మందార పువ్వుల‌తో బ‌రువు త‌గ్గొచ్చు. ఎలాగో తెలుసా..?


Thu,February 22, 2018 12:49 PM

అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. మందార పువ్వుల‌తో త‌యారు చేసిన టీని తాగితే బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. అంతేకాదు మ‌న‌కు క‌లిగే ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా తొల‌గిపోతాయి. మ‌రి మందార పువ్వుల టీని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా.

ఒక పాత్ర‌లో కొంత నీటిని తీసుకుని బాగా మ‌రిగించాలి. అనంతరం ఆ నీటిని స్ట‌వ్ మీద నుంచి దించాలి. కొన్ని మందార పూల‌ను తీసుకుని వాటిలో తొడిమ‌, పుప్పొడి భాగాల‌ను తొల‌గించి కేవ‌లం పువ్వు రెక్క‌ల‌ను మాత్ర‌మే తీసుకోవాలి. వాటిని మ‌రిగించిన నీటిలో వేసి అలాగే 10 నిమిషాల పాటు ఉంచాలి. అనంత‌రం ఆ నీటిని వ‌డ‌క‌ట్టాలి. ఆ నీటిలో కొద్దిగా నిమ్మ‌ర‌సం, దాల్చిన చెక్క పొడి, తేనె వంటివి వేసి క‌లుపుకుని వేడిగా ఉండగానే తాగేయాలి. ఇలా మందార పువ్వుల‌ను తెచ్చి టీల‌ను త‌యారు చేసుకోలేని వారి కోసం మందార టీ బ్యాగ్‌లు కూడా మార్కెట్‌లో ల‌భిస్తున్నాయి. వాటిని కూడా వాడ‌వ‌చ్చు.

మందార పూల టీని నిత్యం తాగ‌డం వ‌ల్ల శ‌రీరంలో అధికంగా ఉన్న కొవ్వు క‌రిగి బ‌రువు త‌గ్గుతారు. ఇది గ్లూకోజ్‌, ఫ్యాట్స్ వంటి వాటిని శ‌రీరంలో త్వ‌ర‌గా క‌ల‌వ‌కుండా చేస్తుంది. దీంతో దేహంలో కొవ్వు ఎక్కువ‌గా పేరుకుపోదు. అంతేకాకుండా మందార పూల టీ వ‌ల్ల గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చూసుకోవ‌చ్చు. చెడు కొలెస్ట్రాల్ త‌గ్గుతుంది. మ‌ధుమేహంతో బాధ‌ప‌డుతున్న వారికి ఎంతో మేలు చేస్తుంది. ప‌లు ర‌కాల క్యాన్స‌ర్‌ల‌కు మందుగా ప‌నిచేస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేస్తుంది. శ‌రీరానికి శ‌క్తిని, ఉత్తేజాన్ని ఇస్తుంది.

8286
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles