చ‌లికాలంలో ఖ‌ర్జూరాల‌ను తప్ప‌నిస‌రిగా తినాలి.. ఎందుకంటే..?

Mon,January 14, 2019 12:42 PM

ఆయుర్వేద ప్ర‌కారం ఖ‌ర్జూరాల్లో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉంటాయి. ఎన్నో ర‌కాల వ్యాధుల‌ను న‌యం చేసే శ‌క్తి ఖ‌ర్జూరాల‌కు ఉంటుంది. ప్రాచీన కాలంలో ఈజిప్షియ‌న్లు ఖ‌ర్జూరాల‌తో వైన్ త‌యారు చేసుకుని తాగేవారు. ప్ర‌పంచవ్యాప్తంగా మ‌న‌కు దాదాపుగా 30 ర‌కాల ఖ‌ర్జూర వెరైటీలు అందుబాటులో ఉన్నాయి. ఇక చ‌లికాలంలో అయితే ఖ‌ర్జూరాల‌ను త‌ప్ప‌నిస‌రిగా తినాలి. దాంతో ఎలాంటి లాభాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.


1. ఖ‌ర్జూరాల‌ను తింటే స‌హ‌జంగానే శ‌రీరంలో వేడి ఉత్ప‌న్న‌మ‌వుతుంది. అందుక‌ని చ‌లికాలంలో వీటిని తింటే శ‌రీరం వెచ్చ‌గా ఉంటుంది. చ‌లి బారి నుంచి త‌ప్పించుకోవ‌చ్చు. అలాగే ఈ కాలంలో వ‌చ్చే శ్వాస కోశ స‌మ‌స్య‌లైన ద‌గ్గు, జ‌లుబు, ఫ్లూ జ్వ‌రం, ఇత‌ర ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి రక్ష‌ణ ల‌భిస్తుంది.

2. ఒక పాత్ర‌లో కొన్ని నీటిని తీసుకుని రెండు మూడు ఖర్జూరాల‌ను వేసి నీటిని బాగా మ‌రిగించాలి. అనంత‌రం అందులో కొద్దిగా న‌ల్ల మిరియాల పొడి, యాల‌కుల పొడి వేయాలి. మ‌ళ్లీ నీటిని మ‌రిగించాలి. ఆ మిశ్ర‌మం గోరు వెచ్చ‌గా ఉండ‌గానే తాగాలి. రాత్రి పూట ఈ మిశ్ర‌మాన్ని తాగితే ఉద‌యం నిద్ర లేచే స‌రికి ద‌గ్గు, జ‌లుబు త్వ‌ర‌గా త‌గ్గుతాయి.

3. హైబీపీ ఉన్న‌వారు రోజుకు 5 నుంచి 6 ఖ‌ర్జూరాల‌ను తినాలి. దీంతో ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగుప‌డుతుంది. అలాగే బీపీ కంట్రోల్ అవుతుంది.

4. కీళ్ల నొప్పుల స‌మ‌స్య‌లు ఉన్న‌వారు ఖ‌ర్జూరాల‌ను తింటే ఫ‌లితం ఉంటుంది.

5. మ‌ల‌బ‌ద్ద‌కం స‌మ‌స్య ఉన్న‌వారు రాత్రి పూట 2, 3 ఖ‌ర్జూరాల‌ను తింటే ఉద‌యాన్నే సుఖంగా విరేచ‌నం అవుతుంది. ఆస్త‌మా ఉన్న‌వారు ఖ‌ర్జూరాల‌ను తింటుంటే ఫ‌లితం ఉంటుంది.

6. ఒంట్లో నీర‌సంగా ఉండే వారు, త్వ‌ర‌గా అల‌సిపోయే వారు ఖ‌ర్జూరాల‌ను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి.

7660
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles