గురువారం 01 అక్టోబర్ 2020
Health - Apr 23, 2020 , 19:46:38

స‌న్న‌గా ఉన్నారా... మీకో శుభ‌వార్త‌!

స‌న్న‌గా ఉన్నారా... మీకో శుభ‌వార్త‌!

 స‌న్న‌గా ఉంటే ఆ కంఫర్టే వేరు... ఎక్క‌డైనా సులువుగా కూర్చోవ‌చ్చు లేవొచ్చు. అస‌లు బ‌ద్ధ‌కమే ఉండ‌దు. ప‌నుల‌న్నీ చ‌క‌చ‌కా చేసేస్తారు. లావుగా ఉన్న‌వారితో పోల్చితే బక్కపల్చని వారికి చాలా అడ్వాంటేజెస్‌ ఉంటాయి.  వీరిని ఆద‌ర్శంగా తీసుకొని స‌న్న‌గా అవ్వాల‌ని చాలార‌కాలుగా ప్ర‌య‌త్నాలు కూడా చేస్తుంటారు కొంద‌రు. వీలైనంత త్వ‌ర‌గా స‌న్న‌గా అయిపోండి. ఎందుకంటే స‌న్న‌గా ఉన్న‌వారికి మ‌రో అడ్వాంటేజీ కూడా ఉంది.  బక్కగా ఉన్నవారు అంద‌రికంటే ఎక్కువ‌కాలం జీవించే అవ‌కాశం ఉందంట‌. అదికూడా ఓ ప‌రిశోధ‌న‌లో తేలింది.

స‌న్నగా ఉన్నవారు ఎక్కువ కాలం జీవిస్తారని పరిశోధకులు చెబుతున్నారు. అమెరికాలోని హార్వార్డ్, టఫ్ట్స్ యూనివర్సిటీలు మనిషి జీవపరిణామ క్రమం, మరణాల మధ్య సంబంధాలపై పరిశోదనలు చేశాయి. ఈ పరిశోధనల్లో పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఈ పరిశోధనల కోసం వారు 80 వేల 266 మంది మహిళలను, 36 వేల 622 మంది పరుషులను పరీక్షించారు. వీరంతా 5, 10, 15, 20, 30, 40 ఏళ్లప్పుడు వారి శరీరాకృతులు ఎలా ఉండేవో పరిశోధకులకు వివరించారు. 

50 ఏళ్ల వయసులో వారి శరీరద్రవ్య రాశి సూచీ (బీఎంఐ)ని వారు రూపొందించారు. వారికి 60 ఏళ్ల వయసు వచ్చిన తరువాత మళ్లీ వారిపై పరిశోధనలు చేశారు. సన్నగా ఉన్న మహిళల్లో 60 ఏళ్లు దాటిన తరువాత మరో 15 ఏళ్ల లోపల మరణించే అవకాశాలు కేవలం 11 శాతంగా ఉండగా, పురుషుల్లో మాత్రం 20.3 శాతం మరణించే అవకాశం ఉంది. అదే లావుగా ఉన్న పురుషుల్లో ఆ వయసులో మరణించే అవకాశం 24.1 శాతం, మహిళల్లో 19.7 శాతం ఉంది. 


logo