గురువారం 01 అక్టోబర్ 2020
Health - Jul 24, 2020 , 17:46:17

నిద్ర‌లో వ‌చ్చే క‌ల‌లు గుర్తుండాలంటే ఇలా చేయాలి!

నిద్ర‌లో వ‌చ్చే క‌ల‌లు గుర్తుండాలంటే ఇలా చేయాలి!

సాధార‌ణంగా ప్ర‌తిఒక్క‌రికీ క‌ల‌లు వ‌స్తుంటాయి. కాక‌పోతే కొన్ని మంచి క‌ల‌లు, కొన్ని పీడ‌క‌ల‌లు. అయిన‌ప్ప‌టికీ ఉద‌యం లేవ‌గానో క‌ల వ‌చ్చింద‌ని గుర్తుంటుంది కానీ ఏం వ‌చ్చిందో గుర్తుండ‌దు. అది మంచైనా చెడైనా. మంచి క‌ల‌లు వ‌చ్చిన‌ప్పుడు గుర్తుంటే ఎంత బాగుండు అని అనుకుంటూరు. కొన్ని రోజుల త‌ర్వాత ఏదైనా ప‌నిచేసేట‌ప్పుడు ఈ ప‌నిని ఇలానే ఇదివ‌ర‌కే చేశాను అని గుర్తొంస్తుంది. అది రియ‌ల్‌గా చేయ‌లేదు. క‌ల‌లో క‌నిపించిందిందే.. మ‌రి ఈ క‌ల‌లు వ‌చ్చిన‌ప్పుడు నిద్ర టైం వేస్ట్ అవుతుందా?  నిద్ర‌లో వ‌చ్చే క‌ల‌లు గుర్తుండాలంటే ఏం చేయాలో వివ‌రంగా తెలుసుకోండి.

నిద్ర త‌గ్గుతుందా..

నిద్ర నాణ్య‌త‌కు, క‌ల‌ల‌కు మ‌ధ్య సంబంధం ఉంది. క‌ల‌ల టైంలో నిద్ర‌కు భంగం క‌లిగిన‌ట్లే. నాణ్య‌మైన నిద్ర లేక‌పోవ‌డం వ‌ల్ల మాన‌సిక ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను గుర‌వుతారు. మానసిక ఆరోగ్య రుగ్మతలు నిద్ర సమస్యలను పెంచుతాయి.

కలలు మ‌ర్చిపోతున్నారా?

నిద్ర‌పోతున్న‌ప్పుడు ఏదైనా భ‌యంక‌ర‌మైన క‌ల వ‌చ్చిన‌ప్పుడు ఉలిక్కిప‌డి లేస్తాం. కొన్నిసార్లు నిద్ర‌లోనే క‌ల కూడా కంటిన్యూ అవుతుంటుంది. అయినా ఉద‌యం లేచేస‌రికి అంతా సూన్యం. ఏం జ‌ర‌గ‌న‌ట్లే ఉంటుంది. అందుకే ఇలా చేస్తే అన్నీ గుర్తుంటాయి.  

* ప్ర‌తిరోజూ నిద్ర‌పోయే ముందు వ‌చ్చే క‌ల‌లు గుర్తుండాలి అని అనుకోవాలి.

* బెడ్ ప‌క్క‌నే ఒక నోట్‌బుక్, పెన్ పెట్టుకోవాలి. నిద్ర మ‌ధ్య‌లో మెళ‌కువ వ‌స్తే ఆ స‌మ‌యంలో వ‌చ్చిన డ్రీమ్ గురించి రాసి పెట్టుకోండి. డ్రీమ్‌లో ఎక్కువ‌గా బాధ‌ప‌డ్డ‌వి, సంతోషించే విష‌యాల‌ను ప‌క్కాగా రాసుకోవాలి.

* ఉద‌యం ప‌డ‌క దిగేముందు రాత్రి ఏదైనా బుక్‌లో రాసి పెట్టుకొని ఉంటే దాన్ని ఒక‌సారి చ‌దువుకోండి.

* డైలీ ఇలా చేస్తూ ఉంటే వ‌చ్చే క‌ల‌ల‌ను గుర్తుంచుకోవ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది.  logo