e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 28, 2021
Home బతుకమ్మ రాశి ఫలాలు: 12.9.2021 నుంచి 18.9.2021 వరకు

రాశి ఫలాలు: 12.9.2021 నుంచి 18.9.2021 వరకు

మేషం
తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తిచేస్తారు. బరువు, బాధ్యతలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా కొనసాగుతాయి. నలుగురిలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. విద్యార్థులు శ్రమించాల్సి వస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనలాభం ఉంటుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. వివాహాది శుభకార్యాల ప్రయత్నాలలో స్నేహితులు, బంధువర్గం సాయం లభిస్తుంది. వ్యాపారస్తులకు గత పెట్టుబడుల మూలంగా లాభాలు అందుతాయి. కొత్త పెట్టుబడుల కోసం ప్రయత్నాలు చేస్తారు. పాత బాకీలు వసూలు అవుతాయి. వృథా ఖర్చులతో ముఖ్యమైన పనులలో ఆలస్యం జరగవచ్చును.

- Advertisement -

వృషభం
ఉద్యోగంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. పని భారం పెరిగినా సమర్థంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. సహోద్యోగులతో మనస్పర్ధలు ఏర్పడవచ్చు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఉంటాయి. తలపెట్టిన పనులు నెరవేరుతాయి. వ్యాపారస్తులకు అనుకూల వారం. పెట్టుబడుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. అధికారుల ప్రశంసలు పొందుతారు. సంగీత, సాహితీవేత్తలకు, కళాకారులకు ఆదాయం పెరుగుతుంది. కొత్త అవకాశాలు చేతికి అందుతాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. క్రమేపీ పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపుతారు. స్థిర, చరాస్తుల విషయంలో వివాదాలు పరిష్కారం అవుతాయి. కొత్త వస్తువులు కొంటారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

మిథునం
గతవారంతో పోలిస్తే ఈ వారం అనుకూలం. అయితే, దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఏమరుపాటు తగదు. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ ప్రయత్నాలలో తాత్కాలిక ఫలితాలు ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం ఉండవచ్చును. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. రావలసిన డబ్బు చేతికి అందడంలో వివాదాలు తలెత్తవచ్చు. తద్వారా పనులలో జాప్యం జరుగవచ్చు. స్నేహితులు, బంధువర్గం మూలంగా ఇబ్బందులు ఏర్పడవచ్చు. సంయమనం పాటించండి. వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటూ, శ్రద్ధతో పనులు పూర్తిచేయడంపై మనసు నిలుపుతారు. వాహనాలు, భూముల మూలంగా వివాదాలు తలెత్తవచ్చు.

కర్కాటకం
విద్యార్థులకు పైచదువులకు పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. క్రమేపీ పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. అనవసరమైన ఖర్చులు నియంత్రించడం అవసరం. బంధుమిత్రులతో పనులు నెరవేరుతాయి. ఆత్మీయుల సహకారం లభిస్తుంది. కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది. పెద్దల సహకారాన్ని పొందుతారు. మంచి ఫలితాలను పొందుతారు. కుటుంబంతో సంతృప్తిగా ఉంటారు. కళాకారులకు, సాహితీవేత్తలకు కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ లభిస్తుంది.

సింహం
కొత్త పనులు ప్రారంభించే ప్రయత్నం చేస్తారు. స్థిర, చరాస్తుల వల్ల ఆదాయం పెరుగుతుంది. స్నేహ బృందం, బంధువర్గం సహకరిస్తుంది. వివాదాలు తొలగిపోతాయి. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప ఆటంకాలు రావచ్చు. అయినా, అనుకున్న సమయానికి పనులు పూర్తవుతాయి. సాంస్కృతిక, ఆధ్యాత్మిక విషయాలపై మనసు నిలుపుతారు. శుభకార్యాలు చేస్తారు. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు అనుకూల వారం. ముఖ్యంగా వ్యాపారస్తులు భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి. సమయానుకూలంగా నిర్ణయాలను తీసుకుంటారు.

కన్య
అనుకూలమైన వారం. కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరగవచ్చు. సంతృప్తిగా ఉంటారు. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. భూ వ్యవహారాలు అనుకూలిస్తాయి. రోజువారీ పనులు సజావుగా సాగిపోతాయి. ఆత్మీయులు, బంధువులతో సత్సంబంధాలు ఉంటాయి. వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలిస్తుంది. పెద్దల సలహాలు పాటిస్తారు. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. పిల్లల చదువు, వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురిలో మంచిపేరును సంపాదిస్తారు. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి.

తుల
వారం ప్రారంభంలో పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. వారాంతంలో పనులపై శ్రద్ధ నిలపడం అవసరం. ఉద్యోగ ప్రయత్నాలు తాత్కాలికంగా ఫలిస్తాయి. విద్యార్థులు చదువు విషయమై శ్రమించవలసి రావచ్చు. కోర్టు వ్యవహారాలలో ఖర్చులు ఉన్నా, ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. బంధువర్గంతో సత్సంబంధాలు ఉన్నప్పటికీ చిన్నపాటి వివాదాలు తలెత్తవచ్చు. చేతిలో ఉన్న పనులను పూర్తి చేయడంపై మనసు నిలుపుతారు. కొత్తపనుల ప్రారంభాన్ని వాయిదా వేసుకుంటారు. భూములు, వాహనాల కొనుగోలు ప్రయత్నాలు వాయిదాపడతాయి. కళాకారులకు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది.

వృశ్చికం
అన్నదమ్ములు, బంధువర్గం, స్నేహితులతో సంబంధాలు పెంపొందుతాయి. కార్య సాఫల్యం ఉంది. ఉద్యోగ ప్రయత్నాలు పాక్షికంగా ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరుతారు. సంతోషంతో పనులు పూర్తిచేస్తారు. డబ్బు విషయంలో సంతృప్తిగా ఉంటారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ప్రణాళికతో ముందుకు వెళ్తే సమస్యలు అధిగమించవచ్చు. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. వ్యవసాయదారులకు కలిసి వస్తుంది. రాజకీయ, ప్రభుత్వ పనులు నెరవేరుతాయి. కొత్త వ్యాపారం ప్రారంభించే ఆలోచన చేస్తారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. దేవతా, గురుభక్తి పెరుగుతుంది.

ధనుస్సు
గతంతో పోలిస్తే ఈ వారం అనుకూలం. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. చాలా రోజుల నుంచి నిలిచిపోయిన పనులలో కదలికతో సంతృప్తి చెందుతారు. కొత్త పనుల ప్రారంభంపై మనసు నిలుపుతారు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. రాబడిని దృష్టిలో పెట్టుకొని పనులు చేయడం అవసరం. ప్రయాణాలు కలిసి వస్తాయి. పట్టుదలతో పనులు పూర్తిచేస్తారు. స్నేహితులు, ఆత్మీయుల సలహాలతో పనులు చాలావరకు నెరవేరుతాయి. ఉద్యోగస్తులకు ఆఫీసులో పైఅధికారులతో సంబంధాలు పెంపొందుతాయి. నలుగురిలో గౌరవ మర్యాదలను పొందుతారు. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశం ఉంది. పారిశ్రామికవేత్తలకు అందరి సహకారం లభిస్తుంది. కొన్ని అనవసరమైన ఖర్చుల వల్ల ముఖ్యమైన పనులలో కొంత ఆలస్యం జరగవచ్చు.

మకరం
ప్రారంభించిన పనులు పూర్తవుతాయి. దేవతా, గురుభక్తి పెరుగుతుంది. ఆదాయంలో కొంత అస్థిరత ఏర్పడవచ్చు. ఖర్చులను, రాబడిని జాగ్రత్తగా అంచనా వేసుకోవాలి. ఉద్యోగస్తులకు ఆఫీసులో పనిభారం పెరుగుతుంది. తోటివారితో స్నేహంగా ఉంటూ, పనులు చేసుకోవడం మంచిది. విద్యార్థులకు అనుకూల వారం. ఉన్నత విద్య ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో నలుగురి సహకారంతో ముందుకు వెళతారు. రావలసిన డబ్బు సమయానికి రాకపోవడంతో పనులలో జాప్యం జరగవచ్చు. ఈ వారం ముఖ్యంగా ఓపిక, నియంత్రణ అవసరం. కొత్త పనులు ప్రారంభించకుండా చేతిలో ఉన్న పనులను పూర్తి చేయడంపై మనసు నిలపడం మంచిది. కోర్టు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి.

కుంభం
సమయానికి తగిన నిర్ణయాలను తీసుకుంటూ, పనులను పూర్తిచేస్తారు. ఉత్సాహంతో ఉంటారు. ఆరోగ్యంపై మనసు నిలుపుతారు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. శుభకార్యాల మూలంగా ఖర్చులు ఉంటాయి. సంగీత, సాహిత్య, సినిమా రంగాల వారికి అనుకూల వారం. కొత్త అవకాశాలతో ఆదాయం పెరుగుతుంది. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. కొన్ని పనులు ఆర్థిక సమస్యల మూలంగా వాయిదా పడవచ్చు. వాహనాలు, భూముల వ్యవహారంలో జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులకు పైఅధికారుల ఆదరణ లభిస్తుంది. ప్రయాణాల మూలంగా ఖర్చులు పెరగవచ్చును. విహార యాత్రలపై మనసు నిలుపుతారు. కోర్టు కేసులలో అనుకూల పలితాలు ఉంటాయి.

మీనం
ఉద్యోగులు సంతృప్తిగా పనులు పూర్తిచేస్తారు. పైఅధికారుల ఆదరణ లభిస్తుంది. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. ఆరోగ్యంగా ఉంటారు. ఉత్సాహంతో, పట్టుదలతో పనులు పూర్తిచేస్తారు. భూముల వ్యవహారం కలిసి వస్తుంది. స్నేహితులు, ఆత్మీయులతో సంబంధాలు పెంపొందుతాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు చేస్తారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. క్రమేపి ఆదాయం పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు తీరుతాయి. వస్తువులు, భూములు కొనే అవకాశం గలదు. వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి.

గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్‌., సెల్‌: 9885096295
ఈ మెయిల్‌ : nirmalsiddhanthi@yahoo.co.in

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana