సోమవారం 06 ఏప్రిల్ 2020
Health - Mar 13, 2020 , 19:14:30

ప్రమాదం జరిగితే... ఇలా చేయండి!

ప్రమాదం జరిగితే... ఇలా చేయండి!

What Should You Do After a Accident

 రోడ్డు మీద యాక్సిడెంట్లు చాలా ఎక్కువ అవుతున్నాయి. కొన్నిసార్లు యాక్సిడెంట్‌ కన్నా ఎక్కువగా ప్రమాదం జరిగినవాళ్లను హాస్పిటల్‌కు తీసుకువెళ్లేటప్పుడు చనిపోతున్నారు. అందుకే ప్రమాదం జరిగినప్పుడు వాళ్లని ఎలా హ్యాండిల్‌ చేయాలో తెలిసి ఉండాలి.

 ప్రమాదం జరిగినప్పుడు కడుపు లేదా రొమ్ము లోకి ఏ ఇనుప చువ్వో చొరబడితే దాన్ని లాగివేయాలనే ప్రయత్నం చేయకూడదు. కొన్నిసార్లు అది గుచ్చుకున్నప్పుడు లోపలి అవయవాలకు దెబ్బ తగలకున్నప్పటికీ తీసివేసే సమయంలో దెబ్బతినవచ్చు. ఇలాంటివి డాక్టర్‌ పర్యవేక్షణలో మాత్రమే తీసివేయాలి. 

రైలు ప్రమాదంలో  వెన్నుపాముకు కొంచెం దెబ్బతగిలినప్పుడు కాళ్లూ చేతులు చాలా బలహీనంగా తయారవుతాయి. వాటి కదలికలు నెమ్మదిగా ఉంటాయి. కాని వెన్నెముక విరిగిపోయినప్పుడు మాత్రం కాళ్లూ చేతుల కదలికలు పూర్తిగా ఆగిపోతాయి. ఇలాంటప్పుడు మరింత జాగ్రత్త అవసరం.

దెబ్బ తగిలినప్పుడు ఇద్దరు తలను, వెనుక భాగాన్ని ఇద్దరు, మరో ఇద్దరు కాళ్లను మొత్తం ఆరుగురైనా జాగ్రత్తగా పట్టుకుని తీసుకెళ్లాలి. 

తీవ్రమైన రక్తస్రావం కాకుండా జాగ్రత్తపడాలి.  ఉన్నా, వెన్నుపూసల భాగంలో అసాధారణంగా కనిపించినా అత్యవసరంగా చికిత్స అవసరమని గ్రహించాలి. 

డైపమాదం జరిగిన వ్యక్తికి ఎంత త్వరగా వైద్యం అందితే అంత త్వరగా ప్రాణాలను కాపాడవచ్చు. మొట్టమొదటగా తగ్గిపోయిన బీపీని సాధారణ స్థితికి తీసుకురావడానికి ఐవి ఫ్లూయిడ్‌ ఇస్తారు.

అవసరాన్ని బట్టి రక్తం ఎక్కించాల్సి వస్తుంది. నిరంతరం కృత్రిమ శ్వాస అందించాల్సి ఉంటుంది. 

సీట్‌ బెల్టులు ధరించడం, ట్రాఫిక్‌ నియమాలు పాటించడం, ఎంత తొందర ఉన్నా సంయమనాన్ని కలిగి ఉండడం వల్ల చాలావరకు రోడ్డు ప్రమాదాల్ని నివారించవచ్చు. 


logo