ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Health - Apr 18, 2020 , 15:41:40

యవ్వనంతో కనిపించండి..!

యవ్వనంతో కనిపించండి..!

సరైన ఆరోగ్యం లేనప్పుడే నిద్ర సమస్యలు వస్తాయి.   నిద్రలేమివల్ల గుండెకు సంబంధించిన జబ్బులు కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడటంలో నిద్ర ముఖ్యపాత్ర పోషిస్తుంది.


-కంటినిండా నిద్రపోతే ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. కనీసం 6-9 గంటలు నిద్రపోవాలి. -సమయానుసారంగా నిద్రపోతే శరీరంలోని జీవక్రియలో మార్పులు వచ్చి చర్మం కళకళలాడుతుంది.

-ఉదయం లేవడంతోనే వాకింగ్ చేస్తే ఎన్నో ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా నడకతో శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ క్రమబద్ధంగా సాగుతుంది. బీపీ, డయాబెటీస్ వంటివి కూడా తగ్గుముఖం పడుతాయి. 

-మార్నింగ్ వాక్‌తో శరీరంలోని అన్ని అవయవాలకు రక్తం సరిగ్గా అందుతుంది. తద్వారా చర్మ కాంతి కూడా పెరుగుతుంది.

-ఆహారాన్ని క్రమం తప్పకుండా తింటున్నాం కదాని పండ్లను తినడాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. తాజా పండ్లను తినడం ద్వారా శరీరంలో రక్తపుష్టి పెరుగుతుంది. దాంతో పాటు తగినన్ని విటమిన్లు కూడా శరీరానికి అందుతాయి.

-పనిలో పడి మంచినీటిని తాగడం మర్చిపోతుంటారు చాలామంది. ఇది చాలా ప్రమాదకరం. మన శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలను బయటకు పంపడానికి నీరు ఎంతో సహకరిస్తుంది. 

-ముఖ్యంగా మన శరీరం 70 శాతం నీటితోనే నిండి ఉందనే విషయాన్ని మరిచిపోవద్దు. శరీరానికి తగినంత నీరందకపోతే చర్మం సహజత్వాన్ని కోల్పోతుంది.logo