e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 25, 2021
Home బతుకమ్మ రాశి ఫలాలు 25.7.2021 నుంచి 31.7.2021 వరకు

రాశి ఫలాలు 25.7.2021 నుంచి 31.7.2021 వరకు

మేషం
ప్రారంభించిన పనులను సంతృప్తిగా అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో లాభం ఉంటుంది. కొంత బరువు, బాధ్యతలు పెరుగవచ్చు. వ్యాపారం కలిసివస్తుంది. సిబ్బంది అనుకూలతవల్ల పనులు లాభదాయకంగా పూర్తవుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం పెరుగుతుంది. ఖర్చులపై మనసు నిలిపి, నియంత్రించుకోవడం అవసరం. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఇంట్లో పిల్లలతో హాయిగా గడుపుతారు. పెద్దల సహకారం లభిస్తుంది. పనులను బాగా ఆలోచించి చేస్తారు. నిర్ణయాలను సరైన సమయంలో ఆచరణలో పెడతారు. బంధువులు, స్నేహితులవల్ల ఖర్చులు పెరిగినా పనులు కలిసివస్తాయి.

వృషభం
పెద్దల సలహాలను పాటించి, సత్ఫలితాలు పొందుతారు. ఇంటా, బయటా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. సహనంతో పనులపై మనసు నిలిపి, పూర్తి చేసుకుంటారు. ఉత్సాహంతో ఉంటారు. ఆరోగ్యం విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటారు. సంతృప్తికరంగా ఉంటారు. నిత్య పనులు, వ్యాపారం సాఫీగా కొనసాగుతాయి. ఆర్థిక ఇబ్బందులనుండి బయటపడతారు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. వృత్తిపరంగా కలిసి వస్తుంది. బరువు, బాధ్యతలు పెరుగవచ్చు. ఆఫీసులో తోటి ఉద్యోగులతో సంతృప్తిగా ఉంటారు. పెద్ద మొత్తం పెట్టుబడులను కొన్ని రోజులు వాయిదా వేసుకొంటారు. అధికారులతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. అన్నివిధాలుగా మేలు కలుగుతుంది.

- Advertisement -

మిథునం
తలపెట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. సమాజంలో మంచివారి సాహచర్యం లభిస్తుంది. బంధుమిత్రుల సహకారంతో చాలా పనులు పూర్తి చేయగలుగుతారు. ఆఫీసులో అధికారులతో స్నేహ సంబంధాలు పెరుగుతాయి. ఆదరణ లభిస్తుంది. తోటివారితో చిన్నపాటి మనస్పర్ధలున్నా పనులు పూర్తవుతాయి. ప్రయత్నాలు ఫలించి శుభకార్యాలు చేస్తారు. రావలసిన డబ్బు ఆలస్యంగా అందడం, ఆటంకాలు ఎదురు కావడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురు కావచ్చు. వృత్తి, వ్యాపారాలలో ఫలితాలు సంతృప్తికరంగానే ఉంటాయి. బరువు, బాధ్యతలవల్ల వృథా ఖర్చులు ఉండవచ్చు. ఉత్సాహంగా పనులు ప్రారంభిస్తారు. తృప్తికరమైన ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు అధికారుల సహకారం బాగా లభిస్తుంది.

కర్కాటకం
ఆలోచించి పనులు చేస్తారు. ప్రయాణాలవల్ల పనులు కలిసివస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులపై మనసు నిలుపుతారు. మంచి ఆలోచనలను సమయానుకూలంగా ఆచరణలో పెట్టి, సత్ఫలితాలు పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో ఖర్చులు, బాధ్యతలు పెరుగుతాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో తోటివారితో, ఉన్నతాధికారులతో వచ్చే అభిప్రాయ భేదాలు, కాలయాపనకు దారితీస్తాయి. నిర్ణయాలు సరైన సమయంలో అమలు చేయడం అవసరం. బంధువర్గంతో ఖర్చులు ఉంటాయి. అనవసరమైన పనులలో తలదూర్చకుండా తమ పనులు తాము చేసుకుంటూ వెళ్లడం అవసరం.

