ఈ లాభాలు తెలిస్తే.. అర‌టి పండు తొక్క‌ను ఇక ప‌డేయ‌రు..!


Wed,January 3, 2018 04:38 PM

మ‌న‌కు అర‌టిపండ్లు ఏడాది పొడవునా ల‌భిస్తాయి. పేద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు కూడా అర‌టిపండ్లు అందుబాటులో ఉంటాయి. ఎవ‌రికైనా వీటిని చూడ‌గానే తినాల‌ని అనిపిస్తుంది. అరటి పండ్ల‌లో అనేక పోషకాలు, కార్బోహైడ్రేట్లు సమృద్ధిగా ఉంటాయి. విటమిన్ బి6, బి12, మెగ్నిషియం, పొటాషియం వంటి పోషకాలు అర‌టి పండ్ల‌లో పుష్కలంగా ఉంటాయి. దీంతో మ‌న శ‌రీరానికి సంపూర్ణ పోష‌ణ అందుతుంది. అయితే కేవ‌లం అర‌టి పండే కాదు, దాని తొక్క‌తో కూడా మ‌న‌కు ప్ర‌యోజ‌నాలే క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. అరటి పండు తొక్క లోప‌లి వైపును దంతాల‌పై రుద్దితే దంతాలు తెల్ల‌గా మెరుస్తాయి. వరుసగా వారం రోజుల పాటు ఇలా రుద్దడం వల్ల దంతాలు తళ తళా మెరుస్తూ ఉంటాయి. దంతాలు పచ్చగా ఉన్నవారికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.

2. అరటి పండు తొక్క పులిపిర్లను తొలగించడంలో సహాయపడుతుంది. కొత్తవి రాకుండా చేస్తుంది. అందుకు ఏం చేయాలంటే.. పులిపిర్లు ఉన్న భాగంపై అరటి తొక్కతో రుద్దాలి. అనంత‌రం రాత్రంతా పులిపిర్లు ఉన్నచోట అరటి తొక్కను క‌ట్టుగా క‌ట్టాలి. దీంతో పులిపిర్లు త‌గ్గిపోతాయి.

3. మన దేశంలో ప‌లు ప్రాంత వాసులు అర‌టి పండు తొక్క‌ల‌ను చికెన్‌లో వేసి వండుతారు. అనంత‌రం తీసేస్తారు. దీంతో ఆ కూర‌ల‌కు చ‌క్క‌ని రుచి, వాస‌న వ‌స్తాయ‌ని విశ్వసిస్తారు.

4. అర‌టి పండు తొక్క‌ను ముఖంపై రోజూ 5 నిమిషాల పాటు రుద్దాలి. ఇలా వారం పాటు చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది. ముఖంపై ఉండే మ‌చ్చ‌లు, మొటిమ‌లు పోతాయి.

5. అర‌టి పండు తొక్క‌ను, ఒక కోడిగుడ్డును తీసుకుని వాటిని మిక్సీలో వేసి ప‌ట్టి మిశ్ర‌మంగా చేసుకుని ముఖానికి రాయాలి. 20 నిమిషాలు ఆగాక క‌డిగేయాలి. వారంలో ఇలా రెండు సార్లు చేస్తే ముఖం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. ముఖంపై ఉండే ముడ‌త‌లు పోతాయి.

6. శ‌రీరంలో ఏ భాగంలోనైనా నొప్పిగా ఉంటే దానిపై అర‌టి పండు తొక్క‌ను రుద్దాలి. దీంతో నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

7. దోమ‌లు, పురుగులు, కీట‌కాలు కుట్టిన చోట అర‌టి పండు తొక్క‌ను రుద్దితే నొప్పి, మంట‌, దుర‌ద త‌గ్గుతాయి.

8. షూస్, వెండి వ‌స్తువులు, తోలు దుస్తుల‌ను అర‌టి పండు తొక్క‌తో రుద్దితే అవి ప్ర‌కాశ‌వంతంగా మెరుస్తాయి.

9. కంటి ఆరోగ్యాన్ని సంర‌క్షించ‌డంలోనూ అర‌టి పండు తొక్క ప‌నిచేస్తుంది. అర‌టి పండు తొక్క‌ల‌ను క‌ళ్ల‌పై కొంత సేపు ఉంచుకుంటే సూర్యుని నుంచి వ‌చ్చే అతినీల లోహిత కిర‌ణాల ప్ర‌భావం నుంచి త‌ప్పించుకోవ‌చ్చు.

8286

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles