ఏయే వంటల్లో ఉప్పు ఎప్పుడు వేయాలో తెలుసా..?


Tue,November 14, 2017 05:50 PM

ఉప్పు... ప్రతి వంటలోనూ ఇది వేయాల్సిందే. లేదంటే దానికి రుచి రాదు. ఉప్పు లేనిదే అసలు ఏ కూర కూడా వండరు. కొంచెం ఉప్పు తక్కువైతే ఏమీ కాదు, కలుపుకోవచ్చు, కానీ అదే ఉప్పు కొంచెం ఎక్కువైతే అప్పుడు ఆ వంటకాన్ని తినలేరు. అయితే ఈ విషయం పక్కన పెడితే.. అసలు వంట వండేటప్పుడు ఏ వంటలో ఉప్పు ఎప్పుడు వేస్తే మంచిదో, చక్కని టేస్ట్ వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

1. మాంసం


మాంసం వండేటప్పుడు ఉప్పును మొదట్లోనే వేయాల్సి ఉంటుంది. అన్ని మసాలా దినుసులతోపాటు ఆరంభంలోనే ఉప్పు వేయాలి. దీంతో మాంసం ముక్కలకు ఉప్పు సరిగ్గా పడుతుంది. చివర్లో వేస్తే ఉప్పు ముక్కలకు సరిగ్గా చేరదు. మాంసం ఉడికే ఆరంభంలోనే ఉప్పు వేస్తే అది ఉడుకుతున్నకొద్దీ ముక్కలు మెత్తగా మారి ఉప్పును గ్రహిస్తాయి. తరువాత చక్కని రుచి వస్తుంది.

2. సూప్స్


సూప్‌లు వంటివి చేసేటప్పుడు ఉప్పు ఎప్పుడైనా వేయవచ్చు. ఎందుకంటే అది ద్రవం కనుక, ఎప్పుడు వేసినా ఉప్పు బాగానే కలుస్తుంది. దాంతో ఇబ్బంది ఏమీ ఉండదు.

3. రైస్, పాస్తా


బియ్యం, పాస్తా వంటివి ఉడుకుతున్నప్పుడు వంట మధ్యలో ఉండగా ఉప్పు వేయాలి. దీంతో ఉప్పు రుచి వంటకు సరిగ్గా వస్తుంది. ఆరంభంలో, చివర్లో వేస్తే ఉప్పు రుచి పోతుంది.

4. బీన్స్


శనగలు, రాజ్మా, సోయా బీన్స్ ఇతర బీన్స్ కూరలు ఏవి వండినా ఆరంభంలో లేదా చివర్లో మాత్రమే ఉప్పు వేయాలి. వంట మధ్యలో ఉప్పు వేయకూడదు. ఉప్పు రుచి రాదు.

5. కూరగాయలు


కూరగాయలు, ఆకు కూరలు ఏవైనా ఫ్రై చేస్తే చివర్లో ఉప్పు వేయాలి. అదే కూర చేస్తే ఆరంభంలోనే ఉప్పు వేయాలి. దీంతో ఉప్పు రుచి పర్‌ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.

5989

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles