విట‌మిన్ ఇ మ‌న‌కు ఎందుకు అవ‌స‌ర‌మంటే..?


Sat,November 3, 2018 03:35 PM

స్వీట్‌కార్న్‌, నట్స్‌, ఆకుకూరలు, కూరగాయలు, గోధుమలు.. ఇలా ప‌లుకాల ఆహారాల్లో విట‌మిన్ ఇ మ‌న‌కు పుష్క‌లంగా లభిస్తుంది. వీటిని నిత్యం తీసుకోవడం వల్ల మ‌న శ‌రీరానికి పోష‌ణ అంద‌డ‌మే కాదు, ప‌లు ర‌కాల అనారోగ్యాల‌ను దూరం చేసుకోవ‌చ్చు కూడా. విట‌మిన్ ఇ ఉన్న ఆహారాల‌ను రోజూ తిన‌డం వ‌ల్ల ఎలాంటి లాభాలు క‌లుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

1. విటమిన్‌ ఇ శరీరంలోని కణాలను కాపాడటమే కాదు కొత్త కణాల వృద్ధికీ తోడ్పడుతుంది. అలాగే గుండె, నరాల వ్యవస్థ, కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. ఎర్రరక్త కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.

2. ఇది చర్మానికి చాలా మేలు చేస్తుంది. చర్మ సంబంధ సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. అందుకే ఈ విటమిన్‌ని రకరకాల సౌందర్యోత్పత్తుల తయారీలో వాడుతుంటారు. అయితే అలా ఉపయోగించడం కంటే ఆహార పదార్థాల రూపంలో తీసుకుంటేనే మంచిది.

3. రోగనిరోధకశక్తిని పెంచడంలో విటమిన్‌ ఇ కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలో వాతావరణ మార్పులతో వచ్చే ఇన్‌ఫెక్షన్లను దూరంగా ఉంచుతుంది.

4. పాలకూర, పండ్లు, బఠాణీల్లోనూ విటమిన్‌ ఇ ఉంటుంది. వాటిని తరచూ తీసుకోవడం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది. ఎందుకంటే వీటిల్లో లభించే విటమిన్‌ ఇ రక్తంలో గ్లూకోజ్‌ శాతాన్ని సమతుల్యం చేస్తుంది.

5. విట‌మిన్ ఇ ఉన్న ఆహారాన్ని రోజూ తింటే కంటి చూపు మెరుగు ప‌డుతుంది. మెద‌డు యాక్టివ్‌గా ప‌నిచేస్తుంది. కిడ్నీలు సుర‌క్షితంగా ఉంటాయి.

3557

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles