిగా ఉంటారు. తోటి సిబ్బంది సహకారంతో పనులు పూర్తి చేస్తారు. ఉత్సాహంగా ఉంటారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు బాగా కలిసివస్తుంది. పెద్ద చదువులకు సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ, ప్రభుత్వ పనులలో ఫలితాలు సంతృప్తిగా ఉంటాయి. బంధువర్గం, స్నేహితులతో ఖర్చులు పెరుగుతాయి. అయినా, వారివల్లే పనులు నెరవేరుతాయి. తగాదాలలోకి వెళ్లకుండా మనసు నిలిపి పనులు చేయడం అవసరం. ఇంటా బయటా సంతోషంగా ఉంటారు. కుటుంబంలో జీవిత భాగస్వామితో, పిల్లలతో సంతృప్తిగా ఉంటూ, కుటుంబపెద్దల సూచనల మేరకు పనులు నిర్వర్తిస్తారు.

తుల
చిన్ననాటి మిత్రులు, బంధువుల రాకతో సంతృప్తిగా ఉంటారు. పనులు పూర్తవుతాయి. తలపెట్టిన కార్యాలలో బరువు, బాధ్యతలు ఉండవచ్చు. స్థిర, చరాస్తుల వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆస్తుల పరంగా ఆదాయం పెరుగుతుంది. ఇంటి వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మంచివారి సాహచర్యం పెంపొందుతుంది. పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. వాహనాలవల్ల పనులు కలిసివస్తాయి. ఆత్మీయులతో సత్సంబంధాలు ఉంటాయి. విద్యార్థులు చదువులలో రాణిస్తారు. ఉన్నత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి. సత్ఫలితాలు పొందుతారు. ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. గతంలో ఇచ్చిన డబ్బు, కొంత ఆలస్యమైనా చేతికి అందుతుంది. ఉద్యోగస్తులకు అధికారుల సహకారం, సహోద్యోగుల ఆదరణ లభిస్తాయి.

వృశ్చికం
ఆదాయం స్థిరంగా ఉంటుంది. వృత్తి సమస్యలను అధిగమిస్తారు. తగిన ప్రతిఫలాలు పొందుతారు. వృత్తిలో తోటివారితో స్నేహాన్ని పెంపొందించుకొంటారు. భక్తి ప్రపత్తులు పెరుగుతాయి. స్థిర, చరాస్తులవల్ల రావలసిన సొమ్ము చేతికి అందుతుంది. కోర్టు, ప్రభుత్వ, రాజకీయ పనులు అనుకూలిస్తాయి. ఆస్తుల పంపకంలో వివాదాలు తలెత్తవచ్చు. సంయమనంతో పరిష్కరించుకోవడం మంచిది. నలుగురిలో గౌరవ మర్యాదలు పొందుతారు. సమాజంలో మంచిస్థాయిలో ఉన్నవారితో పరిచయాలు ఏర్పడతాయి. నలుగురి ఆదరణ పొందుతారు. కుటుంబంలో అందరి సహకారం లభిస్తుంది. పిల్లలతో హాయిగా గడుపుతారు. తలపెట్టిన పనులలో ఆలస్యం ఉండవచ్చు.

ధనుస్సు
శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో అందరి సహకారం లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులవల్ల లక్ష్యాలు పూర్తి కావడంలో కొంత జాప్యం జరుగవచ్చు. ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. అనవసర ఖర్చులతో ఇబ్బందులు ఎదురవుతాయి. ఖర్చుల విషయంలో నియంత్రణ అవసరం. పనులపై మనసు నిలుపాలి. ఆదాయం స్థిరంగా ఉన్నా రావలసిన డబ్బు రాకపోవడం, వృథా ఖర్చుల కారణంగా.. ముఖ్యమైన పనులలో ఆలస్యం జరుగవచ్చు లేదా పనులు వాయిదా పడవచ్చు. ప్రయాణాలు కలిసివస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఆనందంతో పనులు పూర్తి చేస్తారు. అనవసర ఆలోచనలను పక్కన పెట్టి, చేతిలో ఉన్న పనులపై మనసు నిలుపుతారు.

మకరం
స్నేహితులు, బంధువర్గంతో పనులు నెరవేరుతాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉత్సాహంగా ఉంటారు. రావలసిన డబ్బు చేతికి అందడంలో కొంత ఆలస్యం జరుగవచ్చు. అనవసర ఖర్చులవల్ల పనులలో కొంత జాప్యం జరిగే అవకాశం ఉంది. అయినా పనులు సంతృప్తిగానే పూర్తవుతాయి. నిత్యవ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. వృత్తిలో సంతృప్తి ఉంటుంది. ఊహించని ఖర్చులు ముందుకు రావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఖర్చుల నియంత్రణకు ప్రాధాన్యం ఇవ్వవలసిన అవసరం ఉంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాలు చేస్తారు. పెద్దలపట్ల భక్తితో ఉంటారు. ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగులతో స్నేహం పెరుగుతుంది. అధికారుల ఆదరణ లభిస్తుంది.

కుంభం
సంగీత, సాహిత్య, సినిమా రంగాలలోని వారికి కొత్త అవకాశాలు వస్తాయి. కొంత ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. సంతృప్తిగా జీవనం సాగిస్తారు. పెద్దలపట్ల భక్తితో ఉంటూ పనులు పూర్తి చేసుకుంటారు. తలపెట్టిన పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. గతంలో ఇచ్చిన డబ్బు చేతికి అందడంలో ఆలస్యం జరుగుతుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఆటంకాలు ఎదురుకావచ్చు. కొన్ని పనులలో జాప్యం జరుగవచ్చు. విద్యార్థులు చదువులలో సత్ఫలితాలు సాధిస్తారు. పై చదువుల ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురిలో గౌరవ మర్యాదలు పొందుతారు. తలపెట్టిన పనులను పూర్తి చేయడంపై మనసు నిలుపుతారు. అనవసర ఆలోచనలను పక్కనపెట్టి కార్యనిర్వహణపై మనసు నిలుపుతారు.

మీనం
స్థిర, చరాస్తులవల్ల ఆదాయం పెరుగుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కొత్త పనుల ప్రారంభానికి మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలలో బరువు, బాధ్యతలు పెరిగినా ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి. మానసిక ఆనందాన్ని పొందుతారు. గత పెట్టుబడులలో ఫలితాలు సానుకూలంగా ఉండి ఆదాయం పెరుగుతుంది. వృత్తిలో సిబ్బంది సహకారం లభిస్తుంది. సంతృప్తిగా ఉంటారు. వ్యాపారస్తులకు భాగస్వాముల సహకారం లభిస్తుంది. సమాజంలో మంచివారితో స్నేహ సంబంధాలు పెరుగుతాయి. పనులు నిరాటంకంగా పూర్తవుతాయి.

గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్‌., సెల్‌: 9885096295
ఈ మెయిల్‌ : nirmalsiddhanthi@yahoo.co.in

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana