సోమవారం 21 సెప్టెంబర్ 2020
Health - May 15, 2020 , 19:54:07

ఫామ్‌ కోడి, నాటుకోడి.. ఏకోడి గుడ్డు బెట‌ర్‌?

ఫామ్‌ కోడి, నాటుకోడి.. ఏకోడి గుడ్డు బెట‌ర్‌?

నాటు కోడి గుడ్డు.. ఫామ్‌ కోడి గుడ్డు.. రెండింటిలో ఏది బెటర్‌ అంటే నాటుకోడి గుడ్డే బెటర్‌ అని టక్కున చెబుతారు. అయితే.. ఇది తప్పని పరిశోధకులు చెబుతున్నారు. బ్రౌన్‌, వైట్‌ రెండింటిలోనూ సమానమైన పోషకాలుంటాయని చెబుతున్నారు. - తెలుపు రంగు గుడ్ల‌లో ఎన్ని పోష‌కాలు ఉంటాయో, బ్రౌన్ ఎగ్స్‌లో కూడా అవే పోష‌కాలు ఉంటాయి. రెండింట్లో పెద్ద‌గా తేడా ఉండ‌దు. రంగు మాత్రమే తేడా అంతే అంటున్నారు ప‌రిశోధ‌కులు.

- రుచి విష‌యం కొంచెం తేడా ఉంటుంది. అంత‌మాత్రాన పోస‌కాల ప‌రిమాణంలో మాత్రం తేడా ఉండ‌దు. 

- కేల‌రీలు, ప్రోటీన్స్‌, కొలెస్ట్రాల్ విష‌యంలో రెండు ర‌కాల గుడ్లు ఒక‌టే. బ్రౌన్ ఎగ్స్‌లో మాత్రం ఒమేగా-3 ఫాటీ యాసిడ్స్ కొంచెం ఎక్కువ‌గా ఉంటాయి. 

- బ్రౌన్ ఎగ్స్‌ను సెంద్రియ ప‌ద్ధ‌తిలో ఉత్ప‌త్తి చేస్తారు కాబ‌ట్టి వాటిలో పోష‌కాలు ఎక్కువ‌గా ఉంటాయ‌ని అంద‌రూ అనుకుంటారు. వైట్‌ ఎగ్‌ వల్ల సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తాయనే అపోహ కూడా జనాల్లో ఉంది. అది తప్పని పరిశోధకులు చెబుతున్నారు.  

- వేస‌విలో దొరికే గుడ్లు కాస్త చిన్న‌విగా ఉంటాయి. చ‌లికాలంలో దొరికే గుడ్లు కొంచెం పెద్ద‌గా ఉంటాయి.


logo