మంగళవారం 02 మార్చి 2021
Health - Jan 21, 2021 , 15:11:44

రేగిపండు ఎందుకు తినాలి.. ఎవరెవరు తినాలి..?

రేగిపండు ఎందుకు తినాలి.. ఎవరెవరు తినాలి..?

జనవరి వచ్చిందంటే.. రేగి పండ్లు అంతటా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు రేగిపండ్లు లేకుండా సంక్రాంతి పండగ కూడా జరుపుకోరు అనడంలో ఏమాత్రం అతిశయెక్తి లేదు. మరి అలాంటి రేగిపండును ఎందుకు తినాలి.. అందరూ దాన్ని తినచ్చా..?  లాంటి సందేహాలు చాలా మందికి కలిగే ఉంటాయి. ముఖ్యంగా గర్భవతులు, డయాబెటిస్ పేషెంట్లు ఏం తినాలన్నా ఆలోచించి తినాల్సిన పరిస్థితి ప్రస్తుతం ఉంది. కాబట్టి వారు రేగిపండ్లను తినచచ్చా లేదా అని అనుమానం ఎక్కువ మందిలో ఉంది. 

కాబట్టి వీటిని ఎందుకు తినాలి.. ఎవరెవరు తినాలి అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం..నిజానికి రేగిపండ్లు చైనా, యూరప్, ఆసియా లాంటి ఇతర దేశాల్లో ఎక్కువగా దొరుకుతాయట. వీటిని చైనీస్ రెడ్ డేట్స్, కొరియన్ డేట్స్, ఇండియన్ డేట్స్, జుజుబీ ఫ్రూట్స్ అని పిలుస్తుంటారట. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో వీటిని చాలా మంది తింటుంటారు. వీటిలో పోషకాలతో పాటు.. ఔషధ గుణాలు కూడా ఉన్నందున వీటిని చాలా మంది ఇష్టపడతారు.

రేగిపండ్లు ఎందుకు తినాలి.. ఉపయోగాలేంటి..?

బరువు తగ్గేందుకు 

రేగిపండులో ప్రొటీన్లతో పాటు ఫైబర్ ఎక్కువగా ఉండటంతో పాటు చాలా తక్కువ కేలరీ కంటెంట్ ఉంటుంది. కాబట్టి వీటిని తినడం వల్ల బరువు పెరగకుండా ఉంటాం.

మానసిక ఆరోగ్యానికి మేలు 

రేగిపండులో న్యూరో ప్రొటెక్టివ్ ఎఫెక్ట్స్ మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపడరచడమే కాకా, బ్రెయిన్ ఫంక్షన్ పెంపొందిస్తాయి.

 బీపీని కంట్రోల్ చేస్తుంది

బ్లడ్ ప్రెజర్ ను అదుపులో ఉంచేందుకు రేగిపండు మంచి థెరపీలా పనిచేస్తుందని నిపుణులు చెబుతుంటారు. హైబీపీని తగ్గించడంతో పాటు సాధారణ స్థాయిలో ఉంచేందుకు సహాయపడుతుంది.

మంట, నొప్పిలను తగ్గిస్తుంది

రేగిపండులోని యాంటీ ఇన్ష్లమేటరీ, యాంటీ మెక్రోబయల్ ఏజెంట్లు చాలా రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు రాకుండా మంట, నొప్పి లాంటివి తగ్గించేందుకు రేగిపండు బాగా ఉపయోగపడుతుంది.

యాంటీ ఆక్సిడెంట్

రేగిపండులో విటమిన్-సితో పాటు బెటులినిక్ యాసిడ్ అనే కెమికల్ కాన్సటిట్యటూట్ ఉంటుంది. ఇది శరీరంలోని గ్లూటాథియోన్ లెవెల్స్ పెంచి ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడుతుంది.

జీర్ణ శక్తి పెంచుతుంది

రేగిపండులోని ఫైబర్ కంటెంట్  దీర్ఘకాలిక మలబద్దాకాన్ని తగ్గిస్తుంది. అలాటే డయేరియా లాంటి సమస్యలు రాకుండా కాపాడటంతో పాటు అరుగుదల శక్తిని పెంచుతుంది.

అలర్జీ నుంచి రక్షణ

యాంటీ హిస్టామినిక్ ప్రాపర్టీస్ ఎక్కువగా లభించే రేగిపండు తినడం వల్ల ఇమ్మునిటీ పవర్ పెరగడంతో పాటు అలర్జీను రాకుంగా కాపాడుతుంది. అలాగే దీంట్లోని బ్రోమిలైన్ అనే ఎంజైమ్ దగ్గు లాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతుంది.

క్యాన్సర్‌కు చెక్‌!

రేగిపండులో క్యాన్సర్ కణాలను తగ్గించే శక్తి ఉంది. అలాగే వీటిలోని అన్ సాచురేటెడ్ యాసిడ్స్ క్యాన్సర్ ట్రీట్ మెంట్ కు ఉపయెగపడతాయి.

వయసు తగ్గిస్తుంది

రేగిపండులోని యాంటీ ఎజింగ్ ఏజెంట్ వయసు ముదిరినట్టు కనిపించకుండా కాపాడుతుంది. దీంట్లోని విటమిన్-సి చర్మంపై వచ్చే ముడతలు, మొటిమలు లాంటి సమస్యలను తగ్గించేందుకు దోహదపడుతుంది.

డీటాక్సిఫైస్ బ్లడ్

రక్తానికి హాని చేసి టాక్సిన్స్ ని తొలగించడంతో పాటు డీటాక్సిఫై చేసేందుకు ఉపయోగపడే సపొనిన్స్, అల్కలైడ్స్ లాంటి రేగిపండులో పుష్కలంగా లభిస్తాయి.

డయాబెటీస్ పేషెంట్లు తినొచ్చా..?

రేగిపండులో బాడీ మెటబాలిజమ్ ను పెంచే చాలా రకాల పోషకాలు కలిగి ఉన్నప్పటికీ వీటిని డయాబెటీస్ పేషెంట్లు తినకోవడమే మేలట. ఎందుకంటే దీంట్లోని చెక్కర స్థాయి బ్లడ్ షుగర్ లెవెల్స్ ను పెంచే అవకాశాలు ఉన్నాయట.

గర్భిణుల మాటేంటి..? 

దీంట్లో ఎక్కువ మొత్తంలో ఫోలిక్ యాసిడ్ ఉన్నందున ఇది రక్త కణాలను పెంచి బిడ్డ ఎదుగుదలకు సహాయపడుతుంది. అలాగే రేగిపండులోని జింక్ బిడ్డ బ్రెయిన్ ఎదుగులకు కూడా దోహదపడుతుందట. కాబట్టి గర్భవతులు వీటిని మితంగా తినాలే కానీ.. ఎక్కువ తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువగా తినడం వల్ల గర్భధారణలో ప్రమాదాలు రావచ్చట.

VIDEOS

logo