అరటి పండు తొక్క తింటే ఏమ‌వుతుందో తెలుసా..?


Wed,May 31, 2017 02:34 PM

అరటిపండును తినడం వల్ల మనకు ఎలాంటి లాభాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. అరటి పండ్లలో ఉండే పొటాషియం రక్త సరఫరాను మెరుగు పరుస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణ సమస్యలు పోతాయి. తక్షణ శక్తి కావాలంటే అరటి పండును తింటే వెంటనే శక్తి లభిస్తుంది. అయితే ఇవే కాదు... ఇంకా ఎన్నో ప్రయోజనాలు మనకు అరటి పండ్ల వల్ల కలుగుతాయి. అయితే అరటి పండు మాత్రమే కాదు, అరటి పండు తొక్క కూడా మనకు మేలు చేస్తుంది. అవును, మీరు విన్నది నిజమే. అరటి పండు తొక్కను కూడా మనం తినవచ్చు తెలుసా..! సైంటిస్టులు చేసిన ప్రయోగాలు అరటి పండు తొక్క తినడం వల్ల కలిగే లాభాలను వివరిస్తున్నాయి. అవేమిటంటే...
eating-banana-peel
డిప్రెషన్...
డిప్రెషన్‌తో బాధపడుతున్న వారు వరుసగా 3 రోజుల పాటు రోజుకు రెండు అరటి పండు తొక్కలను తినాలి. దీంతో వాటిలో ఉండే ఔషధ గుణాలు మన శరీరంలో సెరటోనిన్ స్థాయిలను 15 శాతం వరకు పెంచుతాయి. ఇలా సెరటోనిన్ పెరిగితే డిప్రెషన్ తగ్గుతుంది. మూడ్ బాగుంటుంది. మానసిక సమస్యలతో సతమతమయ్యేవారు అరటి పండు తొక్కలను రెగ్యులర్‌గా తింటే మంచి ఫలితం ఉంటుంది. యూనివర్సిటీ ఆఫ్ తైవాన్‌కు చెందిన సైంటిస్టులు చేసిన పరిశోధనల్లో ఈ విషయం తెలిసింది.

నిద్ర...
ట్రిప్టోఫాన్ అనే రసాయనం అరటి పండు తొక్కలో ఉంటుంది. అందువల్ల తొక్కను తింటే ఆ రసాయనం మన శరీరంలోకి చేరుతుంది. అప్పుడు నిద్ర బాగా వస్తుంది. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు అరటి పండు తొక్కలను తింటుంటే ప్రయోజనం ఉంటుంది.

కొలెస్ట్రాల్...
అరటి పండులో కన్నా దాని తొక్కలోనే ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. ఇది శరీరంలో ఉన్న ఎల్‌డీఎల్ (చెడు కొలెస్ట్రాల్)ను తగ్గిస్తుంది. హెచ్‌డీఎల్ (మంచి కొలెస్ట్రాల్)ను పెంచుతుంది. దీని వల్ల గుండె సంబంధ సమస్యలు రావు. ఓ పరిశోధక బృందం దీన్ని నిరూపించింది కూడా. వరుసగా కొన్ని రోజుల పాటు కొంత మంది రోజూ అరటి పండు తొక్కలను తిన్నారు. దీంతో వారి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గినట్టు గుర్తించారు.
banana-peel
అధిక బరువు...
అరటి పండు తొక్కలో ఉండే ఫైబర్ అధిక బరువును ఇట్టే తగ్గిస్తుంది. శరీరంలో అధికంగా ఉన్న కొవ్వు క్రమంగా కరుగుతుంది.

ప్రొబయోటిక్స్...
అరటి పండు తొక్క మంచి ప్రొబయోటిక్‌గా పనిచేస్తుంది. దీన్ని తినడం వల్ల పేగుల్లో మంచి బాక్టీరియా వృద్ధి చెందుతుంది. శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

విష పదార్థాలు, జీర్ణ సమస్యలు...
అరటి పండు తొక్కను రెగ్యులర్‌గా తినడం వల్ల జీర్ణ సమస్యలు పోతాయి. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం ఉండదు. శరీరంలో ఉన్న విష పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి.

ఎర్ర రక్త కణాలు...
అరటి పండు తొక్కను తినడం వల్ల రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య పెరుగుతుంది.

దృష్టి సమస్యలు...
అరటి పండు తొక్కలో లుటీన్ అనే పదార్థం ఉంటుంది. ఇది దృష్టి సమస్యలను పోగొడుతుంది. రేచీకటి, శుక్లాలు రావు.
banana-drink-juice
చర్మ సమస్యలు...
దెబ్బలు, గాయాలు, పుండ్లు, దురదలు, పురుగులు, కీటకాలు కుట్టిన చోట అరటి పండు తొక్కను రుద్దితే ఉపశమనం లభిస్తుంది.

దంత సమస్యలు...
అరటి పండు తొక్కతో దంతాలను తోముకుంటే దంతాలు దృఢంగా, తెల్లగా మారుతాయి. చిగుళ్ల సమస్యలు తగ్గుతాయి.

అరటి పండు తొక్కనే నేరుగా తినలేమని అనుకునేవారు వాటిని జ్యూస్‌లా పట్టి కూడా తాగవచ్చు. లేదంటే అరటి పండు తొక్కను నీటిలో బాగా మరిగించి ఆ నీటిని కూడా తాగవచ్చు. దీంతో పైన చెప్పిన అన్ని లాభాలు కలుగుతాయి.

7829

More News

VIRAL NEWS