నేడు వరల్డ్ మెంటల్ హెల్త్ డే


Wed,October 10, 2018 12:22 PM

నేటి ఆధునిక యుగంలో శారీరక అనారోగ్య సమస్యలే కాదు, మానసిక అనారోగ్య సమస్యలు కూడా సగటు పౌరున్ని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అనేక మంది అనేక రకాల మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలోనే అలాంటి వారిలో మానసిక అనారోగ్య సమస్యల పట్ల అవగాహన కల్పించడం కోసమే ప్రతి ఏటా అక్టోబర్ 10వ తేదీని వరల్డ్ మెంటల్ హెల్త్ డే గా పాటిస్తూ వస్తున్నారు. మానసిక అనారోగ్య సమస్యల పట్ల సహజంగానే మన సమాజంలో పలు అపోహలు ఉంటాయి. వాటిని తొలగిస్తూ మానసిక అనారోగ్య సమస్యలను కూడా మిగిలిన ఇతర అనారోగ్య సమస్యలలాగానే భావించాలని తెలిపేందుకే ఈ డేను నిర్వహిస్తున్నారు.

1992వ సంవత్సరంలో మొదటి సారిగా వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అప్పటి నుంచి ప్రతి ఏటా ఒక థీమ్‌తో వరల్డ్ మెంటల్ హెల్త్ డేను జరుపుకుంటున్నారు. ఈ ఏడాది థీమ్.. Young people and mental health in a changing world.. గతేడాది మెంటల్ హెల్త్ ఇన్ ది వర్క్‌ప్లేస్ థీమ్‌లో ఈ దినోత్సవాన్ని నిర్వహించారు.

మార్చి 2018లో ది లివ్ లవ్ లాఫ్ ఫౌండేషన్ (టీఎల్‌ఎల్‌ఎల్‌ఎఫ్) ఫౌండేషన్ హౌ ఇండియా పర్సీవ్స్ మెంటల్ హెల్త్ పేరిట ఓ నివేదికను ప్రచురించింది. అందులో.. భారత్‌లోని 8 ప్రధాన నగరాల్లో ఉంటున్న జనాభాలో కనీసం 87 శాతం మంది ప్రజలు ఏదో ఒక మానసిక అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలిసింది. వారిలో ఎక్కువగా షిజోఫ్రీనియా, అబ్సెస్సివ్ కంపల్సివ్ డిజార్డర్‌లతో బాధపడుతున్న వారే ఎక్కువని తెలిసింది. ఆ రిపోర్టు చెబుతున్న మరో విషయం ఏమిటంటే.. సదరు నగరాల్లోని 47 శాతం మంది తమను తాము రిటార్డ్ (మానసిక అనారోగ్య సమస్యలు ఉన్నవారు) వ్యక్తులతో పోల్చుకున్నారట. ఇక 60 శాతం మంది తమకు మానసిక అనారోగ్య సమస్యలున్నాయని నమ్ముతున్నారని తెలిసింది. ఈ క్రమంలో మానసిక అనారోగ్య సమస్యల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు..!

969

More News

VIRAL NEWS

Featured Articles