మంగళవారం 31 మార్చి 2020
Health - Jan 22, 2020 ,

గుండెపోటుకూ, గ్యాస్‌కూ తేడా ఏంటి?

గుండెపోటుకూ, గ్యాస్‌కూ తేడా ఏంటి?

మా దగ్గరి బంధువు వయసు 42 ఏళ్లు. గుండెలో నొప్పి అని చెప్పినా ఊళ్లో ఆర్‌ఎంపి డాక్టర్‌ గ్యాస్‌ మందులు ఇచ్చిండు. గంటలో గుండెపోటుతో బాధపడి చనిపోయిండు. అందరం చాలా బాధపడ్డాం. అసలు గుండెపోటుకూ, గ్యాస్‌కూ లింకేంటి? తేడా ఎలా తెలుసుకోవాలి? దయచేసి చెప్పండి. - ఎం. సులోచన, పెద్దపల్లి

గ్యాస్‌, గుండెపోటు లక్షణాలు దాదాపు ఒకేలా ఉంటాయి. దాంతో అది గుండెపోటా లేక అంతగా ప్రమాదం కలిగించని గ్యాస్‌ సమస్యా అన్నది తెలియక చాలామంది అయోమయానికి గురవుతుంటారు. సాధారణంగా గ్యాస్‌ సమస్యే కాదు.. కడుపులో లేదా ఛాతిలో మంట, వెన్నునొప్పి, మెడనొప్పిగా భావించి కూడా గుండెపోటును గుర్తించలేకపోతారు. నిజానికి అజీర్తి లేదా గ్యాస్‌ సంబంధిత సమస్య వల్ల కడుపులోనో, గుండెలోనో మంటగా ఉంటే ఒక్క యాంటాసిడ్‌ మాత్రతో తగ్గిపోతుంది. మెడ, వెన్ను భాగాల్లో నొప్పి ఉంటే పెయిన్‌ కిల్లర్‌తో ఉపశమనం కలుగుతుంది. కానీ ఒకట్రెండు టాబ్లెట్లు తీసుకున్న తరువాత కూడా ఉపశమనంగా లేకుంటే గుండెనొప్పిగా అనుమానించాలి. 


గుండెనొప్పి (ఏంజైనా)తో పాటు తేన్పులు వస్తుంటాయి. అందుకే దీన్ని గ్యాస్‌ సమస్యగా అపోహ పడుతుంటారు. కొంతమందికి శారీరక శ్రమ తర్వాత 5 నుంచి 15 నిమిషాల పాటు నొప్పి ఉంటుంది. నిమిష నిమిషానికీ చెమటలు పెరుగుతాయి. వాంతులు, శ్వాస అందకపోవడం, చివరకు అపస్మారకంలోకి వెళ్లవచ్చు. వేరే సమస్యలనుకుని మందులు వాడినా నొప్పి తగ్గకపోతే వెంటనే హాస్పిటల్‌కి తీసుకెళ్లాలి. logo
>>>>>>