బుధవారం 30 సెప్టెంబర్ 2020
Health - Aug 12, 2020 , 17:25:35

ఈ టైంలో నాలుక రంగు మారిందా? చిక్కుల్లో ప‌డిన‌ట్లే!

ఈ టైంలో నాలుక రంగు మారిందా?  చిక్కుల్లో ప‌డిన‌ట్లే!

సాధార‌ణంగా ఆరోగ్యం బాగోలేక‌పోతే డాక్డ‌ర్‌ను సంప్ర‌దిస్తారు. ఆయన ఎలా ఉంది? ఏం బాగ‌లేదు అని ఏం అడ‌గ‌కుండానే నాలుక చూపించు అని అంటారు. నాలుక రంగుని బ‌ట్టి ఆరోగ్యం ఎలా ఉందో చెప్పేస్తారు వైద్యులు. ఇది వారికి వెన్న‌తో పెట్టిన విద్య. మ‌రి ఆ ప‌నేదో మ‌నం చేయ‌లేమా అంటే చెయొచ్చు. నాలుక రంగుని బ‌ట్టి ఆరోగ్యాన్ని గుర్తించాలంటే ఈ కింద విష‌యాలు క్లుప్తంగా తెలుసుకోవాలి. 

* నాలుక గులాబీ రంగులో ఉంటే ఆ వ్య‌క్తి ఆరోగ్యంగా ఉన్న‌ట్లు సంకేతం. 

* కొంత‌మందికి నాలుక తెల్ల‌గా ఉంటుంది. దీన్ని చూసి వారు స‌రిగా బ్రె‌ష్ చేసుకోలేదేమో అనుకుంటారు. కాదు, అలా ఉంటే ర‌క్తంలో హిమోగ్లోబిన్ స్థాయి త‌క్కువ‌గా ఉంద‌ని అర్థం చేసుకోవాలి. వీరికి ఐర‌న్‌, ప్రొటీన్ల లోపం కూడా ఉంటుంది. అలాంటి వారు ముఖ్యంగా విట‌మిన్లు ఉన్న పౌష్టికాహారాన్ని తీసుకోవాలి.

* ర‌క్త ప్ర‌స‌ర‌ణ లోపాల‌తో బాధ‌ప‌డేవారి నాలుక ఊదా రంగులో ఉంటుంది. వీరి శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా ఎక్కువ‌గా ఉంటాయి. వీరు చేయాల్సింద‌ల్లా ఒక‌టే. వ్యాయామం చేయ‌డ‌మే.

* ధూమ‌పానం చేసేవారి పెద‌వులు న‌ల్ల‌గా మారుతాయి. అలాగే నాలుక కూడా న‌ల్ల‌గా మారిపోతుంది. నోటి ఆరోగ్యం ప‌ట్ల అశ్ర‌ద్ద చూప‌డం ప్ర‌మాద‌క‌రం.

* కొంత‌మంది ఎక్కువ‌గా యాంటీ బ‌యాటిక్స్ తీసుకుంటూ ఉంటారు. అలాంటి వారి నాలుక కూడా న‌లుపు రంగులోకి మారుతుంది.

* విట‌మిన్ బి12, ఫోలిక్ యాసిడ్ లోపం ఉండేవారి నాలుక ఎర్ర రంగులో ఉంటుంది. అంతేకాదు వైర‌ల్ ఇన్ఫెక్ష‌న్ వ‌చ్చిన‌ప్పుడు కూడా నాలుక ఇలానే ఉంటుంది.

* రోగ‌నిరోధ‌క శ‌క్తి త‌గ్గింద‌ని ఇలా తెలుసుకోవ‌చ్చు. నాలుక మీద‌, నోట్లోగాని పుండ్లు ఏర్ప‌డితే ఇమ్యునిటీ ప‌వ‌ర్ త‌గ్గిన‌ట్లే.

* ఈ రోజుల్లో ప్ర‌తిఒక్క‌రూ నోట్లో చూయింగ్ గ‌మ్ వేసుకొని న‌ములుతూ ఉంటారు. ఇలా చేయ‌డం వ‌ల్ల నాలుక మీద బ్యాక్టీరియా పెరిగి రంగు మారే అవ‌కాశం ఉంది. అలాగే కూల్‌డ్రింక్స్‌‌, ఆల్క‌హాల్‌కు దూరంగా ఉండ‌డం మంచిది.

* నాలుక‌కు సంబంధించిన ఏ స‌మ‌స్య‌లైనా ఎక్కువ‌రోజులు ప‌ట్టి పీడిస్తుంటే సొంత వైద్యం కాకుండా వైద్యుడిని సంప్ర‌దించ‌డం మంచిది. 

* అందుక‌నే ప్రతిరోజూ ఉద‌యం బ్రెష్ చేసేట‌ప్పుడు నోరు, దంతాల‌తోపాటు నాలుక‌ను కూడా శుభ్రం చేసుకోవాలి. లేదంటే బ్యాక్టీరియా చేరి ఆనారోగ్యానికి గురి చేస్తుంది.  logo