సైక్లింగ్ చేస్తే.. పదేళ్ల వయస్సు వెనక్కి..!


Thu,November 8, 2018 01:28 PM

అవును.. మీరు విన్నది నిజమే. నిత్యం సైకిల్ తొక్కడం వల్ల పదేళ్ల వయస్సు వెనక్కి వెళ్తుందట. అంటే.. మీరు యంగ్‌గా కనిపిస్తారన్నమాట. మీ అసలు వయస్సును ఎవరూ గుర్తించలేరన్నమాట. ఇది మేం చెబుతున్నది కాదు. స్వీడన్‌కు చెందిన పలువురు సైంటిస్టులు ఈ విషయాన్ని వెల్లడించారు. నిత్యం సైకిల్ తొక్కడం వల్ల శరీర బరువు తగ్గడంతోపాటు వృద్ధాప్య ఛాయలు కూడా అంత త్వరగా రావట. అంటే.. వృద్ధాప్యాన్ని కొంత కాలం వాయిదా వేసినట్లేనని సైంటిస్టులు చెబుతున్నారు. దీని వల్ల చర్మం కాంతివంతంగా మారి యవ్వనంగా కనిపిస్తారని వారు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా సైకిల్ తొక్కడం వల్ల చక్కని దేహ దారుఢ్యం సొంతమవుతుందని, మానసిక ఉల్లాసం కలుగుతుందని, గుండె జబ్బులు రాకుండా ఉంటాయని కూడా సైంటిస్టులు చెబుతున్నారు. కనుక రన్నింగ్, వాకింగ్ చేయలేమని అనుకునేవారు నిత్యం కనీసం 30 నిమిషాల పాటు ఏకధాటిగా సైకిల్ తొక్కినా ఫలితం పొందవచ్చని వైద్య నిపుణులు కూడా చెబుతున్నారు.

2992

More News

VIRAL NEWS

Featured Articles