మేషం
చేసే వృత్తిలో ఆదాయం స్థిరంగా ఉంటుంది. పనుల్లో బాధ్యతలు పెరిగినా సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. విద్యార్థులకు ఉన్నత కాలం. మంచి సంస్థలలో ఉద్యోగాలు రావచ్చు. పాత బాకీలు వసూలు అవుతాయి. శుభకార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి వ్యక్తులతో స్నేహం ఏర్పడుతుంది. బంధుమిత్రుల రాకతో ఖర్చు పెరిగినా.. ఆనందంగా ఉంటారు. భూ, వాహన వ్యవహారాలు కలిసివస్తాయి. వ్యవసాయదారులు అన్ని విధాలుగా సంతృప్తికరంగా ఉంటారు. పారిశ్రామికవేత్తలు, న్యాయపరమైన సమస్యల నుంచి విముక్తులు అవుతారు. అనవసరమైన చర్చల జోలికి వెళ్లకపోవడం మంచిది.
వృషభం
ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఇంటా, బయటా వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఏమైనా సమస్యలు తలెత్తినా ఉత్సాహంతో వాటిని పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి. ఈ వారం పెట్టుబడులకు అనుకూలం. నూతన వ్యాపార యత్నాలు ఫలిస్తాయి. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. విద్యార్థులకు అనుకూల వారం. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. నలుగురి సహాయ సహకారాలు లభిస్తాయి. న్యాయపరమైన సమస్యలు తీరుతాయి. రాజకీయ, ప్రభుత్వ పనులలో కార్య సాఫల్యం ఉంది.
మిథునం
పనుల్లో బాధ్యతలు పెరుగుతాయి. పెట్టుబడులను వాయిదా వేసుకోవడం మంచిది. విద్యార్థులు ఎక్కువగా శ్రమించాల్సి రావచ్చు. ప్రయాణాల మూలంగా ఖర్చులు ఉంటాయి. సహోద్యోగులతో చికాకులు ఏర్పడవచ్చు. అధికారుల సహకారంతో పనులపై మనసు నిలుపుతారు. స్నేహితుల మూలంగా ధనవ్యయం. బంధుమిత్రులతో అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. రావలసిన సొమ్ము ఆలస్యంగా చేతికి అందుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఉద్యోగ ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురైనా తాత్కాలికంగా ఊరట పొందుతారు. వాహనాల కొనుగోలు వాయిదా పడవచ్చు. పారిశ్రామికవేత్తలకు సిబ్బందితో అవగాహన పెరుగుతుంది. ఊహించని ఖర్చులు ఎదురుకావచ్చు. ఈ వారం ఆలోచించి పనులు చేయడం అవసరం.
కర్కాటకం
శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. విద్యార్థులకు అనుకూల సమయం. ఉద్యోగంలో పదోన్నతి పొందవచ్చు. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. వ్యాపార భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగిస్తారు. వృథా ఖర్చుల కట్టడి అవసరం. స్నేహితులు, బంధువర్గంతో మేలు కలుగుతుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. కుటుంబ పెద్దల సలహాలు పాటించి సత్ఫలితాలు పొందుతారు. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతారు. అధికారుల మెప్పు పొందుతారు.
సింహం
పాత బాకీలు వసూలు అవుతాయి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. క్రమేపీ ఆదాయం పెరుగుతుంది. స్నేహితులు, బంధువుల సహకారం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో బరువు, బాధ్యతలు పెరిగినా.. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. సమాజంలో గుర్తింపు ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. పెట్టుబడులకు అనుకూల వారం. వ్యాపారస్తులకు ఆర్థిక ఒప్పందాలు కలిసివస్తాయి. వ్యవసాయదారులకు, పారిశ్రామికవేత్తలకు మంచి సమయం. ఉత్పత్తి పెరుగుతుంది. భాగస్వాములతో సత్సంబంధాలు కొనసాగుతాయి.
కన్య
సకాలంలో పనులు పూర్తవుతాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి. రోజువారీ కార్యకలాపాలు సంతృప్తిగా ఉంటాయి. ఉత్సాహంతో పనులు చేస్తారు. ఖర్చులు కొంత పెరిగినా.. ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. బంధువుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. వివాహాది శుభకార్య ప్రయత్నాలు కలిసి వస్తాయి. బాధ్యతలు పెరుగుతాయి. పట్టుదలతో నెరవేరుస్తారు. పారిశ్రామికవేత్తలకు సిబ్బంది సహకారం లభిస్తుంది. రాజకీయ, ప్రభుత్వ పనులలో ఖర్చులు అధికం కావచ్చు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి.
తుల
పనులను ఏకాగ్రతతో పూర్తిచేస్తారు. సహోద్యోగులతో మనస్పర్ధలు, పై అధికారులతో అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. మానసికంగా కొంత ఆవేదనకు గురవుతారు. పనులలో బరువు, బాధ్యతలు పెరుగుతాయి. అనవసరమైన ఖర్చుల మూలంగా ముఖ్యమైన పనులలో జాప్యం ఏర్పడవచ్చు. వాహనాల రిపేర్లు ముందుకు రావచ్చు. బంధువర్గం మూలంగా ఖర్చులు ఉంటాయి. అనవసరమైన వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. చేసే వృత్తిలో, వ్యాపారంలో తలెత్తిన సమస్యలను ఓపికతో పరిష్కరించుకుంటారు. కొత్త పనులు వాయిదా పడతాయి. ఆస్తుల మూలంగా కొంత ఆదాయం పెరగవచ్చును. వ్యవసాయదారులకు ఇరుగు పొరుగుతో సమస్యలు తలెత్తుతాయి. కుటుంబంతో సఖ్యతతో గడుపుతారు.
వృశ్చికం
బంధువులు, సోదరుల మూలంగా పనులు నెరవేరుతాయి. వాహనం, భూముల క్రయవిక్రయాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. కుటుంబ పెద్దల సహకారం లభిస్తుంది. న్యాయ పరమైన చిక్కులు తొలగిపోతాయి. ఆఫీసులో తోటి వారితో మనస్పర్ధలు తలెత్తవచ్చు. చేస్తున్న పనిపై మనసు నిలపడం అవసరం. ఉత్సాహంతో ఉంటారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. ఆధ్యాత్మిక కార్య
క్రమాలకు హాజరవుతారు. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. పిల్లల చదువు, శుభకార్యాల విషయాల్లో అందరి సహకారం లభిస్తుంది. వ్యాపారస్తులకు భాగస్వాములతో సత్సంబంధాలు ఉంటాయి. వృథా ఖర్చుల నియంత్రణ అవసరం.
ధనుస్సు
ప్రారంభించిన పనులను ఉత్సాహంగా పూర్తిచేస్తారు. ఆదాయం స్థిరంగా ఉంటూ, క్రమేపీ పెరుగుతుంది. వ్యాపారం లాభదాయకంగా సాగుతుంది. నిలిచిపోయిన పనులలో కదలిక వస్తుంది. ఇంట్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యంగా ఉంటారు. ఖర్చులు పెరిగినా రావలసిన డబ్బు చేతికి అందుతుంది. అలసట లేకుండా నిరంతరం పనిపై మనసు నిలుపుతారు. స్థిర, చరాస్తుల విషయంలో తగాదాలు పరిష్కారమవుతాయి. బంధువర్గం మూలంగా పనులు నెరవేరుతాయి. కళాకారులకు అనుకూల వారం. కొత్త అవకాశాల ద్వారా ఆదాయం పెరుగుతుంది. ఆఫీసులో తోటి వారితో, పై అధికారులతో స్నేహంగా ఉంటారు. వాహనం మూలంగా పనులు నెరవేరుతాయి.
మకరం
ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలపై మనసు నిలుపుతారు. అన్ని పనుల్లోనూ సంయమనం పాటిస్తారు. సహోద్యోగులతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. ఆర్థిక సమస్యల మూలంగా పనుల్లో కొంత జాప్యం జరగవచ్చు. ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. విద్యార్థులకు అనుకూల వారం. ఉన్నత చదువుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ, ప్రభుత్వరంగానికి సంబంధించిన పనులు నెరవేరుతాయి. కోర్టు వ్యవహారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. తీర్థయాత్రలపై మనసు నిలుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు సంతృప్తికరంగా ఉంటాయి. పదోన్నతి గానీ, బదిలీ గానీ పొందవచ్చు. పారిశ్రామికవేత్తలకు అనుకూలం. సిబ్బందితో అనుకూలంగా ఉంటుంది. ఉత్పత్తి పెరుగుతుంది.
కుంభం
వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆలోచనలను ఆచరణలో పెడతారు. ఇంటా, బయటా సంతృప్తిగా ఉంటారు. అందరి సహకారంతో పనులు నెరవేరుతాయి. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. కళాకారులకు మంచి అవకాశాలు వస్తాయి. అనవసరమైన ఖర్చులతో పనులలో కొంత జాప్యం జరగవచ్చు. తలపెట్టిన పనులలో బరువు, బాధ్యతలు పెరుగుతాయి. వాహనాల వల్ల ఖర్చులు పెరగవచ్చు. భూముల కొనుగోలు వాయిదా పడుతుంది. ఉద్యోగస్తులకు ఆఫీసులో పనిభారం పెరుగుతుంది. అధికారులతో వివాదం ఏర్పడవచ్చు. ప్రయాణాల మూలంగా అలసటకు గురవుతారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. బంధువర్గంతో,
స్నేహితులతో వివాదాలు తలెత్తవచ్చును.
మీనం
విద్యార్థులకు మంచి సమయం. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. శుభకార్యాలు చేస్తారు. అందరి సహకారం లభిస్తుంది. అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఆధ్యాత్మిక ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులకు అనుకూల సమయం. ఉత్సాహంతో పనులు చేస్తారు. బంధువుల ద్వారా పనులు నెరవేరుతాయి. రోజువారీ కార్యకలాపాలు నిరాటంకంగా కొనసాగుతాయి. భాగస్వాముల మధ్య సత్సంబంధాలు ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. స్థిర, చరాస్తుల మూలంగా రాబడి పెరుగుతుంది. పూర్వం పెట్టిన పెట్టుబడుల మూలంగా లాభాలు గడిస్తారు. ఆత్మీయులతో పనులు నెరవేరుతాయి.
గుడి ఉమా మహేశ్వరశర్మ సిద్ధాంతి
ఎం.ఎస్సీ., నిర్మల పంచాంగకర్త
నల్లకుంట, హైదరాబాద్., సెల్: 9885096295
ఈ మెయిల్ : nirmalsiddhanthi@yahoo.co.in