ఉదయాన్నే నీళ్లెందుకు తాగాలి..?


Wed,January 16, 2019 06:55 AM

ఆరోగ్యం విషయంలో తాగు నీరు పాత్ర చాలా ముఖ్యమైంది. వాహనం నడువాలంటే ఇంధనం ఎంత అవసరమో మనిషి శరీరం పనిచేయాలంటే నీరూ అంతే అవసరం. అందునా పరిగడుపున నీళ్లు తాగటం మరింత మేలు చేస్తుంది.

అవేంటంటే...


- ఉదయం లేచిన వెంటనే మంచినీళ్లు తాగితే మల విసర్జన సులభంగా జరుగుతుంది.
- పరిగడుపున నీళ్లు తాగటం వల్ల ఒంట్లో పేరుకుపోయిన వ్యర్ధాలు ఏ రోజుకారోజు బయటికి వెళ్లిపోతాయి.
- పెద్ద పేగు శుభ్ర పడి ఆహారంలోని పోషకాలను మరింత మెరుగ్గా స్వీకరిస్తుంది.
- రక్త వృద్ధి, శుద్ధి జరిగేందుకు ఉదయం తాగే నీరు ఉపయోగపడుతుంది.

- కండరాలు బలపడి, చక్కగా పెరిగేందుకు తగినంత నీరు తాగటం అవసరం.
- జీవక్రియల పనితీరు సగటున 24 శాతం మేర పెరుగుతుంది.
- బరువు తగ్గే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.
- చర్మం సహజంగా, తగినంత తేమతో, మృదువుగా మారుతుంది.

- మూత్ర సంబంధిత ఇన్‌ఫెక్షన్ల ముప్పు తక్కువ. వచ్చినా వెంటనే తగ్గుతాయి.
- ఆకలి, జీర్ణశక్తి పెరుగుతాయి.

12331
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles