మంగళవారం 27 అక్టోబర్ 2020
Health - Sep 24, 2020 , 13:44:04

దోమ‌ల‌కు వీటి వాస‌న అంటే అస‌లు గిట్ట‌దు!

దోమ‌ల‌కు వీటి వాస‌న అంటే అస‌లు గిట్ట‌దు!

ఏ సీజ‌న్‌లో అయినా కొన్ని ఏరియాల్లో దోమ‌ల బెడ‌ద మాత్రం త‌గ్గ‌దు. ఇంటి చుట్టుప‌క్క‌ల డ్రైనేజీ, మురికి కాలువ‌లు, గుంట‌లు ఇలా ఏవి ఉన్నా అక్క‌డ ఈగ‌లు, దోమ‌ల సహారం ఎక్కువ‌గా ఉంటుంది. వీటి ద్వారానే జ్వ‌రాలు, డెంగ్యూ, చికెన్ గునియా వంటి వ్యాధుల బారిన ప‌డుతున్నారు. అయితే దోమ‌ల‌ను ఇంటి ఆర‌ణ‌లోకి రాకుండా చేయ‌డానికి మార్కెట్లో చాలానే ఉన్నాయి. అయితే డ‌బ్బు పెట్టి దోమ‌ల‌ను త‌రిమేకంటే స‌హ‌జ ప‌ద్ద‌తుల ద్వారా త‌రిమికొట్ట‌వ‌చ్చు. కొంత‌మంది పొగ పెడుతుంటారు. ఈ పొగ దెబ్బ‌కి కూడా దోమ‌లు రావు. వంటింట్లో దొరికే ఇంగ్రీడియంట్స్‌తో ఇలా చేస్తే దోమ‌లు ఇంట్లోకి కాదు క‌దా.. చుట్టు ప‌క్క‌ల కూడా ఉండ‌వు. మ‌రి ఎలా చేయాలో తెలుసుకోండి. 

వెల్లుల్లి : ఈ వాస‌న అంటే దోమ‌ల‌కు అస‌లు ప‌డ‌దు. అందుకే వెల్లుల్లి రెబ్బ‌లు క‌నుక తింటే దోమ‌లు మీ వ‌ద్ద‌కు రాకుండా ఉంటాయి.

తులసి : ఈ చెట్లు భార‌తీయుల ప్ర‌తిఒక్క‌రి ఇంట్లో త‌ప్ప‌నిస‌రిగా ఉంటుంది. ఈ చెట్లు ఎక్క‌డైనా సులువుగా పెరుగుతుది. దీని ఆకుల నుంచి సేక‌రించిన నూనె దోమ‌ల‌ను త‌రిమికొట్ట‌డానికి ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. 

దోమ‌ల‌ను త‌రిమికొట్ట‌డానికి సువాస‌న‌లున్నాయి. వీటిని క‌నుక ఇంట్లో ఉప‌యోగిస్తుంటే దోమ‌లు రాకుండా ఉంటాయి. అవి ఇవే.. 

* సిట్రోనెల్లా  

* లవంగం

* సెడార్ వుడ్

* లావెండర్

* యూకలిప్టస్

* పిప్పరమెంటు

* రోజ్మేరీ

* లెమ‌న్‌గ్రాస్‌

* జెరానియోల్ 


logo