సింహం
ఇంటి వాతావరణం సంతృప్తిగా ఉంటుంది. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. సంతోషంగా ఉంటారు. పిల్లలతో సరదాగా గడుపుతారు. ఆదాయం క్రమేపీ పెరుగుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త పనులను ప్రారంభించే ఆలోచన చేస్తారు. స్నేహితులు, బంధువులవల్ల ఖర్చులు ఉంటాయి. వివాదాలు పరిష్కారమవుతాయి. ఆస్తులవల్ల ఆదాయం పెరుగుతుంది. వ్యాపారం లాభసాటిగానే కొనసాగుతుంది. సిబ్బందితో తిప్పలు తప్పవు. వ్యాపార విస్తరణకు ప్రయత్నిస్తారు. భాగస్వాములతో అవగాహన పెరుగుతుంది. అలసట లేకుండా, పనులను శ్రద్ధతో పూర్తి చేస్తారు. ప్రయాణాలు కలిసివస్తాయి.

కన్య
ఉద్యోగస్తులు ఆఫీసులో సంతృప్తిగా ఉంటారు. తోటివారి సహకారం లభిస్తుంది. పనులను సంతోషంగా పూర్తి చేస్తారు. కోర్టు కేసులలో సానుకూల ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు చదువులపై మనసు నిలుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. రాజకీయ, ప్రభుత్వ వ్యవహారాల్లో ఫలితాలు ఊహించిన దానికంటే రెట్టింపు సంతృప్తినిస్తాయి. స్నేహితులు, ఆత్మీయులు కలువడంతో ఖర్చులు పెరుగుతాయి. బంధువుల సలహాల మేరకు పనులు పూర్తి చేస్తారు. ముఖ్యంగా వివాదాలలోకి వెళ్లకుండా, పనులపై శ్రద్ధ ఉంచడం అవసరం. పిల్లలతో సంతృప్తిగా ఉంటారు. కుటుంబపెద్దల సలహాలను పాటిస్తారు. ఆత్మీయుల కోసం సమయాన్ని కేటాయిస్తారు.

తుల
బంధువర్గంతో పనులు నెరవేరుతాయి. భూముల వివాదాలు పరిష్కారమవుతాయి. ఆదాయం పెరుగవచ్చు. ఇంటాబయటా సంతృప్తికరంగా ఉంటుంది. పిల్లలతో హాయిగా గడుపుతారు. వాహనాలవల్ల పనులు నెరవేరుతాయి. విద్యార్థులకు అనుకూలం. బాగా కలిసివస్తుంది. ఉన్నత విద్యకోసం శ్రమించి, అనుకూల ఫలితాలు పొందుతారు. ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు. రావలసిన డబ్బు కొంత చేతికి అందుతుంది. ఆఫీసులో ఉద్యోగస్తులు, పై అధికారులతో, తోటివారితో స్నేహపూర్వకంగా ఉంటారు. అధికారుల ఆదరణ బాగా లభిస్తుంది. మంచివారితో స్నేహ సంబంధాలు పెరుగుతాయి. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. సంగీత, సాహిత్య, సినిమా
కళాకారులకు అనుకూలం.

వృశ్చికం

రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. కొన్ని విషయాలలో జాప్యం వల్ల అసంతృప్తి ఉండవచ్చు. భక్తి భావనలు పెరుగుతాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. రాజకీయ, కోర్టు వ్యవహారాలలో పనులు సానుకూలంగా పూర్తవుతాయి. స్థిర, చరాస్తుల విషయాలలో కొంత వివాదాలు ఉండవచ్చు. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. మంచివారి సాహచర్యం లభిస్తుంది. కుటుంబంలో పెద్దల సహకారాన్ని పొందుతారు. పిల్లలతో సంతృప్తిగా గడుపుతారు. ఆర్థికంగా అనుకూలత ఉన్నా పనులలో కారణాంతరాలవల్ల జాప్యం ఉండవచ్చు. కొత్త పనుల ప్రారంభాన్ని కొన్ని రోజులకోసం వాయిదా వేసుకొంటారు.

ధనుస్సు
ప్రారంభించిన పనులను పట్టుదలతో శ్రమించి పూర్తి చేస్తారు. బరువు, బాధ్యతలు పెరగడంతో వృత్తి, వ్యాపారాలలో కొంత జాప్యం జరుగవచ్చు. బంధువర్గం, స్నేహితులతో పనులు నెరవేరుతాయి. ఆర్థిక సమస్యలు ఎదురుకావచ్చు. చేతిలో డబ్బు లేకపోవడంతో ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ప్రయాణాలు కలిసివచ్చి కొన్ని పనులు నెరవేరుతాయి. అనారోగ్య సమస్యలు తీరి, మానసికంగా ఉత్సాహంతో ఉంటారు. వృథా ఖర్చులవల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. అనవసరమైన ఆలోచనలను పక్కన పెట్టి, పనులపై మనసు నిలపడం అవసరం. వాహనాలవల్ల పనులు కలిసివస్తాయి. ఖర్చులుకూడా పెరుగవచ్చు. స్నేహితులు, బంధువులతో వివాదాలున్నా పనుల విషయంలో సహకారం లభిస్తుంది.

మకరం
మంచివారి సాహచర్యం లభిస్తుంది. ప్రారంభించిన పనులు అనుకూలంగా పూర్తవుతాయి. హుషారుగా ఉంటారు. పనులను సంతృప్తిగా పూర్తి చేస్తారు. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. అనవసరమైన ఖర్చులు ఉండవచ్చు. స్థిర, చరాస్తులవల్ల ఆదాయం పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా కొనసాగుతాయి. ఊహించని ఖర్చులవల్ల కొన్ని పనులలో జాప్యం ఉండవచ్చు. ప్రయత్నాలు ఫలించి శుభకార్యాలు చేస్తారు. పెద్దల విషయంలో గౌరవంతో ఉంటారు. ఆఫీసులో ఉద్యోగస్తులు, పై అధికారులతో పూజ్య భావంతో ఉంటూ, పనులు పూర్తి చేసుకొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. ఇంటాబయటా వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

కుంభం
ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. పెద్దల విషయంలో భక్తితో ఉంటారు. పూజ్యభావం ప్రదర్శించి పనులు నెరవేర్చుకుంటారు. వాటిని అనుకున్న సమయంలో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. కొన్ని పనులలో జాప్యం ఉంటుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. ఉన్నత విద్య ప్రయత్నాలలో కొంతవరకు సఫలీకృతులవుతారు. నలుగురిలో మంచిపేరు పొందుతారు. పనులను పూర్తి చేయడంపై మనసు నిలుపుతారు. ఉద్యోగస్తులకు ఆఫీసులో తోటి ఉద్యోగుల సహకారం బాగా లభిస్తుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఖర్చుల నియంత్రణ అవసరం. స్నేహితులు, బంధువర్గంతో బాంధవ్యాలు పెంపొందుతాయి. వాహనాలవల్ల ఖర్చులు పెరుగవచ్చు.

మీనం
గతంలో ఇచ్చిన డబ్బు చేతికి అందుతుంది. ఆర్థిక పరిస్థితి అన్ని విధాలుగా అనుకూలిస్తుంది. కొత్త పనులు ప్రారంభించడంలో సఫలీకృతులవుతారు. చేపట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తి చేస్తారు. బరువు, బాధ్యతలు పెరిగినా ఫలితాలు సానుకూలంగా ఉంటాయి. వృత్తి, ఉద్యోగం సంతృప్తిగా కొనసాగుతుంది. వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెంపొందుతుంది. మంచివారి సాహచర్యం లభిస్తుంది. నలుగురిలో మంచిపేరు సంపాదిస్తారు. పనులు నిరాటంకంగా పూర్తవుతాయి. స్థిర, చరాస్తుల తగాదాలు పరిష్కారమవుతాయి. ఆస్తులవల్ల ఆదాయం పెరుగుతుంది.

గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్‌., సెల్‌: 9885096295
ఈ మెయిల్‌ : nirmalsiddhanthi@yahoo.co.in

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana